Samantha: 'పుష్ప'లో సమంత ఐటెం సాంగ్.. బన్నీతో మాస్ డాన్స్ కి రెడీ..
''పుష్ప'' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించబోయే స్టార్ హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది.
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా 'పుష్ప'. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మొదటి భాగాన్ని డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం ఓ పాటను చిత్రీకరిస్తుండగా.. ఇంకొక్క పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా ఐటెం సాంగ్. దీన్ని ఎంతో స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్. ఈ పాటలో ఓ స్టార్ హీరోయిన్ కనిపించబోతుందంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
Also Read: కోర్టుకు వెళ్లే ఆలోచన లేదు... ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో మాట్లాడతాం! - 'ఆర్ఆర్ఆర్' నిర్మాత
కానీ ఈ విషయంలో క్లారిటీ రాలేదు. పూజాహెగ్డే, తమన్నా లాంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ సమంతను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. సుకుమార్ కి, సమంతకు మధ్య మంచి రిలేషన్ ఉంది. అందుకే తన సినిమాలో ఐటెం సాంగ్ లో నటించమని అడిగారట సుకుమార్. అతడిపై ఉన్న గౌరవంతో సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సుకుమార్ లాస్ట్ సినిమా 'రంగస్థలం'లో పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది. ఈసారి సమంతను తీసుకొస్తున్నారు సుకుమార్.
ఈ పాటలో బన్నీతో కలిసి మాస్ స్టెప్పులు వేయబోతుంది సమంత. సినిమాకి ఈ పాట హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. నవంబర్ మూడో వారం నుంచి హైదరాబాద్ లో ఈ పాటను చిత్రీకరిస్తారట. ప్రస్తుతం సమంత చాలా బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో ఆమె ఐటెం సాంగ్ ఒప్పుకోవడం విశేషం. ఇటీవలే 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసిన ఈ బ్యూటీ తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తుంది.
అలానే శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెలుగులో ఓ సినిమా చేయబోతుంది. దీంతో పాటు ఓ బైలింగ్యువల్ సినిమా ఒప్పుకుంది. ఓ బాలీవుడ్ సినిమాను కూడా లైన్ లో పెట్టిందని సమాచారం. తాప్సీ సొంత బ్యానర్ లో సమంత నటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
Aslo Read: పునీత్ రాజ్ కుమార్ కళ్లతో... మరో పది మందికి చూపు!
Also Read: ఈ వారం కాజల్ సేఫ్.. పాపం అతడు ఎలిమినేట్ అవ్వక తప్పడం లేదు..
Also Read: కేటీఆర్ సార్.. ఈ పాపను ఆదుకోండి, కదిలిస్తోన్న బండ్ల గణేష్ ట్వీట్
Also Read: బాలకృష్ణ కాపాడిన ప్రాణం.. ఆ చిన్నారిని బాలయ్య ముందుకు తీసుకొచ్చిన నాని
Also Read: జనవరిలో మహేష్ బాబు రావడం లేదు. కానీ, ఆయన మేనల్లుడు వస్తున్నాడోచ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి