'ఘాటీ' థియేట్రికల్ రైట్స్ రేటు తక్కువే... అనుష్క ముందున్న టార్గెట్ ఎంతంటే?

'ఘాటీ' నైజాం రైట్స్ రూ. 8 కోట్లకు అమ్మినట్టు తెలిసింది. ఆంధ్రాలో అన్ని ఏరియాల రైట్స్ కలిపి రూ. 10 కోట్లకు విక్రయించారట.

సీడెడ్ 'ఘాటీ' రైట్స్ కేవలం రూ. 4 కోట్లు మాత్రమే. దాంతో టోటల్ ఏపీ, తెలంగాణ రైట్స్ ద్వారా 'ఘాటీ'కి రూ. 22 కోట్లు వచ్చాయట.

ఓవర్సీస్ రైట్స్ ద్వారా రూ. 10 కోట్లు, తమిళనాడు రైట్స్ ద్వారా మరో రూ. 9 కోట్లు వచ్చాయట.

కర్ణాటక, కేరళ రైట్స్ కలిపి రూ. 5 కోట్లు, నార్త్ ఇండియా రైట్స్ రూ. 5 కోట్లకు ఇచ్చారు. 

'ఘాటీ' వరల్డ్ వైడ్ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ వేల్యూ (ట్రేడ్ వర్గాల అంచనా): రూ. 51 కోట్లు

'ఘాటీ' బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 55 కోట్ల షేర్. వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అవుతారు.

'ఘాటీ' డిజిటల్ స్ట్రీమింగ్ ఓటీటీ రైట్స్ ఆల్రెడీ అమ్మేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ రూ. 35 కోట్లకు తీసుకుందట.

'ఘాటీ' బడ్జెట్ 50 కోట్లకు పైమాటే అని టాక్. ప్రస్తుతానికి నిర్మాతలు సేఫ్.

'ఘాటీ'లో అనుష్క విశ్వరూపం చూస్తారని దర్శకుడు క్రిష్ చెబుతున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో?