The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Raja Saab : రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘ది రాజా సాబ్’ రాబోయే ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తూ ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇవ్వబోతున్నారు.
Raja Saab Exclusive Update : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. టాలీవుడ్‌కు పాన్ ఇండియా మార్గెట్ ని సెట్ చేసి.. ఈ కటౌట్‌కి ఉన్న కంటెంట్ ఇదని సత్తా చాటిన ప్రభాస్.. సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా ప్రతి సినిమాతో తన పరిధిని పెంచుకుంటూ.. తద్వారా టాలీవుడ్‌ని తారా స్థాయికి చేర్చుతున్నారు. ఇప్పుడు ప్రభాస్ చేతిలో దాదాపు అరడజను సినిమాలున్నాయంటే.. ఎంతగా ఆయన ఇంపాక్ట్ సినీ ఇండస్ట్రీపై ఉందనేది అర్థం చేసుకోవచ్చు. అలాగే రూ. 1000 కోట్ల మార్క్ సెట్ చేసి.. బాలీవుడ్ ఖాన్‌లకు కూడా చెమటలు పట్టిస్తున్నాడీ బాహుబలి. యాక్షన్ హీరోకి కేరాఫ్ అడ్రస్‌గా పిలుచుకునే ప్రభాస్.. ఫస్ట్ టైమ్ తన జానర్ వదిలి.. ‘ది రాజా సాబ్’ అనే చిత్రంతో రొమాంటిక్ హారర్ టచ్ ఇస్తున్నాడు.
Read Also : "పీలింగ్స్" సాంగ్ పక్కా లోకల్... పాడింది ఈ పాపులర్ జానపద గాయకులే అని తెలుసా?
మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘ది రాజా సాబ్’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి ఒక ఎక్స్‌క్లూజివ్ అప్డేట్ ఏమిటంటే.. రాబోయే ఫెస్టివల్స్‌ని ఈ రాజా సాబ్ టార్గెట్ చేస్తున్నాడు. అవును.. ‘ది రాజా సాబ్’ సినిమా అప్డేట్స్ ఇకపై వచ్చే ప్రతి ఫెస్టివల్‌కి ఉండేలా మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ డిసెంబర్‌లో వచ్చే ఫెస్టివల్ ‘క్రిస్మస్’. ఈ క్రిస్మస్‌కి అభిమానులకు ‘ది రాజా సాబ్’ టీజర్‌తో ప్రభాస్ ట్రీట్ ఇవ్వబోతున్నారు.
ఇటీవల వచ్చిన గ్లింప్స్‌తోనే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరగగా.. ఇప్పుడు రాబోయే టీజర్‌తో ఇటు ఫ్యాన్స్‌కి, అటు ట్రేడ్‌కి పని కల్పించబోతున్నాడు ప్రభాస్. క్రిస్మస్ తర్వాత వచ్చే సంక్రాంతికి కూడా ఓ ట్రీట్ రెడీ చేస్తున్నాడు ప్రభాస్. రాబోయే సంక్రాంతికి ఫ్యాన్స్‌తో స్టెప్పులేయించేలా ఓ మాస్ పాటని వదలబోతున్నట్లుగా తాజా సమాచారం. ఇలా రాబోయే ఫెస్టివల్స్‌కి ఫ్యాన్స్‌కి ట్రీట్ రెడీ చేస్తున్నాడీ డార్లింగ్.
‘ది రాజా సాబ్’ విషయానికి వస్తే.. ప్రస్తుతం టీమ్ అంతా షూటింగ్‌తో బిజీగా ఉంది. ఈ నెలాఖరుకు షూటింగ్ మొత్తం పూర్తవుతుందని, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ ఇంతవరకు కనిపించని సరికొత్త అవతార్‌లో కనిపించబోతున్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో 2025, ఏప్రిల్ 10న ‘ది రాజా సాబ్’ గ్రాండ్‌గా థియేటర్లలోకి రానున్నాడు.
‘ది రాజా సాబ్’ సంగతి ఇలా ఉంటే.. మరోవైపు ‘సలార్ 2’ పనులు కూడా శరవేగంగా ముందుకు కదులుతున్నాయి. నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 AD’ పార్ట్ 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇటీవల హను రాఘవపూడితో మరో సినిమాకు ఓకే చెప్పిన ప్రభాస్.. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ సినిమా చేయాల్సి ఉంది. ఇవి కాకుండా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ రీసెంట్‌గా ప్రభాస్‌తో మరో రెండు సినిమాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read : సినిమాల నుంచి తప్పుకుంటున్న 12th Fail హీరో... వాళ్ల కోసమే ఈ షాకింగ్ నిర్ణయమట