Salaar - KGF 2: ఇదెక్కడి కంపేరిజన్ బాసూ, 'కెజియఫ్ 2'కు ప్రభాస్ 'సలార్' సీక్వెలా?
ప్రభాస్ 'సలార్'కు, యశ్ 'కెజియఫ్ 2'కు సంబంధం ఏంటి? 'కెజియఫ్ 2'కు 'సలార్' సీక్వెలా? ఏంటీ కంపేరిజన్? ఓ లుక్ వేయండి.
యశ్ 'కెజియఫ్ 2'కు ప్రభాస్ 'సలార్' సీక్వెలా? రెండు సినిమాల మధ్య సంబంధం ఉందా? సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న మీమ్స్ చూస్తే... ఎవరికైనా ఒక్క క్షణం నిజమని నమ్మే అవకాశాలు ఉన్నాయి. అసలు, ఏంటి కంపేరిజన్? ఏంటీ మీమ్స్ అనేది ఒక్కసారి చూస్తే...
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'సలార్'. 30 శాతం చిత్రీకరణ కంప్లీట్ అయ్యింది. ప్రభాస్ టైటిల్ రోల్ చేస్తున్నారు. 'కెజియఫ్' తరహాలో డార్క్ టోన్‌లో ప్రశాంత్ నీల్ సినిమా తీస్తున్నారని ఆల్రెడీ విడుదలైన స్టిల్స్ చూస్తే తెలుస్తుంది. అయితే... 'కెజియఫ్ 2' విడుదలైన తర్వాత కొత్త కథ వినిపించడం మొదలైంది.
Also Read: 'గాలివాన' రివ్యూ: 'జీ 5'లో విడుదలైన సిరీస్ ఎలా ఉందంటే?
'కెజియఫ్ 2'లో ఈశ్వరీ రావు కుమారుడి పేరు సలార్. అతడు హీరో దగ్గర సైన్యంలో పని చేస్తాడు. 'సలార్'లో అధీరాను అడ్డుకోవడానికి ముందుకొచ్చిన యువకుడిగా సలార్ పాత్రను చూపించారు. ఆ పాత్ర ఆధారంగా 'సలార్' తీస్తున్నారా? అనే సందేహం కొందరికి కలుగుతోంది. అయితే... అది నిజం అయ్యి ఉండదని, ప్రశాంత్ నీల్ అలా చేయడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో ప్రచారం మాత్రమే. రెండు సినిమాలకు దర్శకుడు ఒక్కరే కావడంతో ఇటువంటి ప్రచారం మొదలైంది.
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.