SIIMA Awards 2025 Winners List - 'సైమా అవార్డ్స్ 2025' విన్నర్స్ లిస్ట్: 'పుష్ప 2'కు నాలుగు... సత్తా చాటిన 'కల్కి', 'హనుమాన్'
SIIMA Awards 2025 Winners List Telugu: సైమా అవార్డ్స్ 2025 వేడుక దుబాయ్ లో ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు తెలుగు సినిమాలకు అవార్డులు అందించారు. ఏయే సినిమాలకు వచ్చాయో తెలుసా?

SIIMA Awards 2025 Winners List Telugu: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2025 దుబాయ్ లో ఘనంగా నిర్వహించారు. రెండు రోజుల పాటు ఈ వేడుక జరుగుతుంది. మొదటి రోజు తెలుగు సినిమాలకు అవార్డులు ఇచ్చారు. అందులో 'పుష్ప 2'కు నాలుగు అవార్డ్స్ వచ్చాయి. రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ', తేజా సజ్జా - ప్రశాంత్ వర్మల 'హనుమాన్' సైతం సత్తా చాటాయి. ఎవరికి ఏయే కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి? అనేది ఒక్కసారి చూస్తే...
'సైమా 2025'లో ఉత్తమ సినిమాగా 'కల్కి 2898 ఏడీ' ఎంపిక అయ్యింది. ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్)గా ప్రశాంత్ వర్మ, ఉత్తమ నటుడు (క్రిటిక్స్)గా తేజ సజ్జా నిలిచారు
SIIMA Awards 2025 Telugu Winners List:
ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ
ఉత్తమ దర్శకుడు: సుకుమార్
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): ప్రశాంత్ వర్మ
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (Allu Arjun)
ఉత్తమ నటుడు: (క్రిటిక్స్) – తేజ సజ్జా
ఉత్తమ నటి: రష్మిక మందన్నా
ఉత్తమ నటి (క్రిటిక్స్): మీనాక్షి చౌదరి
ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్
ఉత్తమ సహాయ నటి: అన్నే బెన్
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ)
ఉత్తమ గీత రచయిత: రామ్ జోగయ్య శాస్త్రి
ఉత్తమ గాయకుడు: శంకర్ బాబు కందుకూరి
ఉత్తమ గాయని: శిల్పా రావు
ఉత్తమ ప్రతినాయకుడు: కమల్ హాసన్ (Kamal Haasan)
ఉత్తమ పరిచయ నటి: పంకూరి, భాగ్యశ్రీ బోర్సే
ఉత్తమ పరిచయ నటుడు: సందీప్ సరోజ్
ఉత్తమ పరిచయ దర్శకుడు: నంద కిషోర్ యేమని
ఉత్తమ కొత్త నిర్మాత: నిహారిక కొణిదెల
ఉత్తమ ఛాయాగ్రాహకుడు: రత్నవేలు
ఉత్తమ హాస్యనటుడు: సత్య
Also Read: 'లిటిల్ హార్ట్స్' రివ్యూ: ఎంసెట్ కోచింగ్ సెంటర్‌లో లవ్ స్టోరీ... బాహుబలి కనెక్షన్ ఏంటి?





















