RRR Ticket Rates: కోర్టుకు వెళ్లే ఆలోచన లేదు... ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో మాట్లాడతాం! - 'ఆర్ఆర్ఆర్' నిర్మాత
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ప్రయత్నిస్తున్నామని... ఆయన్ను కలిసి పరిస్థితులు వివరిస్తామని 'ఆర్ఆర్ఆర్' ప్రొడక్షన్ హౌస్ ట్వీట్ చేసింది. కోర్టుకు వెళ్లే ఆలోచనలు లేవని స్పష్టం చేసింది.
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'... భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా. సుమారు రూ. 400 నుంచి 500 కోట్ల వరకూ ఖర్చు అయినట్టు ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. ప్రస్తుతం ఏపీలో ఉన్న టికెట్ రేట్స్ ప్రకారం అమ్మితే... నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు గిట్టుబాటు కాదు. గతంలో ఇటువంటి భారీ సినిమాలు తీసినప్పుడు... విడుదలకు ముందు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కోర్టుకు వెళ్లి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు తెచ్చుకునేవారు.
'బాహుబలి' విడుదల అయినప్పుడు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలకు అమ్మారు. అప్పట్లో హైదరాబాద్ లో మల్టీప్లెక్స్‌లలో మూడు వందల రూపాయలు అమ్మారు. బెనిఫిట్ షోస్ సంగతి అయితే చెప్పనవసరం లేదు. టికెట్ రేటు పది వందలు, వేలు పలికింది. ఇప్పుడు ఉన్న రేట్స్ ప్రకారం అయితే డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం భారీ మొత్తాన్ని చెల్లించలేమని డిస్ట్రిబ్యూటర్లు చెప్పడంతో... ఏపీలో టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇవ్వవల్సిందిగా కోర్టును ఆశ్రయించాలని 'ఆర్ఆర్ఆర్' దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, నిర్మాత డి.వి.వి దానయ్య డిసైడ్ అయినట్టు వదంతులు వినిపించాయి. వీటిని డి.వి.వి. ఎంటర్ టైన్‌మెంట్ సంస్థ ఖండించింది.
"టికెట్ రేట్లు తగ్గించడం వలన సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతున్నదనే మాట నిజం. అయితే... 'ఆర్ఆర్ఆర్' సినిమా బృందానికి కోర్టుకు వెళ్లే ఉద్దేశం లేదు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి (వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి)ని కలిసే ప్రయత్నం చేస్తున్నాం. మా పరిస్థితులు వివరించి సామరస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం" అని 'ఆర్ఆర్ఆర్' ప్రొడక్షన్ హౌస్ డి.వి.వి. ఎంటర్ టైన్‌మెంట్ ట్వీట్ చేసింది.
It is true that the slashing of ticket prices will affect our film immensely. But we at #RRRMovie have no intention of going to court. We are trying to approach the honourable Andhra Pradesh CM garu and explain our situation for an amicable solution.
— DVV Entertainment (@DVVMovies) November 14, 2021
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డి.వి.వి. దానయ్య నిర్మించిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Aslo Read: పునీత్ రాజ్ కుమార్ కళ్లతో... మరో పది మందికి చూపు!
Also Read: ఈ వారం కాజల్ సేఫ్.. పాపం అతడు ఎలిమినేట్ అవ్వక తప్పడం లేదు..
Also Read: కేటీఆర్ సార్.. ఈ పాపను ఆదుకోండి, కదిలిస్తోన్న బండ్ల గణేష్ ట్వీట్
Also Read: బాలకృష్ణ కాపాడిన ప్రాణం.. ఆ చిన్నారిని బాలయ్య ముందుకు తీసుకొచ్చిన నాని
Also Read: జనవరిలో మహేష్ బాబు రావడం లేదు. కానీ, ఆయన మేనల్లుడు వస్తున్నాడోచ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి