Akhanda: జగపతి బాబులా శ్రీకాంత్ కూడా సక్సెస్ అవుతారా?
నందమూరి బాలకృష్ణ 'అఖండ'లో శ్రీకాంత్ ప్రతినాయకుడిగా నటించారు. ట్రైలర్‌లో ఆయన గెటప్, డైలాగ్ డెలివరీ ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేసింది. సినిమా విడుదల తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంటుందో?
శ్రీకాంత్‌కు ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉంది. ముఖ్యంగా మహిళల్లో ఆయనకు ఫాలోయింగ్ బావుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా హీరో బాబాయ్ తరహా పాజిటివ్ రోల్స్ చేశారు. నట సింహం నందమూరి బాలకృష్ణ తాజా సినిమా 'అఖండ'తో ఆయనను విలన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఆల్రెడీ రిలీజైన ట్రైలర్ చూస్తే... శ్రీకాంత్ గెటప్ నుంచి ఎక్స్‌ప్రెషన్స్ వరకూ అన్నీ చేంజ్ చేశారు.
"నాకు బురద అంటింది... నాకు దురద వచ్చింది... నాకు బ్లడ్ వచ్చింది... నాకు అడ్డు వచ్చింది అని అడ్డమైన సాకులు చెబుతూ పని ఆపితే..." అంటూ శ్రీకాంత్ ఓ డైలాగ్ చెప్పారు. కళ్లల్లో క్రూరత్వంతో పాటు నటనలో విలనిజాన్ని చూపించారు. బోయపాటి శ్రీను సినిమాల్లో మెయిన్ విలన్‌కు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరోతో పాటు విలన్‌కు కూడా పేరొస్తుంది. కొత్త ఇమేజ్ వస్తుంది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వస్తాయి. శ్రీకాంత్‌కు ఎటువంటి ఇమేజ్ వస్తుందని చూడాలి. ఆయనకు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి.
Also Read: 'కళ్లు తెరిచి జూలు విదిలిస్తే..' బాలయ్య విశ్వరూపం..
జగపతి బాబులా శ్రీకాంత్ కూడా సక్సెస్ అవుతారా? లేదా? అని ఇండస్ట్రీ జనాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హీరోగా జగపతి బాబుకు కూడా ఫ్యామిలీ ఇమేజ్ ఉండేది. 'లెజెండ్'తో ఆయన్ను బోయపాటి శ్రీను విలన్ చేశారు. ఆ సినిమా జగపతి బాబు కెరీర్ మారింది. జగపతి బాబు కూడా తనలో కొత్త నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. శ్రీకాంత్‌కు కూడా బోయపాటి సినిమాతో కొత్త ఇమేజ్ వస్తుందేమో చూడాలి. శ్రీకాంత్ సక్సెస్ అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త విలన్ దొరికినట్టే.
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో 'అఖండ' హ్యాట్రిక్ సినిమా. ఆల్రెడీ రిలీజైన ట్రైలర్ ఈ కాంబినేషన్ నుంచి ఆశించే మాస్, కమర్షియల్ అంశాలతో ఉంది. ట్రైలర్‌లో సినిమాను డిసెంబర్ 2న విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించారు. ఇందులో జగపతి బాబు కూడా ఓ పాత్ర చేశారు.
Also Read: ఓటీటీలో 'శ్రీదేవి సోడా సెంటర్' రికార్డు... సినిమాను కోటి నిముషాలు చూశారు!
Also Read: మెగాస్టార్ సినిమా నుంచి తప్పుకున్నాడా..? తప్పించారా..?
Also Read: అటెన్షన్ కోసం నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు.. శిల్పాశెట్టి రియాక్షన్
Also Read: 'పుష్ప'లో సమంత ఐటెం సాంగ్.. బన్నీతో మాస్ డాన్స్ కి రెడీ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి