RRR & Alia Bhatt : 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి కథియవాడి'
జనవరి 7న 'ఆర్ఆర్ఆర్' విడుదల కానుంది. ఆ చిత్రానికి దారిస్తూ... జనవరి 6న ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్న 'గంగూబాయి కథియావాడి' వెనక్కి వెళ్లింది.
![RRR & Alia Bhatt : 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి కథియవాడి' Alia Bhatt's Gangubai Kathiawadi movie release postponed from Jan 6th to Feb 18th and there no competition for RRR Radhe Shyam at Box Office RRR & Alia Bhatt : 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి కథియవాడి'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/15/8a32461e373ea8038ec767ca5bc7330b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఓ పోటీ తప్పింది. ఒకదాని తర్వాత మరొకటి... రెండు రోజుల్లో ఆలియా భట్ నటించిన రెండు సినిమాలు విడుదలైతే? అనే ప్రశ్నకు ఇప్పుడు ఆస్కారం లేకున్నా పోయింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాకు దారిస్తూ... 'గంగూబాయి కథియావాడి' సినిమా వెనక్కి వెళ్లింది. దాంతో ఉత్తరాదిన థియేటర్ల దగ్గర 'ఆర్ఆర్ఆర్'కు ఎదురు అనేది లేదని చెప్పాలి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. 'బాహుబలి' తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడంతో ఉత్తరాదిన కూడా ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. 'బాహుబలి' ఫ్యాక్టర్‌కు తోడు... హిందీ హీరో అజయ్ దేవగణ్ అతిథి పాత్రలో, రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటించడం కూడా సినిమాకు యాడెడ్ వేల్యూ అని చెప్పాలి. పలు వాయిదాలు పడిన 'ఆర్ఆర్ఆర్', చివరకు జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. అయితే... దానికి ఒక్క రోజు ముందు 'గంగూబాయి కథియావాడి' విడుదల చేయడానికి సన్నాహాలు జరిగాయి.
'ఆర్ఆర్ఆర్'లో సీత పాత్రలో నటించిన ఆలియా భట్, గంగూబాయి కథియావాడి'లో టైటిల్ రోల్ పోషించారు. ఆ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. హిందీ ప్రేక్షకుల్లో భన్సాలీ, ఆలియాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందువల్ల, రెండు రోజుల వ్యవధిలో రెండు సినిమాలు విడుదలైతే ఆడియన్స్ డివైడ్ కావడంతో పాటు... రెండు సినిమాలు కలెక్షన్స్ షేర్ చేసుకోవాల్సి వస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. బాహుబలి ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' జనవరి 14న విడుదలకు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో మూడు సినిమాల మధ్య పోటీ తప్పదని అంచనా వేశారు.
ఇప్పుడు తెలుగు హీరోలు, దర్శకులు రూపొందించిన రెండు పాన్ ఇండియా సినిమాలకు పోటీ తప్పింది. 'గంగూబాయి కథియావాడి'ని జనవరి 6న విడుదల చేయడం లేదు. ఫిబ్రవరి 18కి వాయిదా వేశారు. అన్నట్టు... 'ఆర్ఆర్ఆర్'ను హిందీలో విడుదల చేస్తున్న పెన్ స్టూడియోస్ సంస్థే 'గంగూబాయి కథియావాడి' సినిమాను నిర్మించింది. అందువల్ల, రెండు సినిమాల మధ్య పోటీ లేకుండా చూసుకుంది. ముంబైలోని కామాఠిపుర ప్రాంతానికి చెందిన వేశ్య జీవితం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ 'గంగూబాయి కథియావాడి' తెరకెక్కించారు.
Watch her rise with power, courage & fearlessness. #GangubaiKathiawadi coming to take over 2022 on 18th February, in cinemas near you.#SanjayLeelaBhansali @ajaydevgn @aliaa08 @prerna982 @jayantilalgada @bhansali_produc@saregamaglobal pic.twitter.com/Z4uOEDJpAT
— PEN INDIA LTD. (@PenMovies) November 15, 2021
Also Read: సన్నీ & కో ని టార్గెట్ చేశారా... బిగ్ బాస్ హౌస్ లో పదకొండోవారం నామినేషన్ల హీట్
Also Read: విజేతగా నిలిచేది ఒక్కడే... ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి?... చెర్రీ వాయిస్‌తో అదిరిపోయిన గని టీజర్
Also Read: పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుని... ఫస్ట్ డే షూటింగ్‌కు వెళ్లిన మెగాస్టార్ దర్శకుడు
Also Read: హీరోయిన్ షాలు చౌరాసియాపై కేబీఆర్ పార్క్ దగ్గర దాడి... ఖరీదైన మొబైల్ లాకెళ్లిన దుండగుడు
Also Read: జోరుమీదున్న అక్షయ్ ... ఆకట్టుకుంటోన్న 'పృథ్వీరాజ్' టీజర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)