Mutton Soup Item Song: 'మటన్ సూప్'లో 'కల్లు కొట్టు కాడ'... మురళీ మోహన్ చేతుల మీదుగా ఐటెమ్ సాంగ్ రిలీజ్
Murali Mohan Releases Mutton Soup Song: ప్రముఖ నటుడు మురళీ మోహన్ చేతుల మీదుగా రామచంద్ర వట్టికూటి దర్శకత్వం వహించిన 'మటన్ సూప్'లో మాస్ ఎనర్జిటిక్ ఐటమ్ సాంగ్ 'కల్లు కొట్టు కాడ' విడుదల చేశారు.

రామచంద్ర వట్టికూటి (Ramachandra Vattikuti) దర్శకత్వం వహించిన సినిమా 'మటన్ సూప్' (Mutton Soup). విట్‌నెస్ ది రియల్ క్రైమ్... అనేది ట్యాగ్ లైన్. దర్శకుడిగా ఆయన తొలి చిత్రమిది. ఇందులో రమణ్ హీరో. వాణీ విశ్వనాథ్ హీరోయిన్. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి నిర్మాతలు. ఈ సినిమాలో మాస్ ఎనర్జిటిక్ ఐటమ్ సాంగ్ 'కల్లు కొట్టు కాడా' పాటను ప్రముఖ నటుడు మురళీ మోహన్ విడుదల చేశారు.
టైటిల్ బావుంది... సినిమా హిట్ అవ్వాలి!
'కల్లు కొట్టు కాడా... సాంగ్ విడుదల చేసిన తర్వాత మురళీ మోహన్ మాట్లాడుతూ... ''ఈ సినిమా టైటిల్ 'మటన్ సూప్' చాలా బాగుంది. యంగ్ టీం చేసిన ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. ఈ పాట కూడా బాగుంది. 'అల వైకుంఠపురములో' సినిమాలో సూరన్న మంచి పాట పాడారు. ప్రస్తుతం జానపద గీతాలకు ఆదరణ ఉంటోంది. ఈ సాంగ్ కూడా సక్సెస్ అవుతుంది'' అని అన్నారు.

'కల్లు కొట్టు కాడా' పాటను సూరన్న రాయగా... ఆయనతో పాటు 'రేలారే రేలా' గోపాల్, సుజాత వాసు కలిసి ఆలపించారు. ఈ పాటకు వెంకీ వీణ బాణీ అందించారు. ఇక ఈ పాటకు సత్య మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. దర్శకుడు రామచంద్ర మాట్లాడుతూ... ''ఇటీవల తనికెళ్ళ భరణి గారి చేతుల మీదుగా 'హరహర శంకరా' సాంగ్ రిలీజ్ చేశాం. దానికి మంచి స్పందన లభించింది. ఇప్పుడు మురళీ మోహన్ గారి చేతుల మీదుగా 'కల్లు కొట్టు కాడా' సాంగ్ రిలీజ్ చేశారు. ఆయనకు థాంక్స్. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అని చెప్పారు.
సినిమాలో పాటలు అన్నిటికీ తాను కొరియోగ్రఫీ చేశానని సత్య మాస్టర్ తెలిపారు. ఈ సినిమా బాగా వచ్చిందని, మంచి విజయం సాధిస్తుందని చెప్పారు. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నిర్మాతలు చెప్పారు. రమణ్, వర్ష విశ్వనాథ్ జంటగా నటించిన ఈ సినిమాలో 'జెమినీ' సురేష్, గోవింద్ శ్రీనివాస్, కిరణ్ మేడసాని, శివరాజ్, ఎస్ఆర్‌కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థలు: అలుక్కా స్టూడియోస్ - శ్రీ వారాహి ఆర్ట్స్ - భవిష్య విహార్ చిత్రాలు (BVC), సమర్పణ: రామకృష్ణ వట్టికూటి, దర్శకత్వం: రామచంద్ర వట్టికూటి, నిర్మాతలు: మల్లిఖార్జున ఎలికా (గోపాల్) - అరుణ్ చంద్ర వట్టికూటి - రామకృష్ణ సనపల.
Also Read: 'ఘాటీ' కలెక్షన్స్: తెలుగు రాష్ట్రాల్లో అనుష్క సినిమాకు ఫస్ట్ డే ఊహించని రిజల్ట్





















