Ghani teaser: విజేతగా నిలిచేది ఒక్కడే... ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి?... చెర్రీ వాయిస్‌తో అదిరిపోయిన గని టీజర్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సర్ గా చేస్తున్న సినిమా ‘గని’. ఈ సినిమా టీజర్ విడుదలైంది.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ‘గని’. ఆ సినిమా టీజర్ సోమవారం విడుదలై అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. దీనికి ముఖ్యకారణం వాయిస్ ఓవర్ ఇచ్చింది మరో మెగా హీరో రామ్ చరణ్. అతని ఇంటెన్సివ్ వాయిస్ టీజర్‌కు స్పెషల్ అట్రక్షన్ గా మారింది. ‘ఇక్కడున్న ప్రతి ఒక్కటికీ ఛాంపియన్ అయిపోవాలన్న ఆశ ఉంటుంది. కానీ విజేతగా నిలిచేది ఒక్కడే... ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి? వై యూ’, ‘ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో ఉంటాం... కానీ గెలిస్తే చరిత్రలో ఉంటాం’ అంటూ చాలా పవర్ ఫుల్ డైలాగులతో సాగింది టీజర్. ఈ ఒక్క టీజర్ ‘గని’ ఎంత పవర్ ప్యాక్ గా రాబోతోందో చెప్పేస్తోంది. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అధ్భుతమనే చెప్పాలి.
ఈ టీజర్ లో సినిమాలోని ముఖ్యపాత్రలన్నింటినీ కొన్ని సెకన్లపాటూ చూపించేశారు మేకర్స్. హీరోయిన్ సాయి మంజ్రేకర్, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి... వీరంతా టీజర్ లో కాసేపు మెరుస్తారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన లుక్స్, గ్లింప్స్, వరల్డ్ ఆఫ్ గని వీడియోలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. లక్షల్లో వ్యూస్ ను సంపాదించుకున్నాయి. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే డిసెంబర్ 24 న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
సినిమా రిలీజ్ కోసం ఎప్పటి నుంచో ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు మూవీ మేకర్స్. ఒక్కొక్క పాత్రను రివీల్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే నదియా పోషిస్తున్న మాధురి పాత్రను, జగపతి బాబు నటిస్తున్న ‘ఈశ్వర్ నాథ్’ పాత్రను విడుదల చేశారు. హీరోయిన్ సాయి మంజ్రేకర్ ‘మాయ’గా పరిచయం చేశారు.
[insta]
View this post on Instagram
Also Read: జగపతి బాబులా శ్రీకాంత్ కూడా సక్సెస్ అవుతారా?
Also Read: హీరోయిన్ షాలు చౌరాసియాపై కేబీఆర్ పార్క్ దగ్గర దాడి... ఖరీదైన మొబైల్ లాకెళ్లిన దుండగుడు
Also Read: కోర్టుకు వెళ్లే ఆలోచన లేదు... ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో మాట్లాడతాం! - 'ఆర్ఆర్ఆర్' నిర్మాత
Also Read: ఓటీటీలో 'శ్రీదేవి సోడా సెంటర్' రికార్డు... సినిమాను కోటి నిముషాలు చూశారు!
Also Read: అటెన్షన్ కోసం నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు.. శిల్పాశెట్టి రియాక్షన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి