Bigg Boss 5 Telugu: జెస్సీ అవుట్.. సారీ చెప్పిన నాగ్..

ఈ వారం నామినేషన్ లో ఉన్న వాళ్లు ఎలిమినేట్ అవ్వాల్సిన దానికి బదులు హౌస్ నుంచి ఇంకో హౌస్ మేట్ వెళ్లిపోతున్నారని చెప్పారు నాగార్జున.

FOLLOW US: 

ముందుగా స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున.. సండే ఫన్ డే అనుకుంటున్నారా..? సండే పనిష్మెంట్స్ అయిపోతాయ్ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కొంచెం హీటెక్కాలి కదా అంటూ కామెంట్ చేశారు. ఆ తరువాత గంగవ్వకి బిగ్ బాస్ కట్టించిన ఇంటిని వీడియో ద్వారా హౌస్ మేట్స్ కి చూపించారు నాగార్జున. ఆ తరువాత హౌస్ మేట్స్ ని రెండు టీమ్ లుగా విడగొట్టి టాస్క్ ఆడించారు. చిల్డ్రన్ డే కావడంతో చిన్నప్పటి గేమ్స్ ఆడిస్తూ ఫన్నీ పనిష్మెంట్స్ ఇచ్చారు నాగార్జున. ఈ టాస్క్ లో సన్నీ విజేతగా నిలవడంతో టీమ్ A కి ఒక పాయింట్ వచ్చింది. 

Also Read: అటెన్షన్ కోసం నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు.. శిల్పాశెట్టి రియాక్షన్

సిరి సేఫ్..

నామినేషన్ లో ఉన్న నలుగురిని పిలిచి వారి చేతిలో రిసెప్షన్ బెల్ చేతిలో పెట్టి.. 'రెస్టారంట్ క్లోజ్డ్' అనే సౌండ్ వస్తే నాట్ సేవ్ అని.. 'ఆర్డర్ ప్లీజ్' అని సౌండ్ వస్తే సేఫ్ అని చెప్పారు. ఈ టాస్క్ లో సిరి సేవ్ అయింది. 

హీరో,హీరోయిన్ చిన్నప్పటి ఫోటోలను ప్లాస్మాలో ప్లే చేసి ఎవరో గెస్ చేయాలనీ చెప్పారు నాగార్జున. ఈ టాస్క్ లో కూడా టీమ్ Aనే గెలిచింది. 
రవి సేఫ్.. నామినేషన్ లో ఉన్న ముగ్గురిని నిలబడమని చెప్పిన నాగ్.. వాళ్ల ముందు బజర్ పెట్టి.. ఒక్కొక్కరిని చేయి పెట్టమని చెప్పారు. యాక్సెస్ గ్రాంటెడ్ అంటే సేఫ్.. యాక్సెస్ డినైడ్ అంటే అన్ సేఫ్ అని చెప్పారు. ఇందులో రవి సేవ్ అయినట్లు ప్రకటించారు. 

మెడలో మెడల్.. 

ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ కి కొన్ని మెడల్స్ ఇచ్చి.. ఆ లక్షణం ఎవరికుందో చెప్పమని సూచించారు. ముందుగా సన్నీ.. రవికి 'ఫేక్' మెడల్ వేస్తూ.. ''కరెక్ట్ గా ఒక టైం వచ్చినప్పుడు ఫ్లిప్ అవుతుంటాడు. అది నాకనిపించింది'' అని చెప్పాడు. మానస్.. ప్రియాంకకు 'హెడ్డేక్' మెడల్ ఇస్తూ.. ''మంచి చెప్పినా.. నెగెటివ్ గా తీసుకుంటూ ఉంటుంది. ఒక విషయాన్ని తెగేదాకా లాగుతుంటుంది'' అని రీజన్ చెప్పాడు. కాజల్ కి కన్నింగ్ ఇచ్చిన శ్రీరామ్.. గేమ్ లో ఆమె కన్నింగ్ ఉంటుందని చెప్పాడు. 'సార్ యారోగెంట్ అంటే చెప్పిన తరువాత కూడా వినకపోవడం కదా.. నాకు నచ్చింది చేస్తా.. ఎవడు చెప్పినా నేను వినను' అంటూ కామెంట్ చేయగా.. అందరూ సన్నీ గురించి అనుకున్నారు. కానీ రవి.. యానీ మాస్టర్ ని ఉద్దేశించి అన్నాడు. ఓ ఫన్నీ రీజన్ చెప్పి ఆమె మెడలో యారోగెంట్ మెడల్ వేశాడు. షణ్ముఖ్ 'సెల్ఫిష్' అంటూ అతడికి మెడల్ వేసింది. సన్నీకి కూడా 'సెల్ఫిష్' మెడల్ వేసింది యానీ మాస్టర్. ఆ తరువాత కాజల్.. సిరికి డబుల్ ఫేస్డ్ మెడల్ ఇచ్చి.. 'తనకు టు ఫేసెస్ ఉన్నాయ్ సార్.. నార్మల్ గా ఉండేప్పుడు ఒక ఫేస్.. గేమ్ ఆడేప్పుడు ఒక ఫేస్. ఇంకొక థర్డ్ ఫేస్ కూడా ఉందంట.. అది బయటకు వెళ్లాక చూపిస్తాదంట' అని చెప్పుకొచ్చింది. వెంటనే నాగ్.. 'షణ్ముఖ్ నువ్వేమైనా చూశావా..? థర్డ్ ఫేస్' అని అడిగారు. దానికి షణ్ముఖ్.. 'నేను రెండు ఫేస్ లే చూశాను సార్' అని కామెంట్ చేశాడు. సిరి.. షణ్ముఖ్ కి 'నెగెటివ్' అనే మెడల్ ఇచ్చింది. 

జెస్సీ అవుట్..

కాజల్, మానస్ లను గార్డెన్ ఏరియాలోకి రమ్మని చెప్పిన నాగార్జున.. అక్కడున్న రెండు బాక్స్ ల ముందు నుంచోమని చెప్పారు. ఆ బాక్స్ లో ఎవరి చేతికి గ్రీన్ కలర్ వస్తుందో వాళ్లు సేఫ్ అని చెప్పారు. అయితే ఇద్దరి చేతులకు పసుపు రంగు అంటుకుంది. ఈ వారం నామినేషన్ లో ఉన్న వాళ్లు ఎలిమినేట్ అవ్వాల్సిన దానికి బదులు హౌస్ నుంచి ఇంకో హౌస్ మేట్ వెళ్లిపోతున్నారని చెప్పారు నాగార్జున. సీక్రెట్ రూమ్ లో ఉన్న జెస్సీ ఒక్కసారిగా షాకై తలపట్టుకున్నాడు. జెస్సీ హెల్త్ కండీషన్ బాలేదని.. అతడిని బయటకు పంపిచేస్తున్నట్లు చెప్పారు. స్టేజ్ పైకి వచ్చిన జెస్సీకి సారీ చెప్పారు నాగార్జున.  

ఆ తరువాత జెస్సీకి ఫోన్ ఇచ్చి.. ఒక్కో హౌస్ మేట్ తో మాట్లాడమని చెప్పారు నాగ్. జెస్సీ మాట్లాడేది ఆ హౌస్ మేట్ కి తప్పే వేరెవరికీ వినిపించదు. సన్నీతో మాట్లాడిన జెస్సీ.. నిన్ను కొందరు యూజ్ చేసుకుంటున్నారని.. నీ గేమ్ నువ్ ఒక్కడివే ఆడు.. ట్రోఫీ ఎవరితో షేర్ చేసుకోలేం అని చెప్పాడు. నెక్స్ట్ మానస్ తో మాట్లాడుతూ.. 'నువ్ సైలెంట్ కిల్లర్.. రవికి బాబువి నువ్.. నీ ఐడియాలజీ బాగుంది' అని చెప్పాడు. నిన్ను తిట్టాలనుందని కాజల్ కి క్లాస్ పీకాడు జెస్సీ. నీ గేమ్ నువ్ ఆడు.. ఎవరినీ హైలైట్ చేయకు అని చెప్పాడు. యానీతో మాట్లాడుతూ.. 'మీ గేమ్ చాలా బావుంది. కానీ కాజల్ తో ఫైట్ ఏంటో అర్ధం కావట్లేదు' అని అన్నాడు జెస్సీ. 

త్యాగాలు ఆపేయ్ ప్లీజ్ పింకీ.. ఏం చూపిద్దాం అనుకుంటున్నావు అంటూ ఫైర్ అయ్యాడు జెస్సీ. శ్రీరామ్ తో మాట్లాడుతూ.. 'నువ్ టాప్ 5లో ఉంటావ్.. నీ మైండ్ సెట్ నాకు బాగా నచ్చింది. ఇదే కంటిన్యూ చెయ్' అని చెప్పాడు. రవితో మాట్లాడుతూ.. 'నువ్ ఇలానే ఆడు.. ఫైనల్స్ లో కలుస్తా' అని చెప్పాడు జెస్సీ. సిరితో మాట్లాడుతూ.. 'నీ ఫైట్ బావుంది కానీ లాస్ట్ వీక్ గేమ్ నచ్చలేదని చెప్పాడు. ఫైనల్స్ వరకు ఉండు.. నెక్స్ట్ వీక్ రాకు' అని ఫన్నీగా చెప్పాడు జెస్సీ. ఫైనల్ గా షణ్ముఖ్ తో మాట్లాడుతూ.. ఏం చెప్పాలిరా దీపుకి అని ఫన్నీగా అడిగాడు. చూసిందే చెప్పారా అంటూ నవ్వేశాడు షణ్ముఖ్. ఆ తరువాత ''ఫస్ట్ వీక్ వెళ్లిపోతావ్ అనుకున్నారు.. కానీ టెన్త్ వీక్ వరకు ఉండి వేరే వాళ్లకు లైఫ్ ఇచ్చి వెళ్తున్నావ్ అదిరా నువ్'' అని అన్నాడు షణ్ముఖ్.    

Also Read: మెగాస్టార్ సినిమా నుంచి తప్పుకున్నాడా..? తప్పించారా..?

Also Read: మోహన్ లాల్ కి జోడీగా మంచువారమ్మాయి..

Also Read: 'పుష్ప'లో సమంత ఐటెం సాంగ్.. బన్నీతో మాస్ డాన్స్ కి రెడీ..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 14 Nov 2021 10:17 PM (IST) Tags: Kajal Bigg Boss 5 Telugu Bigg Boss 5 manas Jessie jessie elimination

సంబంధిత కథనాలు

Samrat Reddy: తండ్రి కాబోతున్న ‘బిగ్ బాస్’ సామ్రాట్

Samrat Reddy: తండ్రి కాబోతున్న ‘బిగ్ బాస్’ సామ్రాట్

Urfi Javed: వీడియో - అయ్యో, పువ్వు అనుకుని ఫోన్ పడేసిందే, పిచ్చి ముదిరితే ఇంతే!

Urfi Javed: వీడియో - అయ్యో, పువ్వు అనుకుని ఫోన్ పడేసిందే, పిచ్చి ముదిరితే ఇంతే!

Bigg Boss Telugu 6: బిగ్ బాస్ సీజన్ 6 - లాంచింగ్ డేట్ ఎప్పుడంటే?

Bigg Boss Telugu 6: బిగ్ బాస్ సీజన్ 6 - లాంచింగ్ డేట్ ఎప్పుడంటే?

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ వీళ్లేనా?

Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ వీళ్లేనా?

Unstoppable Movie: బాలకృష్ణ టాక్ షో టైటిల్‌తో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా

Unstoppable Movie: బాలకృష్ణ టాక్ షో టైటిల్‌తో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా

టాప్ స్టోరీస్

TS SSC Results 2022: ఇవాళే తెలంగాణ పదోతరగతి ఫలితాలు - రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

TS SSC Results 2022: ఇవాళే తెలంగాణ పదోతరగతి ఫలితాలు - రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

Maharashtra Political Crisis: సుప్రీం కోర్టు తీర్పుతో మారిన మహారాష్ట్ర పొలిటికల్ సీన్- కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌!

Maharashtra Political Crisis: సుప్రీం కోర్టు తీర్పుతో మారిన మహారాష్ట్ర పొలిటికల్ సీన్- కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌!

Relief For Amaravati Employees : మరో రెండు నెలలు ఉచిత వసతి - అమరావతి ఉద్యోగులకు సర్కార్ చివరి నిమిషంలో రిలీఫ్ !

Relief For Amaravati Employees  : మరో రెండు నెలలు ఉచిత వసతి - అమరావతి ఉద్యోగులకు సర్కార్ చివరి నిమిషంలో రిలీఫ్ !

Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్ టెస్టు నుంచి రోహిత్ అవుట్ - కెప్టెన్ చాన్స్ ఎవరికంటే?

Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్ టెస్టు నుంచి రోహిత్ అవుట్ - కెప్టెన్ చాన్స్ ఎవరికంటే?