అన్వేషించండి

Little Hearts Collections - 'లిటిల్ హార్ట్స్' కలెక్షన్స్: చిన్న సినిమాకు బంపర్ ఓపెనింగ్ - తెలుగు రాష్ట్రాల్లో కోటి దాటిన వసూళ్లు!

Little Hearts Box Office Collection: మౌళి, శివానీ నాగరం జంటగా 'లిటిల్ హార్ట్స్' మూవీ మొదటి రోజు బంపర్ ఓపెనింగ్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగా రాబట్టింది.

Little Hearts 2025 Movie Box Office Collection Day 1: అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ డైరెక్షన్ చేసిన 'ఘాటీ' ఒక వైపు...‌‌‌‌ తమిళ హీరో శివ కార్తికేయన్, డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ‌కాంబినేషన్ సినిమా 'మదరాసి' మరో వైపు... ఈ రెండిటి మధ్య 'లిటిల్ హార్ట్స్' మూవీకి ఆడియన్స్ వస్తారా? అని సందేహాలు వ్యక్తం అయ్యాయి.‌‌ ఆ అనుమానాలు అన్నిటినీ పటాపంచలు చేస్తూ మొదటి రోజు బంపర్ ఓపెనింగ్ సాధించింది.

తెలుగు రాష్ట్రాలలో కోటిన్నర గ్రాస్!
Little Hearts 2025 First Day Collection: 'లిటిల్ హార్ట్స్' సినిమా మీద దర్శక నిర్మాతలతో పాటు‌‌ రిలీజ్ చేసిన 'బన్నీ' వాస్, వంశీ నందిపాటికి నమ్మకం ఉండడంతో సెప్టెంబర్ 5న‌‌ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ముందు రెండు తెలుగు రాష్ట్రాలలో పెయిడ్ ప్రీమియర్ షోలు వేశారు. ప్రీమియర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో మొదటి రోజు థియేటర్లకు యూత్ బాగా వచ్చారు.

Also Read: 'ఘాటీ' కలెక్షన్స్: తెలుగు రాష్ట్రాల్లో అనుష్క సినిమాకు ఫస్ట్‌ డే ఊహించని రిజల్ట్

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 'లిటిల్ హార్ట్స్' సినిమా కోటి 32 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ రాబట్టింది.‌ గ్రాస్ కలెక్షన్ చూస్తే ఆల్మోస్ట్ కోటిన్నర. స్పష్టంగా చెప్పాలంటే కోటి 47 లక్షల రూపాయలు రాబట్టింది. మరో వైపు అనుష్క 'ఘాటీ' సినిమాకు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు కలెక్షన్ రెండు కోట్ల రూపాయలు మాత్రమే.‌ దాంతో కంపేర్ చేస్తే ఈ సినిమాకు బలమైన వసూళ్లు వచ్చినట్టు లెక్క. రెండో రోజు 'ఘాటీ'ని లిటిల్ హార్ట్స్ క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్ కలెక్షన్లలో కూడా 'లిటిల్ హార్ట్స్' ముందంజలో ఉంది. 

Also Read: 'లిటిల్ హార్ట్స్' రివ్యూ: ఎంసెట్ కోచింగ్ సెంటర్‌లో లవ్ స్టోరీ... బాహుబలి కనెక్షన్ ఏంటి?

'90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రొడ్యూస్ చేసిన సినిమా 'లిటిల్ హార్ట్స్'. మౌళి హీరోగా నటించిన ఈ సినిమాలో 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' ఫేమ్ శివాని నాగరం హీరోయిన్.‌ ఈ సినిమాకు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. సింజిత్ ఎర్రమల్లి మ్యూజిక్ చేశారు. సినిమాలో వినోదం బావుందని పేరు రావడంతో థియేటర్లకు ప్రేక్షకులు రాక మొదలైంది.

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
Jabardasth Venky Reaction : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
Embed widget