అన్వేషించండి
Advertisement
Bholaa Shankar: పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుని... ఫస్ట్ డే షూటింగ్‌కు వెళ్లిన మెగాస్టార్ దర్శకుడు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'భోళా శంకర్'. ఈ రోజు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సినిమాల్లో 'భోళా శంకర్' ఒకటి. ఈ రోజు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ డే షూటింగ్‌కు బయలుదేరే ముందు దర్శకుడు మెహర్ రమేష్ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. "పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో 'భోళా శంకర్' ఫస్ట్ డే షూటింగ్ కు బయలుదేరాను" అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
తమిళంలో అజిత్ హీరోగా నటించిన 'వేదాళం' సినిమాకు రీమేక్ ఇది. మెగాస్టార్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేశారు. సుమారు ఏడాది పాటు మెహర్ రమేష్ కథపై వర్క్ చేసినట్టు నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్నారు. మెగాస్టార్ చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ కనిపించనున్నారు. ఫస్ట్ డే షూటింగ్ లో తమన్నా కూడా పాల్గొంటున్నారని తెలిసింది.
ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావుకు చెందిన క్రియేటివ్ కమర్షియల్స్ భాగస్వామ్యంతో అనిల్ సుంకరకు ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర 'భోళా శంకర్' సినిమాను నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. రఘుబాబు, రావు రమేష్, మురళీశర్మ, రవిశంకర్, 'వెన్నెల' కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, రష్మీ గౌతమ్ తదితరులు నటిస్తున్నారు.
Also Read: జగపతి బాబులా శ్రీకాంత్ కూడా సక్సెస్ అవుతారా?
Also Read: హీరోయిన్ షాలు చౌరాసియాపై కేబీఆర్ పార్క్ దగ్గర దాడి... ఖరీదైన మొబైల్ లాకెళ్లిన దుండగుడు
Also Read: కోర్టుకు వెళ్లే ఆలోచన లేదు... ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో మాట్లాడతాం! - 'ఆర్ఆర్ఆర్' నిర్మాత
Also Read: ఓటీటీలో 'శ్రీదేవి సోడా సెంటర్' రికార్డు... సినిమాను కోటి నిముషాలు చూశారు!
Also Read: అటెన్షన్ కోసం నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు.. శిల్పాశెట్టి రియాక్షన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
View this post on Instagram

మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion