Bigg Boss 5 Telugu: నామినేషన్ లో ఎనిమిది మంది.. ఎవరెవరంటే..?
మనసులో ఉండే నిజాలు బయటపెట్టండి..నిజాలు నిలదీస్తూ నామినేట్ చేయండి అని బిగ్ బాస్ ఆదేశించారు
సన్నీ, మానస్, కాజల్ డిస్కషన్ పెట్టుకున్నారు. యానీ మాస్టర్ 'పాము' అని, శ్రీరామచంద్ర 'స్లోత్' అని.. రవికి.. నటరాజ్ మాస్టర్ ఇచ్చిందే కరెక్ట్ అని అన్నాడు సన్నీ. తనను చింపాజీ అని అనుకున్న సన్నీ.. సిరి 'కట్లపాము', షణ్ముఖ్ 'నల్ల ఫాక్స్' అని అన్నాడు. దీనికి కాజల్ నవ్వుతూనే ఉంది.
నామినేషన్ ప్రక్రియ..
మనసులో ఉండే నిజాలు బయటపెట్టండి..నిజాలు నిలదీస్తూ నామినేట్ చేయండి అని బిగ్ బాస్ ఆదేశించారు.
రవి - 'నీ తప్పు నీకు చెబితే ఎందుకు ఫేక్ అన్నావో అర్థం కాలేదంటూ' సన్నీను నామినేట్ చేశాడు రవి. అందరిముందు బ్యాడ్ బిహేవియర్ అనడం నచ్చలేదని అన్నాడు సన్నీ. ఇప్పటికి కూడా ఫేక్ అనుకుంటావా అంటే ఎస్ తన అభిప్రాయం మారదన్నాడు సన్నీ. తరువాత కాజల్ ని నామినేట్ చేస్తూ.. 'సన్నీ మాటలు జారుతుంటే.. ఫ్రెండ్ గా అడ్డుకోవడం మానేసి, రెచ్చగొట్టావ్ అని' రీజన్ చెప్పాడు రవి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
షణ్ముఖ్ - కాజల్ ని నామినేట్ చేస్తూ.. 'నువ్ ఇంటి నుంచి వెళ్లిపోతే గొడవలు తగ్గిపోతాయనిపిస్తుంది' అని చెప్పాడు. తరువాత ప్రియాంకను నామినేట్ చేశాడు.
మానస్ - షణ్ముఖ్ ని నామినేట్ చేస్తూ.. అన్నీ ఊహించుకొని స్టేట్మెంట్స్ ఇస్తున్నాడని రీజన్ చెప్పాడు. తరువాత యానీ మాస్టర్ ని నామినేట్ చేశాడు.
శ్రీరామ్ - సన్నీని నామినేట్ చేస్తూ.. టాస్క్ అగ్రెసివ్ అయిపోతున్నాడని రీజన్ చెప్పాడు. ఆ తరువాత మానస్ ని నామినేట్ చేశాడు.
కాజల్ - 'నేను ఎన్నిసార్లు మీతో మాట్లాడడానికి ట్రై చేసినా.. నెగెటివ్ వైబ్ అని దూరం పెట్టారు. ఎక్కిరించడం అసలు నచ్చలేదు' అని రీజన్ చెప్పి యానీ మాస్టర్ ని నామినేట్ చేసింది. ''నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతే గొడవలు తగ్గుతాయనే స్టేట్మెంట్ నేను తీసుకోలేను'' అంటూ షణ్ముఖ్ కి చెప్పి అతడిని నామినేట్ చేసింది.
సిరి - ప్రియాంకను నామినేట్ చేస్తూ.. 'మానస్ గేమ్ కూడా నువ్వే ఆడేస్తున్నావేమో అనిపిస్తుంది. నీ గేమ్ నువ్ ఆడు. కొన్ని విషయాల్లో నచ్చడం లేదని' చెప్పింది. ఆ తరువాత కాజల్ ని నామినేట్ చేస్తూ.. 'ఒకవేళ నన్ను నామినేట్ చేయాలనుకుంటే స్ట్రాంగ్ రీజన్ తో రా తీసుకుంటాను. అలా సిల్లీ రీజన్స్ తో మాత్రం నన్ను నామినేట్ చేయకు' అని కాజల్ ని నామినేట్ చేసింది సిరి. 'సిల్లీ రీజన్ కాదు.. వన్ ఆఫ్ ది పాయింట్ అని' కాజల్ చెప్పగా.. అయితే నీ దగ్గరే పెట్టుకో అని చెప్పింది సిరి. ''సడెన్ గా వైబ్స్ మారిపోతాయ్.. ఎందుకు మారిపోతాయో అర్ధం కాదు.. క్లారిఫికేషన్ అడిగితే మాట్లాడరు'' అని కాజల్ అనగా.. వెంటనే సిరి.. ''నాకు నీ మీద ఎఫెక్షన్ లేదు.. ఇష్టం లేదు.. అందుకే నేను నీతో మాట్లాడట్లేదు'' అని చెప్పింది.
ప్రియాంక - షణ్ముఖ్, సిరిలను నామినేట్ చేసింది. ఈ సమయంలో సిరి, ప్రియాంకల మధ్య మాటల యుద్ధం జరిగింది.
సన్నీ - శ్రీరామ్ ని నామినేట్ చేస్తూ.. 'నిన్ను నామినేట్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి' అని రెండు, మూడు కారణాలు చెప్పాడు. సిరి కారణంగా తన గేమ్ మధ్యలో ఆగిపోయిందని రీజన్ చెప్పి ఆమెని నామినేట్ చేశాడు.
యానీ మాస్టర్ - మానస్ ని నామినేట్ చేసి.. రీజన్స్ చెప్తుండగా.. 'మాస్టర్ ఇంక చాలు' అని అన్నాడు. ఆ తరువాత కాజల్ ని నామినేట్ చేస్తూ..'నీతో నాకు నెగెటివ్ వైబ్ వచ్చింది' అని యానీ మాస్టర్.. కాజల్ తో చెప్పగా.. 'నాకు ఎప్పుడూ తెలియలేదు నా మీద మీకు నెగెటివ్ వైబ్ ఉంది. నాకు వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చి చెప్పినప్పుడే తెలిసింది. నేను అంతర్యామిని కాదు అన్నీ తెలియడానికి' అంటూ కాజల్ ఫైర్ అయింది. దానికి కూడా యానీ మాస్టర్ ఇమిటేట్ చేసింది. 'ఇది రెస్పెక్ట్.. ఎక్కిరించడం రెస్పెక్ట్.. మీరు నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారో.. నేను ఫీల్ అవుతున్నాను. అది నా ఒక్కదానికే అర్ధమవుతుంది' అంటూ కాజల్ అరిచి చెప్పింది. 'నేను డిస్ రెస్పెక్ట్ చేస్తే.. నీ కాళ్లు మొక్కుతా..' అంటూ యానీ.. 'అది డిస్ రెస్పెక్ట్ చేయడమే' అని చెప్పింది కాజల్.
ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు.. షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, యానీ, ప్రియాంక, మానస్, కాజల్, సన్నీ.
Also Read: 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి కథియవాడి'
Also Read: సన్నీ & కో ని టార్గెట్ చేశారా... బిగ్ బాస్ హౌస్ లో పదకొండోవారం నామినేషన్ల హీట్
Also Read: విజేతగా నిలిచేది ఒక్కడే... ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి?... చెర్రీ వాయిస్‌తో అదిరిపోయిన గని టీజర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి