Rajkumar Rao: ప్రేయసిని పెళ్లాడిన బాలీవుడ్ స్టార్.. ఫొటోలు వైరల్
బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ తను చాలా కాలంగా ప్రేమిస్తున్న పత్రలేఖను పెళ్లి చేసుకున్నారు.
బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ తను చాలా కాలంగా ప్రేమిస్తున్న పత్రలేఖను పెళ్లి చేసుకున్నారు. నవంబర్ 15న హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. చండీఘడ్ వేదికగా వివాహం జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వివాహ వేడుకలు జరిగాయి. తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను రాజ్ కుమార్, పత్రలేఖ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read: అనుష్క స్లిమ్ గా ఎలా మారిందో తెలుసా..? ఇదిగో ఆమె డైట్ సీక్రెట్..
తన భార్యకు కుంకుమ దిద్దుతున్న ఫొటోలను షేర్ చేస్తూ.. ''పదకొండేళ్ల ప్రేమ, రొమాన్స్, స్నేహం, ఫన్.. ఫైనల్ గా నా బెస్ట్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్నాను. ఈరోజు పత్రలేఖ నుంచి భర్తగా పిలిపించుకోవడం కంటే గొప్ప ఆనందం మరొకటి లేదు'' అంటూ రాసుకొచ్చాడు. ఈ ఫొటోలపై నెటిజన్ల రియాక్షన్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఈ కొత్త జంటకు బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ప్రియాంక చోప్రా, తాప్సి, ఆయుష్మాన్ ఖురానా ఇలా చాలా మంది పేరున్న తారలు రకరకాల క్యాప్షన్స్ తో విషెస్ చెబుతున్నారు.
View this post on Instagram
View this post on Instagram
Also Read: సన్నీ & కో ని టార్గెట్ చేశారా... బిగ్ బాస్ హౌస్ లో పదకొండోవారం నామినేషన్ల హీట్
Also Read: విజేతగా నిలిచేది ఒక్కడే... ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి?... చెర్రీ వాయిస్‌తో అదిరిపోయిన గని టీజర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి