Rakul Preet Singh: కండోమ్ టెస్టర్‌గా రకుల్... కండోమ్‌తో ఆమె లుక్ చూశారా?
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ సినిమాలు, క్యారెక్టర్లు చేస్తున్నారు. హిందీ సినిమా 'ఛత్రీవాలీ'లో ఆమె కండోమ్ టెస్టర్ పాత్ర చేస్తున్నారు. ఆ సినిమాలో ఆమె లుక్ విడుదల చేశారు.
కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కమర్షియల్ సినిమాలు చేశారు. స్టార్ స్టేటస్, ఇమేజ్ వచ్చిన తర్వాత ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి 'ఎస్' అంటున్నారు. బోల్డ్ రోల్స్ చేయడానికి రెడీ అంటున్నారు. బోల్డ్ అంటే క్యారెక్టర్ పరంగా! కండోమ్ టెస్టర్‌గా నటించడానికి అంగీకరించి అందర్నీ ఆశ్చర్యంలో పడేశారు. ఇప్పుడు ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసి సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచారు.
View this post on Instagram
రకుల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న హిందీ సినిమా 'ఛత్రీవాలీ'. తేజస్ ప్రభ విజయ్ దేవోస్కర్ దర్శకత్వంలో రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు. "ఈ వాతావరణంలో ఎప్పుడు అయినా వర్షం రావొచ్చు. మీ గొడుగులు సిద్ధంగా ఉంచుకోండి" అని సినిమాలో తన ఫస్ట్ లుక్ ను రకుల్ ట్వీట్ చేశారు. ఇక్కడ గొడుగు అంటే... కండోమ్ అన్నమాట. ఇటువంటి బోల్డ్ రోల్ చేయడానికి అంగీకరించిన రకుల్ మీద మిగతా హీరోయిన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ బావుందని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
ప్రస్తుతం రకుల్ చేతిలో అర డజను హిందీ సినిమాలు ఉన్నాయి. గత నెలలో ఆమె నటించిన తెలుగు సినిమా 'కొండపొలం' విడుదలైంది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా, తెలుగు - తమిళ బైలింగ్వల్ సినిమా ఒకటి చేస్తున్నారు. హిందీ సినిమాలు విడుదలైన తర్వాత కొత్త సినిమాలు అంగీకరించాలనే ఆలోచనలో రకుల్ ఉన్నారు.
Also Read: జనవరిలో మహేష్ బాబు రావడం లేదు. కానీ, ఆయన మేనల్లుడు వస్తున్నాడోచ్
Also Read: వీవీ వినాయక్ క్లాప్‌తో... బాలకృష్ణ107వ సినిమా షురూ
Also Read: ప్రభాస్, పూజా హెగ్డే షి'కారు'... అదీ సముద్రంలో! ఈ రాతలే... రాధే శ్యామ్!
Also Read: బాలకృష్ణ కాపాడిన ప్రాణం... బాలకృష్ణ ముందుకు తీసుకొచ్చిన నాని
Also Read: పవన్ కల్యాణ్ చూశారు... ప్రశంసించారు! సంతోషంలో సినిమాటోగ్రాఫర్
Also Read: బంపర్ మెజారిటీ మీద కన్నేసిన నితిన్... వచ్చే ఏడాది వేసవిలో ప్రజల ముందుకు!
Also Read: 'రాజా విక్రమార్క' సమీక్ష: రాజావారి వేట బావుంది
Also Read: పుష్పక విమానం సమీక్ష: ఈ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిందా?
Also Read: స్పెషల్ ఆప్స్ 1.5 సమీక్ష: హాట్‌స్టార్ నుంచి అదరగొట్టే వెబ్ సిరీస్.. తెలుగులో కూడా!