Chiranjeevi: 'దసరా' దర్శకుడికి అవకాశం ఇస్తున్న చిరంజీవి - మెగా మాస్ మూవీ లోడింగ్?
Chiranjeevi new movie: మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం శ్రీకాంత్ ఓదెల అందుకుంటున్నారా? అంటే... 'అవును' అని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినపడుతోంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కొత్త సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఒక సినిమా తీసి మాస్ హిట్ కొట్టి, అదే హీరోతో మరో సినిమా చేస్తున్న యువ దర్శకుడితో ఆయన ఓ సినిమా చేయనున్నారా? అని అడిగితే... 'అవును' అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...
'దసరా' దర్శకుడితో చిరంజీవి సినిమా!?
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెలంగాణలో సింగరేణి బొగ్గు గని నేపథ్యంలో రూపొందిన సినిమా 'దసరా'. విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ఆ సినిమాతో శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు నాని హీరోగా మరో సినిమా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం అది సెట్స్ మీద ఉంది. అది పూర్తయిన తర్వాత చిరుతో సినిమా చేస్తారని సమాచారం.
Chiranjeevi New Movie In Srikanth Odela: యువ దర్శకులతో సినిమాలు చేయడానికి చిరంజీవి ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మారుతి, వెంకీ కుడుముల దగ్గర కథలు కూడా విన్నారు. అయితే ఆయా సినిమాలు వర్కౌట్ కాలేదు. సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇటీవల శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథకు మెగాస్టార్ చిరంజీవి మంత్రముగ్ధులు అయ్యారట. అతనితో సినిమా చేయడానికి ఓకే అని చెప్పారట.
సుకుమార్ దగ్గర పని చేసిన శ్రీకాంత్!
'దసరా' సినిమాతో దర్శకుడుగా పరిచయం కావడానికి ముందు క్రియేటివ్ జీనియస్ లెక్కల మాస్టర్ సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశారు శ్రీకాంత్ ఓదెల. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తీసిన 'రంగస్థలం' సినిమా కూడా ఆయన పని చేసినట్లు సమాచారం. చెర్రీతో ఆయనకు పరిచయం ఉంది. పైగా దసరా వంటి హిట్ తీసిన అనుభవం ఉంది. అందుకే శ్రీకాంత్ ఓదెలకు వెంటనే ఓకే చెప్పారట.
Also Read: అల్లు అర్జున్ హీరో కావడం వెనుక 'చిరు' కథ - మెగా మల్టీస్టారర్ ఆగితే తెరపైకి వచ్చిన 'గంగోత్రి'
ప్రస్తుతం చిరంజీవి చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా మాత్రమే ఉంది. నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా 'బింబిసార' అంటే భారీ బ్లాక్ బస్టర్ తీసిన వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ఆయన 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. అది పూర్తి అయిన తర్వాత ఏ సినిమా చేస్తారు? అనేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.
సంక్రాంతికి 'విశ్వంభర' విడుదల చేయాలని ప్లాన్ చేసినా... కుదరలేదు. 'గేమ్ చేంజర్' సినిమా కోసం త్యాగం చేశారు చిరంజీవి. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల చిత్రానికి ఓటు వేసినట్లు తెలుస్తోంది. నాని హీరోగా చేస్తున్న సినిమా శ్రీకాంత్ వదల పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు చిరంజీవి ఖాళీగా ఉంటారా మధ్యలో మరొక సినిమా చేస్తారా అనేది చూడాలి.