Vikrant Massey : సినిమాల నుంచి తప్పుకుంటున్న 12th Fail హీరో... వాళ్ల కోసమే ఈ షాకింగ్ నిర్ణయమట
Vikrant : 12th Fail తో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే సినిమాల నుంచి తప్పుకుంటున్నారు. ఈ మేరకు ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Vikrant Massey : ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే తాజాగా సంచలన ప్రకటన చేసి వార్తల్లో నిలిచారు. వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విక్రాంత్ కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి అభిమానులకు షాక్ ఇచ్చారు. విక్రాంత్ మాస్సే అంటే అందరికీ తెలుసో లేదో కానీ 12th Fail హీరో అంటే మాత్రం అందరికీ సుపరిచితుడే. ఈ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యారు విక్రాంత్ మాస్సే. ఇక ఇప్పటికే స్టార్ స్టేటస్ అందుకున్న విక్రాంత్ పాన్ ఇండియా నటుడిగా గుర్తింపుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఇలా అనుకుంటున్న తరుణంలో సినిమాల నుంచి తప్పుకుంటున్నాను అంటూ ప్రకటించి షాక్ ఇచ్చారు.
ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అందులో "కొన్నేళ్ళుగా మీ అందరి నుంచి అసాధారణమైన ప్రేమ, అభిమానాన్ని అందుకుంటున్నాను. ఇప్పటి వరకు నాకు సహకరించిన , సపోర్ట్ అందించిన అందరికీ ధన్యవాదాలు. అయితే ఇప్పుడు ఓ తండ్రిగా, కొడుకుగా, భర్తగా బాధ్యతలు నెరవేర్చాల్సిన టైం వచ్చింది. అందుకే కొత్త సినిమాలను అంగీకరించడం లేదు. గత కొన్ని ఏళ్లు అద్భుతంగా గడిచాయి. ఇప్పుడు ఫ్యామిలీకి టైంకి స్పెండ్ చేసే సమయం వచ్చేసింది. 2025లో రిలీజ్ అయ్యే సినిమానే నా లాస్ట్ మూవీ" అంటూ విక్రాంత్ ప్రకటించారు. అయితే ఆయన తీసుకున్న ఈ సడన్ డెసిషన్ తో అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
View this post on Instagram
ఇదిలా ఉండగా విక్రాంత్ మాస్సే వయసు ఇప్పుడు 37 ఏళ్లు. ఆయన సీరియల్స్ తో కెరీర్ ను ప్రారంభించి, 2017లో 'ఎ డెత్ ఇన్ ది గంజ్' అనే సినిమాతో హీరోగా వెండితెర ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. విక్రమ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే... 12th Failకు ముందు, తర్వాత అని చెప్పుకోవాలి. అంతకంటే ముందే ఆయన ఎన్నో సినిమాల్లో నటించినా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నది మాత్రం 12th Fail సినిమాతోనే. విదు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2023 అక్టోబర్ 27న రిలీజ్ అయింది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే మనోజ్ అనే పాత్రలో నటించారు. మేధా శంకర్ హీరోయిన్ గా నటించగా, అనురాగ్ పాఠక్ రాసిన ఓ నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు.
అయితే సాధారణంగా స్టార్స్ అందరూ క్రేజ్ పెరిగే కొద్దీ... దానికి తగ్గట్టుగా మరింత క్యాష్ చేసుకోవాలని అనుకుంటారు. మరింత రెమ్యూనరేషన్ పెంచుతూ, క్షణం తీరిక లేకుండా గడుపుతారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న చందాన వ్యవహరిస్తూ ఆస్తులు కూడబెట్టుకుంటారు. ఇక ఫ్యామిలీ కోసం టైమ్ స్పెండ్ చేయడానికి అప్పుడప్పుడు చిన్న బ్రేక్ తీసుకోవడం చూస్తూనే ఉంటాము. కానీ విక్రాంత్ లాగా ఫ్యామిలీ కోసం సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టడం అనేది నిజంగా అభినందనీయం. కాకపోతే ఆయనను తెరపై చూడాలి అనుకునే వాళ్ళకు మాత్రం ఇది బ్యాడ్ న్యూస్.
Also Read : ఘంటసాల బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్... అమర గాయకుడికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్