Attack on Chourasiya: హీరోయిన్ షాలు చౌరాసియాపై కేబీఆర్ పార్క్ దగ్గర దాడి... ఖరీదైన మొబైల్ లాకెళ్లిన దుండగుడు
Chourasiya Latest News: హైదరాబాద్ సిటీలోని కేబీఆర్ పార్క్ దగ్గర మోడల్, హీరోయిన్ షాలు చౌరాసియాపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఆమె దగ్గర నుంచి ఖరీదైన మొబైల్ లాక్కుని వెళ్లారు.
కేబీఆర్ పార్క్‌కు నిత్యం వందల మంది వాకింగ్ కు వెళుతూ ఉంటారు. పార్క్ చుట్ట పక్కల రోడ్లు కూడా ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. అటువంటి పార్క్ దగ్గర ఆదివారం రాత్రి మోడల్, కొన్ని చిన్న సినిమాల్లో కథానాయికగా నటించిన షాలు చౌరాసియాపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆమె దగ్గర నుంచి ఖరీదైన మొబైల్ లాక్కుని వెళ్లారు. అసలు వివరాల్లోకి వెళితే...
ఎప్పటిలా ఆదివారం కేబీఆర్ పార్క్‌కు షాలు చౌరాసియా వాకింగ్ కు వెళ్లారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఆమెపై ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ముఖం మీద పిడిగుద్దులు కురిపించడంతో పాటు బలంగా కొట్టడంతో షాలు చౌరాసియా కింద పడ్డారు. ఆమె దగ్గర నుంచి మొబైల్ లాక్కుని దుండగుడు పారిపోయాడు. వెంటనే తేరుకున్న ఆమె, 100కు డయల్ చేశారు. రోడ్ నంబర్ 9 దగ్గర ఈ ఘటన జరిగినట్టు తెలిపారు. వెంటనే బంజారా హిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్వల్పంగా గాయపడిన షాలు చౌరాసియాను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు.
Also Read: జగపతి బాబులా శ్రీకాంత్ కూడా సక్సెస్ అవుతారా?
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం షాలు చౌరాసియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. హైదరాబాద్ సిటీలో గతంతో పోలిస్తే ఇప్పుడు చైన్ స్నాచింగ్, మొబైల్ స్నాచింగ్ వంటి నేరాలు బాగా తగ్గాయని చెప్పాలి. కీలక ప్రాంతాలు, మాల్స్ దగ్గర సీసీ టీవీలు అమర్చడంతో పాటు పోలీసులు నిఘా పెంచడంతో స్నాచింగ్ క్రైమ్స్ తగ్గాయి.
తెలుగులో 'శైలు', 'సైకో' వంటి కొన్ని చిన్న సినిమాల్లో షాలు చౌరాసియా కథానాయికగా నటించారు. నటిగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పలు ఈవెంట్స్ లో మోడల్ గా సందడి చేశారు. 'దిల్' రాజు, అల్లు అర్జున్ వంటి పేరున్న ప్రముఖులు కేబీఆర్ పార్క్ కు వాకింగ్ కు వెళ్తూ ఉంటారు. షాలు చౌరాసియాపై దాడి జరగడంతో సెలబ్రిటీలు కొంత జాగ్రత్త పడతారని చెప్పాలి.
Also Read: కోర్టుకు వెళ్లే ఆలోచన లేదు... ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో మాట్లాడతాం! - 'ఆర్ఆర్ఆర్' నిర్మాత
Also Read: ఓటీటీలో 'శ్రీదేవి సోడా సెంటర్' రికార్డు... సినిమాను కోటి నిముషాలు చూశారు!
Also Read: మెగాస్టార్ సినిమా నుంచి తప్పుకున్నాడా..? తప్పించారా..?
Also Read: అటెన్షన్ కోసం నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు.. శిల్పాశెట్టి రియాక్షన్
Also Read: 'పుష్ప'లో సమంత ఐటెం సాంగ్.. బన్నీతో మాస్ డాన్స్ కి రెడీ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి