Prakash Raj: వారం పాటూ ప్రకాశ్ రాజ్ మౌనవ్రతం...
ఇటీవల 'మా' ఎలక్షన్స్ లో భాగంగా ప్రకాష్ రాజ్..దాదాపు 2 నెలలు వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్, విమర్శలతో మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా వారం పాటు మౌనవ్రతం చేస్తానంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది
మొన్నటి వరకూ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల్లో బిజీగా ఉన్న ప్రకాశ్ రాజ్ ఇప్పుడు సడెన్ గా మౌనవ్రతం పాటిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. ఇంతకీ మౌనవ్రతం వెనుక కారణాలేంటంటే...రెండు నెలల క్రితం ఓ తమిళ సినిమా షూటింగ్ లో భాగంగా యాక్సిడెంట్ కి గురైన విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ చేతికి దెబ్బతగలడంతో హైదరాబాద్ లోనే సర్జరీ చేయించుకున్నారు. అప్పటి నుంచి తన హెల్త్ కండిషన్ గురించి ఎప్పటికప్పుడు అభిమానులకు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ వచ్చారు. ఆ తర్వాత 'మా' ఎన్నికల హడావుడిలో బిజీగా ఉన్న ప్రకాశ్ రాజ్ తాజాగా మరోసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ మేరకు తన ఆరోగ్య పరిస్థితిపై అప్ డేట్ చేస్తూ ట్వీట్ చేశారు.
Had a complete check up with the doctors.. I’m rocking .. only my vocal chords need complete rest for a week. So “Mouna vratha “ .. will bask in silence..Bliss
— Prakash Raj (@prakashraaj) November 15, 2021
తాను పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారని... కాకపోతే ఓ వారం పాటు మౌనవ్రతం పాటించాల్సి ఉందని పేర్కొన్నారు. ''డాక్టర్స్ వద్ద కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకున్నాను. ఐయామ్ రాకింగ్. అయితే వోకల్ కార్డ్స్ కి మాత్రం ఓ వారంపాటు విశ్రాంతి అవసరం. అందుకే మౌనవ్రతం చేయబోతున్నా. మౌనం ఆనందాన్ని ఇస్తుంది'' అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ప్రకాశ్ రాజ్ రీసెంట్ గా 'జై భీమ్' 'పెద్దన్న'లో నటించాడు. ఇకపోతే ప్రకాశ్ రాజ్ ఈ మధ్య 'మా' ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేసి ప్రత్యర్థి మంచు విష్ణుపై ఓడిపోయారు. ప్రకాశ్‌రాజ్ ట్వీట్‌పై స్పందించిన కొందరు నెటిజన్లు తొందరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.
Also Read: పవన్ కల్యాణ్ సినిమా వెనక్కి వెళ్లడం లేదు... సంక్రాంతి బరిలోనే 'భీమ్లా నాయక్'
Also Read: లాయర్లతో రవితేజ మంతనాలు... సెక్షన్ల గురించి ఆరా తీస్తున్న మాస్ మహారాజ్
Also Read: నామినేషన్ లో ఎనిమిది మంది.. ఎవరెవరంటే..?
Also Read: 'రాధేశ్యామ్' ఫస్ట్ సాంగ్ వచ్చేసిందోచ్.. ఈసారి కూడా కొత్తగా ట్రై చేస్తూ..
Also Read: ప్రేయసిని పెళ్లాడిన బాలీవుడ్ స్టార్.. ఫొటోలు వైరల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి