Jai Bhim: గిరిజనుల కోసం కోటి.. రియల్ సినతల్లికి రూ.10 లక్షలు.. హీరో సూర్యపై ప్రశంసలు
హీరో సూర్య కూడా పార్వతి అమ్మాళ్ ను ఆర్థికంగా ఆదుకున్నారు. ఆమె కుటుంబానికి రూ.10 లక్షల రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి.. ఆ మొత్తంపై నెల నెలా వచ్చే వడ్డీని పార్వతి అమ్మాళ్ కు చేరేలా చేశాడు.
తమిళ స్టార్ హీరో సూర్యకి తెలుగునాట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలకు ఇక్కడ మంచి బిజినెస్ జరుగుతుంటుంది. ఈ మధ్యకాలంలో మరింత అగ్రెసివ్ గా తన సినిమాను తెలుగులో ప్రమోట్ చేసుకుంటున్నారు సూర్య. ఈ లాక్ డౌన్ లో ఆయన నటించిన రెండు సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఒకటి 'ఆకాశం నీ హద్దురా', రెండోది 'జై భీమ్'. ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. రెండూ రెండు విభిన్న జోనర్స్ కి సంబంధించిన సినిమాలు. ముఖ్యంగా 'జై భీమ్' సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. జస్టిస్ చంద్రు అనే అడ్వకేట్ బయోపిక్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.
Also Read: 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి కథియవాడి'
అన్యాయంగా తన భర్తను జైల్లో పెట్టారని.. అతడిని కాపాడుకోవడానికి ఓ గిరిజన మహిళ చేసే పోరాటంలో చంద్రు ఆమెకి సాయం చేస్తారు. నిజ జీవితంలో జరిగిన ఈ సంఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కూడా ప్రపంచానికి పరిచయమయ్యాయి. సినిమాలో గిరిజన మహిళగా సినతల్లి అనే పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. పార్వతి అమ్మాళ్ అనే మహిళ స్పూర్తితో ఈ పాత్రను రాసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు.
పిల్లలను పోషించలేక.. వృద్దాప్యంతో కష్టపడుతున్నారు. 'జై భీమ్' సినిమాతో ఆమె గురించి బయటప్రపంచానికి తెలియడంతో.. చాలా మంది సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ఆమెకి సొంతిల్లు కట్టిస్తానని మాట ఇచ్చారు. తాజాగా హీరో సూర్య కూడా పార్వతి అమ్మాళ్ ను ఆర్థికంగా ఆదుకున్నారు. ఆమె కుటుంబానికి రూ.10 లక్షల రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి.. ఆ మొత్తంపై నెల నెలా వచ్చే వడ్డీని పార్వతి అమ్మాళ్ కు చేరేలా చేశాడు.
అంతేకాకుండా.. తన తదనంతరం ఆమె పిల్లలకు ఈ వడ్డీ అందజేస్తామని సూర్య వెల్లడించారు. దీంతో ఆయన అభిమానులు సూర్య మంచితనాన్ని కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఇప్పటికే ఆయన అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి సేవలు చేస్తున్నారు. సేవా కార్యక్రమాలతో పాటు.. చాలా మంది పిల్లలను చదివిస్తున్నారు. వీటితో పాటు కష్టాల్లో ఉన్నవారిని ఆడుకుంటూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. 'జై భీమ్' సినిమా స్పూర్తితో గిరిజనుల సంక్షేమం కోసం కూడా కోటి రూపాయలు విరాళం ప్రకటించారు సూర్య. ఇప్పుడేమో సినతల్లి ఆదుకొని రియల్ హీరో అనిపించుకుంటున్నారు.
Also Read: సన్నీ & కో ని టార్గెట్ చేశారా... బిగ్ బాస్ హౌస్ లో పదకొండోవారం నామినేషన్ల హీట్
Also Read: విజేతగా నిలిచేది ఒక్కడే... ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి?... చెర్రీ వాయిస్‌తో అదిరిపోయిన గని టీజర్
Also Read: పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుని... ఫస్ట్ డే షూటింగ్‌కు వెళ్లిన మెగాస్టార్ దర్శకుడు
Also Read: హీరోయిన్ షాలు చౌరాసియాపై కేబీఆర్ పార్క్ దగ్గర దాడి... ఖరీదైన మొబైల్ లాకెళ్లిన దుండగుడు
Also Read: జోరుమీదున్న అక్షయ్ ... ఆకట్టుకుంటోన్న 'పృథ్వీరాజ్' టీజర్