Prithviraj Teaser: జోరుమీదున్న అక్షయ్ ... ఆకట్టుకుంటోన్న 'పృథ్వీరాజ్' టీజర్
వరుస మూవీస్ తో బిజీగా ఉన్న అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ 'పృథ్వీరాజ్' టీజర్ విడుదలైంది
బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ జోరు కొనసాగుతోంది. ఈ మధ్యే ‘సూర్యవంశీ ’ మూవీతో హిట్ అందుకున్న అక్షయ్ త్వరలో 'పృథ్వీరాజ్' మూవీతో వచ్చేందుకు సిద్ధమయ్యాడు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 21 విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు మేకర్స్.
A heroic story about pride and valour. Proud to play Samrat #Prithviraj Chauhan. Celebrate #Prithviraj with #YRF50 only at a big screen near you on 21st January’22.@ManushiChhillar @duttsanjay @SonuSood #DrChandraprakashDwivedi @yrf pic.twitter.com/GzNyMoTKux
— Akshay Kumar (@akshaykumar) November 15, 2021
మానుషి చిల్లర్, సంజయ్‌దత్, సోనూ సూద్ నటిస్తోన్న ఈ సినిమాని చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. గతేడాది కరోనా-లాక్‌డౌన్ పరిస్థితుల వల్ల విడుదల చేయలేక పోయామని... జనవరి 21న ప్రేక్షకుల ముందుకొస్తోందన్నారు మూవీ యూనిట్. టీజర్ మొత్తం రిచ్ గా సాగింది.
కరోనా కాలంలోనే 'లక్ష్మీ బాంబ్', 'బెల్ బాటమ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్షయ్ .. ఏకంగా ఇప్పుడు 9 సినిమాల్లో నటిస్తున్నాడు. వీటిలో రెండు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని సెట్స్ పై ఉండగా..మరికొన్ని త్వరలో ప్రారంభం కానున్నాయి. సూర్య 'ఆకాశం నీ హద్దురా' సినిమాని అక్షయ్ రీమేక్ చేయనున్నట్టు టాక్. 'ఓ మై గాడ్' సీక్వెల్‌గా 'ఓ మై గాడ్ 2' లో శివుడిగా కనిపించనున్నాడు అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్న 'అత్రాంగి రే' సినిమా షూటింగ్ ఈ మధ్యే పూర్తైంది. మొత్తంగా అక్షయ్ కుమార్ వి రాబోతున్న సినిమాలన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయ్. తాజాగా విడుదలైన 'పృథ్వీరాజ్' సినిమా టీజర్ అద్భుతం అనిపించింది. ఈ సినిమాతో మానుషి చిల్లర్ హీరోయిన్ గా కెరీర్ ప్రారంభిస్తోంది.
Also Read: జగపతి బాబులా శ్రీకాంత్ కూడా సక్సెస్ అవుతారా?
Also Read: హీరోయిన్ షాలు చౌరాసియాపై కేబీఆర్ పార్క్ దగ్గర దాడి... ఖరీదైన మొబైల్ లాకెళ్లిన దుండగుడు
Also Read: కోర్టుకు వెళ్లే ఆలోచన లేదు... ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో మాట్లాడతాం! - 'ఆర్ఆర్ఆర్' నిర్మాత
Also Read: ఓటీటీలో 'శ్రీదేవి సోడా సెంటర్' రికార్డు... సినిమాను కోటి నిముషాలు చూశారు!
Also Read: అటెన్షన్ కోసం నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు.. శిల్పాశెట్టి రియాక్షన్
Also Read:జెస్సీ అవుట్.. సారీ చెప్పిన నాగ్..
Also Read: పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుని... ఫస్ట్ డే షూటింగ్‌కు వెళ్లిన మెగాస్టార్ దర్శకుడ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి