అన్వేషించండి

Vishnu Vinyasam Movie : విష్ణు విన్యాసం మూవీ లీక్ - ప్రొడ్యూసర్‌కు బ్లాక్ మెయిల్... శ్రీవిష్ణు ఏం చెప్పారంటే?

Sree Vishnu Reaction : రిలీజ్‌కు ముందే విష్ణు విన్యాసం మూవీ లీక్ కావడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామని యంగ్ హీరో శ్రీవిష్ణు తెలిపారు. తమ ప్రొడ్యూసర్‌ను బ్లాక్ మెయిల్ చేశారని చెప్పారు.

Actor Sree Vishnu Reaction On Vishnu Vinyasam Movie Leakage : 'విష్ణు విన్యాసం' మూవీ లీక్ కావడం వల్ల హడావిడిగా వర్క్, ప్రమోషన్స్ కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు యంగ్ హీరో శ్రీవిష్ణు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మూవీ లీక్ అయ్యిందని సంచలన విషయాలు బయటపెట్టారు. 

'బ్లాక్ మెయిల్ చేశారు'

మూవీ లీక్ కావడం వల్ల అంతా హడావిడిగా చేయాల్సి వచ్చిందని చెప్పారు శ్రీవిష్ణు. 'మూవీ లీక్ కావడం వల్ల చాలా విషయాలు జరిగాయి. 20 రోజుల పనిని 7 రోజుల్లోనే పూర్తి చేశాం. టీం అంతా పగలు రాత్రి అనే తేడా లేకుండా చాలా సపోర్ట్ చేశారు. అలా చేయడం వల్లే చెప్పిన టైంకు రాగలిగాం. దీని వల్లే నా రెండు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి. ఎలాంటి ప్లానింగ్ లేకుండానే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయాల్సి వచ్చింది.

చెన్నై నుంచి మూవీ లీక్ అయ్యింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. ప్రస్తుతం కేసు విచారణ నడుస్తోంది. మా ప్రొడ్యూసర్‌ను బ్లాక్ మెయిల్ చేశారు. ఆయన్ను కొందరు బెదిరిస్తూ పెట్టిన మెసేజులు, వీడియోలు, ఛాంబర్‌కు మేము చేసిన ఫిర్యాదులు అన్నీ మా దగ్గర ఉన్నాయి. భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు రాకుండా ఏం చేయాలనే దానిపై చర్చించాలి. ప్రతీ రీల్‌కు నిర్మాతను బ్లాక్ మెయిల్ చేశారు. రిలీజ్ ముందు రోజు వరకూ ఇది జరిగింది. ఈ విషయంలో నిర్మాత చాలా నలిగిపోయారు. అలాగని మమ్మల్ని ఎక్కడా ఒత్తిడికి గురి చేయలేదు.' అని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Also Read : ఓటమి భయంతో యుద్ధం చేయకపోవడమే తప్పు - శ్రీవిష్ణు 'మృత్యుంజయ్' ట్రైలర్ చూశారా?

మా యూనిట్ నుంచే...

తమ యూనిట్ నుంచే తెలియకుండా సీన్స్ బయటకు వెళ్లిపోయాయని చెప్పారు ప్రొడ్యూసర్ సుమంత్ నాయుడు. 'మూవీకి సంబంధించిన వీడియోలు వరుసగా నాకు పంపారు. అవి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయా. కళ్ల ముందు ఒక్కసారిగా భవిష్యత్ కదిలింది. మాకు సినిమా క్లిప్స్ పంపిన నెంబర్‌ను వెంటనే ట్రేస్ చేశాం. ఆ తర్వాత ఛాంబర్‌లో కంప్లైంట్ చేశాం. ఆదివారం కావడంతో వెంటనే యాక్షన్ తీసుకోవడం సాధ్యం కాలేదు.

అలా రోజూ సినిమాకు సంబంధించిన వీడియోలు పంపేవారు. బ్లాక్ మెయిల్ చేసే వారు. దీంతో చాలా మానసిక క్షోభ అనుభవించారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో ఇక మిగిలిన మూవీని త్వరగా పూర్తి చేసేశాం. దీంతో వెంటనే తీసుకు రావాల్సి వచ్చింది. అంతే తప్ప 'మృత్యుంజయ్' మూవీకి పోటీగా దీన్ని విడుదల చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. ఆ చిత్ర నిర్మాత నా పరిస్థితి అర్థం చేసుకుని నన్ను క్షమించాలని కోరుకుంటున్నా.' అని చెప్పారు.

ఇక శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'విష్ణు విన్యాసం' మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే ఇండియావ్యాప్తంగా రూ.2 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. యదునాథ్ మారుతీరావు దర్శకత్వం వహించిన ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget