Bandla Ganesh: కేటీఆర్ సార్.. ఈ పాపను ఆదుకోండి, కదిలిస్తోన్న బండ్ల గణేష్ ట్వీట్

మూర్చ వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారిని ఆదుకోవాలని కోరుతూ మంత్రి కేటీఆర్‌కు నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్.

FOLLOW US: 

నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ అంటే మెగా అభిమానులకు చాలా ఇష్టం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ భక్తుడిగా ఆయన ఎక్కడా లేనంత క్రేజ్ సంపాదించారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టీవ్‌గా ఉంటారు. తన మనసులోని మాటలను.. సూక్తులను షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉండే బండ్ల గణేష్ శనివారం ఓ వ్యక్తి ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. 

కవిరాజ్ గౌడ్ అనే వ్యక్తి శనివారం తెలంగాణ మంత్రి కేటీఆర్, నటుడు-సామాజిక సేవకుడు సోను సూద్‌తోపాటు బండ్ల గణేష్‌ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ పెట్టాడు. అందులో ఓ చిన్నారి హాస్పిటల్ బెడ్ మీద చికిత్స పొందుతోంది. ‘‘కేటీఆర్, సోనుసూద్, బంగ్ల గణేష్ సర్ దయచేసి సాయం చేయండి. మా అక్క కూతురు కీర్తన(6 నుంచి 7 ఏళ్లు)కు కంటీన్యూగా ఫిట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఆమెను రైన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ జరుగుతోంది. రోజుకు రూ.80 వేలు నుంచి రూ.లక్ష ఖర్చవుతోంది. దయచేసి సాయం చేయగలరు’’ అంటూ ఫోన్ నెంబర్లతో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన బండ్ల గణేష్.. దాన్ని రీట్వీట్ చేస్తూ.. ‘‘కేటీఆర్ సార్ ప్లీజ్ హెల్ప్’’ అని అడిగారు. మంత్రి కేటీఆర్ ఇలాంటి కేసుల విషయంలో అస్సలు అశ్రద్ధ చేయరు. ఈ ట్వీట్ చూడగానే కేటీఆర్ వెంటనే అధికారులను అప్రమత్తం చేసి ఆదుకోమని ఆదేశాలిచ్చారు. ఇందుకు బండ్ల గణేష్ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

బండ్ల గణేష్ ప్రస్తుతం ‘డేగల బాబ్జీ’ సినిమాలో నటిస్తున్నారు. తమిళంలో ఆర్. పార్తిబన్ నటించిన 'ఒత్తు సెరుప్పు సైజ్ 7'కు ఈ సినిమా రీమేక్. తమిళంలో పార్తిబన్ చేసిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ పోషించారు. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. "తెలుగు తెరపై తొలిసారి ఒకే ఒక్క నటుడిగా చేస్తున్న సినిమా ఇది" అని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కేవలం ఒకే పాత్రతో తెరెక్కింది. మరి, బండ్ల గణేష్ ప్రేక్షకులను మెప్పిస్తారో లేదో చూడాలి. 

Also Read: బాలయ్య షోకి గెస్ట్ గా సెన్సేషనల్ హీరో.. రచ్చ మాములుగా ఉండదేమో..
Also Read: హైద‌రాబాద్‌ మెట్రోలో జాగ్రత్త... బిగ్ బాస్ మిమ్మల్ని చూస్తున్నాడు!
Also Read: కండోమ్ టెస్ట‌ర్‌గా ర‌కుల్... కండోమ్‌తో ఆమె లుక్ చూశారా?
Also Read: అమెరికాలో విజయ్ దేవరకొండ.. పూరితో చిల్ అవుతూ..

Published at : 13 Nov 2021 08:18 PM (IST) Tags: KTR Sonu Sood Bandla Ganesh బండ్ల గణేష్ సోను సూద్ Bandla Ganesh KTR

సంబంధిత కథనాలు

Gruhalakshmi August 8th Update: తులసితో సామ్రాట్ వైజాగ్ టూర్-  నందుతో ఇంకేం ప్రాబ్లం ఉండదని తులసికి హామీ ఇచ్చిన సామ్రాట్

Gruhalakshmi August 8th Update: తులసితో సామ్రాట్ వైజాగ్ టూర్- నందుతో ఇంకేం ప్రాబ్లం ఉండదని తులసికి హామీ ఇచ్చిన సామ్రాట్

Rashmika New Movie : అక్కినేని హీరోతో తొలిసారి - మహేష్ దర్శకుడు తీయబోయే సినిమాలో?

Rashmika New Movie : అక్కినేని హీరోతో తొలిసారి - మహేష్ దర్శకుడు తీయబోయే సినిమాలో?

Devatha August 8th Update: మాధవకి చుక్కలు చూపించిన రాధ- రుక్మిణి గురించి నిజం తెలుసుకుని షాకైన సత్య

Devatha August 8th Update: మాధవకి చుక్కలు చూపించిన రాధ- రుక్మిణి గురించి నిజం తెలుసుకుని షాకైన సత్య

Ennenno Janmalabandham August 8th Update: యష్, వేద కర్టన్ లో రొమాన్స్ - ఖైలాష్ ని విడిపించేందుకు అభిమన్యు తిప్పలు

Ennenno Janmalabandham August 8th Update: యష్, వేద కర్టన్ లో  రొమాన్స్ - ఖైలాష్ ని  విడిపించేందుకు అభిమన్యు తిప్పలు

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

టాప్ స్టోరీస్

TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ

TTD: తిరుమలలో మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు, కీలక ప్రకటన చేసిన టీటీడీ

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం!

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దుర్మరణం!

ఫైనల్స్‌లో పోరాడి ఓడిన టీమిండియా - రజతంతోనే సరి!

ఫైనల్స్‌లో పోరాడి ఓడిన టీమిండియా - రజతంతోనే సరి!

Rains in AP Telangana: తీవ్రరూపం దాల్చుతోన్న అల్పపీడనం - భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ వార్నింగ్

Rains in AP Telangana: తీవ్రరూపం దాల్చుతోన్న అల్పపీడనం - భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ వార్నింగ్