అన్వేషించండి

Ghantasala Biopic: ఘంటసాల బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్...‌ అమర గాయకుడికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్

Ghantasala Biopic Release Date: అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితంపై రూపొందిన బయోపిక్ ఘంటసాల ది గ్రేట్ రిలీజ్ డేట్ పోస్టర్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఘంటసాల (Ghantasala Venkateswara Rao) గానం వినని తెలుగు ప్రజలు ఉండాలని చెబితే అస్సలు అతిశయోక్తి కాదు. అమర గాయకుడిగా అందరి హృదయాలలో ఆయన స్థానం ఎప్పటికీ సుస్థిరం. అటువంటి మహనీయుడు జీవితం మీద రూపొందించిన బయోపిక్ 'ఘంటసాల ది గ్రేట్' (Ghantasala The Great). మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ రోజు రిలీజ్ డేట్ పోస్టర్ లాంచ్ చేశారు.

ఫిబ్రవరి 14న థియేటర్లలోకి ఘంటసాల ది గ్రేట్!
Ghantasala The Great Release Date: ఘంటసాల వెంకటేశ్వర రావు పాత్రలో గాయకుడు కృష్ణ చైతన్య, ఘంటసాల భార్య సావిత్రి పాత్రలో కృష్ణ చైతన్య భార్య మృదుల నటించగా... 'ఘంటసాల ది గ్రేట్' చిత్రానికి సిహెచ్ రామారావు దర్శకత్వం వహించారు. సతీమణి సిహెచ్ ఫణీతో కలిసి‌ ప్రొడ్యూస్ చేశారు. ఫిబ్రవరి 14న థియేటర్లలోకి సినిమాను తీసుకురానున్నట్లు ఈ రోజు హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు. 

తెలుగు ప్రజల కర్తవ్యం ఈ సినిమా చూడటం!
ఘంటసాల బయోపిక్ చూడడం తెలుగు ప్రజల కర్తవ్యం అని ఎం వెంకయ్య నాయుడు (M Venkaiah Naidu) అన్నారు. ఒక సాధారణ వ్యక్తిగా మొదలైన ఆయన ప్రయాణం... భావితరాలకు ఎంతో స్ఫూర్తి ఇచ్చే విధంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.‌ ఘంటసాల మీద సినిమా తీయడం సాహసం అని పేర్కొన్న వెంకయ్య... ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచించకుండా ప్రజలలో సామాజిక చైతన్యం కలిగించేందుకు, వెండితెరపై ఒక సుమధుర గాయకుడి జీవితాన్ని ఆవిష్కరించేందుకు చేసిన ప్రయత్నంగా ఈ సినిమాను చూడాలని ఆయన వివరించారు.

Also Readకొరియా నుంచి ఆర్టిస్టులు - స్టంట్‌మ్యాన్‌లు... వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్

ఘంటసాల కేవలం అమర గాయకుడు మాత్రమే కాదు అని, స్వతంత్ర సంగ్రామంలో దేశం తరఫున పాల్గొన్నారని, అటువంటి మహనీయుని జీవితం మీద ఎటువంటి లాభాపేక్ష లేకుండా రామారావు, ఫణి దంపతులు సినిమా తీశారని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ తరం ప్రేక్షకులు ఆయన జీవితం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు.‌

ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్!
ఘంటసాలకు భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించాలని పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి (R Narayana Murthy) డిమాండ్ చేశారు. ఉత్తరాదిలో కొంత మంది గాయకులకు భారతరత్న ఇచ్చారని, ఘంటసాలకు ఎందుకు ఇవ్వరు? ఆయన ప్రశ్నించారు. తమిళనాడులో ఎంజీ రామచంద్రన్ భారతరత్న అందుకున్నారని, మన తెలుగునాట నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వలేదని, ఆయనకు కూడా ఆ అవార్డు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. 

ఘంటసాల వ్యక్తిత్వాన్ని చెప్పే ప్రయత్నమే మా సినిమా
ఘంటసాల గానం గురించి ప్రజలు అందరికీ తెలుసు అని, కానీ ఆయన వ్యక్తిత్వం కొంతమందికి మాత్రమే తెలుసని చిత్ర దర్శకులు సిహెచ్ రామారావు అన్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పడానికి వినయంతో విద్య ప్రకాశిస్తుందని ఉదాహరణ ఇవ్వడానికి నిలువెత్తు నిదర్శనం ఘంటసాల జీవితం అని తెలిపిన ఆయన తమ సినిమాలో ఘంటసాల వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని ఆవిష్కరించామని వివరించారు. భారత సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఏ గాయకుడు మీద పూర్తిస్థాయి నిడివి ఉన్న సినిమా రాలేదని, ఆ అవకాశం తనకు 'ఘంటసాల ది గ్రేట్' బయోపిక్ ద్వారా కలిగినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని సిహెచ్ రామారావు ముగించారు.

Also Read: 'దసరా' దర్శకుడికి అవకాశం ఇస్తున్న చిరంజీవి - మెగా మాస్ మూవీ లోడింగ్?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Venkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Actress Shobita: సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
సినీ పరిశ్రమలో విషాదం - హైదరాబాద్‌లో బుల్లితెర నటి ఆత్మహత్య
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Maharastra CM: ఉత్కంఠకు తెర పడుతుందా? - రేపే మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు!
ఉత్కంఠకు తెర పడుతుందా? - రేపే మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు!
Embed widget