Anushka Shetty: అనుష్క స్లిమ్ గా ఎలా మారిందో తెలుసా..? ఇదిగో ఆమె డైట్ సీక్రెట్..
అనుష్క స్లిమ్ గా ఎలా మారిందని అనుకుంటున్నారా..? ఆమె డైట్ సీక్రెట్ ఏంటో ఈ ఆర్టికల్ లో మీరు కూడా తెలుసుకోండి.
దక్షిణాదిలో ఉన్న అగ్ర హీరోయిన్లలో టాప్ రేసులో ఉంటుంది అనుష్కశెట్టి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది ఈ బ్యూటీ. ఆమె నటించిన 'అరుంధతి', 'భాగమతి' లాంటి సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. వైవిధ్యమైన పాత్రల్లో నటించాలనేది అనుష్క కోరిక. అందుకే 'సైజ్ జీరో' లాంటి మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో నటించింది. ఈ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అవ్వలేదు. ఈ సినిమా కోసం అనుష్క ఎంతో శ్రమించింది. తన శరీరబరువుని కూడా పెంచుకుంది.
Also Read: గిరిజనుల కోసం కోటి.. రియల్ సినతల్లికి రూ.10 లక్షలు.. హీరో సూర్యపై ప్రశంసలు
అప్పటినుంచి తగ్గడానికి చాలానే కష్టపడుతోంది. పెర్సనల్ ట్రైనర్ ను నియమించుకొని తగిన డైట్ ను ఫాలో అవుతూ.. ఫైనల్ గా మునుపటి లుక్ లోకి వచ్చేసింది. రీసెంట్ గా ఓ సినిమా కూడా సైన్ చేసింది. అనుష్క స్లిమ్ గా ఎలా మారిందని అనుకుంటున్నారా..? ఆమె డైట్ సీక్రెట్ ఏంటో ఈ ఆర్టికల్ లో మీరు కూడా తెలుసుకోండి.
రోజులో ఎక్కువసార్లు నీళ్లు తాగుతుంటుంది. అలానే కొబ్బరినీళ్లు మధ్యమధ్యలో తీసుకుంటుంది. ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవడం వలన స్కిన్ టోన్ బాగుంటుందని అనుష్క డైటీషియన్ చెప్పారట. అలానే తన ఆహారపు అలవాట్లు పూర్తిగా మార్చేసుకుంది. ఆయిల్ ఫుడ్స్ ని కంప్లీట్ గా పక్కన పెట్టేసింది. కార్బోహైడ్రేట్స్ లేకుండా చూసుకుంటుంది. ఎక్కువగా కూరగాయలనే తింటుందట. ముఖ్యంగా ఫైబర్ ఉండే కూరగాయలను అనుష్క బాగా ప్రిఫర్ చేస్తుందట.
రోజుకి మూడు పూటలు చొప్పున కాకుండా ఎక్కువసార్లు తక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకుంటుంది. ఇంట్లో ప్రిపేర్ చేసే ఆహారాన్నే ఎక్కువగా తింటుంది. ఈ డైట్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ.. వీటితో పాటు యోగా, ఎక్సర్‌సైజ్ లు క్రమతప్పకుండా చేస్తుంది. త్వరలోనే అనుష్క తన కొత్త లుక్ తో దర్శనమివ్వనుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ పై దర్శకుడు మహేష్ రూపొందిస్తోన్న సినిమాలో ఆమె కనిపించనుంది.
Also Read: 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి కథియవాడి'
Also Read: సన్నీ & కో ని టార్గెట్ చేశారా... బిగ్ బాస్ హౌస్ లో పదకొండోవారం నామినేషన్ల హీట్
Also Read: విజేతగా నిలిచేది ఒక్కడే... ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి?... చెర్రీ వాయిస్‌తో అదిరిపోయిన గని టీజర్
Also Read: పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుని... ఫస్ట్ డే షూటింగ్‌కు వెళ్లిన మెగాస్టార్ దర్శకుడు
Also Read: హీరోయిన్ షాలు చౌరాసియాపై కేబీఆర్ పార్క్ దగ్గర దాడి... ఖరీదైన మొబైల్ లాకెళ్లిన దుండగుడు
Also Read: జోరుమీదున్న అక్షయ్ ... ఆకట్టుకుంటోన్న 'పృథ్వీరాజ్' టీజర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి