Ghaati Collections - 'ఘాటీ' కలెక్షన్స్: తెలుగు రాష్ట్రాల్లో అనుష్క సినిమాకు ఫస్ట్ డే ఊహించని రిజల్ట్
Ghaati Box Office Collection Day 1: క్వీన్ అనుష్క నటించిన 'ఘాటీ' సినిమాకు క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మరి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ సినిమా ఓపెనింగ్ డే ఎన్ని కోట్లు వచ్చాయో తెలుస్సా?

Ghaati Movie Box Office Collection Day 1: క్వీన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన 'ఘాటీ' సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 5వ) తేదీన థియేటర్లలోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో సినిమాను విడుదల చేశారు. క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మరి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? మొదటి రోజు ఇండియాలో ఎన్ని కోట్లు వచ్చాయి? అనేది చూస్తే...
తెలుగు బాక్స్ ఆఫీస్ రెండు కోట్లు!
Ghaati Telugu Box Office Collection: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 'ఘాటీ' సినిమాకు అటు ఇటుగా రెండు కోట్ల రూపాయలకు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తమిళంలో ఈ సినిమాకు ఆశించిన స్పందన లేదట. అక్కడ నుంచి చెప్పుకోదగ్గ కలెక్షన్లు రాలేదు.
అమెరికాలోనూ 'ఘాటీ' సినిమాకు ఆదరణ బాలేదు. ప్రీమియర్స్ సహా మొదటి రోజు 18 వేల డాలర్లు వచ్చాయట. మన ఇండియన్ కరెన్సీలో అయితే అటు ఇటుగా 16 లక్షలు. ఓపెనింగ్ డే ఓవరాల్ కలెక్షన్స్ రెండున్నర కోట్లు దాటలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: 'ఘాటీ' రివ్యూ: క్రిష్ నుంచి పుష్ప, దసరా రేంజ్ రస్టిక్ యాక్షన్... అనుష్క సినిమా హిట్టా? ఫట్టా?
అనుష్క యాక్షన్ అవతార్, క్రిష్ డైరెక్షన్, యువి క్రియేషన్స్ వంటి టాప్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ వాల్యూ కాటికి చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. అన్నిటి కంటే ముఖ్యంగా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులలో క్యూరియాసిటీ కలిగించాయని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో 'ఘాటీ' కొంత సౌండ్ చేసింది. అయితే థియేటర్లలో మాత్రం ఆశించిన రిజల్ట్ కనిపించలేదు.
అనుష్క శెట్టికి జంటగా కోలీవుడ్ లెజెండరీ నటుడు శివాజీ గణేశన్ మనవడు - సీనియర్ హీరో ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభు 'ఘాటీ' సినిమాలో నటించారు. జగపతి బాబుతో పాటు రాజు సుందరం, జాన్ విజయ్, జిష్షు సేన్ గుప్తా, లారిస్సా బోనేసి, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్ర మాటలు రాయగా చింతకింది శ్రీనివాసరావు కథ అందించారు. యువి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పతాకం మీద రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి ప్రొడ్యూస్ చేశారు. విద్యాసాగర్ నాగవల్లి సంగీతం అందించారు.
Also Read: 'సైమా అవార్డ్స్ 2025' విన్నర్స్ లిస్ట్: 'పుష్ప 2'కు నాలుగు... సత్తా చాటిన 'కల్కి', 'హనుమాన్'





















