అన్వేషించండి

USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 

USB Pendrive: వినియోగదారులు తమ డేటాను సులభంగా నిల్వ చేసుకోవడానికి వీలు కల్పించే క్లౌడ్ స్టోరేజ్ అనే సాంకేతికత నుంచి పెన్‌డ్రైవ్ గట్టి పోటీని ఎదుర్కోంటోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • USB పెన్‌డ్రైవ్‌లు ఒకప్పుడు డేటా నిల్వకు కీలకం, ఇప్పుడు తగ్గాయి.
  • క్లౌడ్, స్మార్ట్‌ఫోన్‌లు, SSDలు వాటి ప్రాముఖ్యతను గణనీయంగా తగ్గించాయి.
  • ఆఫ్‌లైన్ బదిలీ, ప్రత్యేక అవసరాలకు పెన్‌డ్రైవ్‌లు ఇంకా అవసరం.

USB Pendrive: నేటి డిజిటల్ యుగంలో, స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్ ఒక అవసరంగా మారాయి. కానీ కాలంతోపాటు, డేటా నిల్వ కూడా ఒక అవసరంగా మారింది. ఒకప్పుడు కంప్యూటర్‌ల నుంచి టీవీలు, కార్ మ్యూజిక్ సిస్టమ్‌ల వరకు ప్రతిచోటా USB పెన్‌డ్రైవ్‌లను ఉపయోగించేవారు. ఒక చిన్న పెన్‌డ్రైవ్‌లో ముఖ్యమైన ఫైల్‌లు, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌లు, సినిమాలను తీసుకువెళ్లడం చాలా సులభంగా ఉండేది.

కానీ డేటా నిల్వ ప్రపంచం వేగంగా మారుతోంది. క్లౌడ్ స్టోరేజ్, స్మార్ట్‌ఫోన్‌లు, SSDలు, ఆన్‌లైన్ షేరింగ్ వంటి సాంకేతికతలు పెన్ డ్రైవ్‌ల అవసరాన్ని గణనీయంగా తగ్గించాయి. దీని అర్థం USB పెన్ డ్రైవ్ పూర్తిగా కనుమరుగైపోయిందని కాదు. కానీ దాని పాత్ర మారింది. మరి డేటా నిల్వ ఎలా మారుతోందో ఇప్పుడు పరిశీలిద్దాం.

క్లౌడ్ స్టోరేజ్ గేమ్‌ను మార్చేసింది.

పెన్ డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. ఈ సాంకేతికత వినియోగదారులకు వారి డేటాను సులభంగా నిల్వ చేయడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా, ప్రజలకు భౌతిక డ్రైవ్ అవసరం లేదు. ఎక్కడి నుంచైనా వారి డేటాను యాక్సెస్ చేయవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌ల వల్ల పెన్ డ్రైవ్‌ల అవసరం కూడా తగ్గింది

అంతేకాకుండా, ఈ రోజుల్లో చాలా మందికి స్మార్ట్‌ఫోన్‌లు ప్రాథమిక డిజిటల్ స్టోరేజ్‌ పరికరంగా మారాయి. అధిక నిల్వ సామర్థ్యంతో, ఫోటోలు, వీడియోలు, డాంక్యుమెంట్స్‌ ఇతర ముఖ్యమైన డేటాను సులభంగా స్టోర్ చేయవచ్చు.

అంతేకాకుండా, వాట్సాప్, ఇమెయిల్, ఇతర యాప్‌ల ద్వారా ఫైళ్లను షేర్ చేయడం చాలా సులభం అయింది. గతంలో, ఒక పెద్ద ఫైల్‌ను మరొక కంప్యూటర్‌కు బదిలీ చేయడానికి పెన్ డ్రైవ్ అవసరమయ్యేది, కానీ ఇప్పుడు, ఫైళ్లను ఇంటర్నెట్ ద్వారా సెకన్లలో లేదా నిమిషాల్లో పంపవచ్చు.

SSDల పెరుగుతున్న వినియోగ, వేగవంతమైన నిల్వ

మీ సమాచారం కోసం, అనేక విషయాలలో పెన్ డ్రైవ్‌ల కంటే అధునాతన SSDలు మెరుగైన ఎంపికగా మారుతున్నాయి. ముఖ్యంగా పెద్ద ఫైల్స్ ,భారీ డేటాతో పనిచేసే వినియోగదారులకు, పోర్టబుల్ SSDలు చాలా ఉపయోగకరమైన పరికరంగా వాడుకుంటున్నారు.

ఇవి వేగవంతమైన డేటా బదిలీ వేగం, ఎక్కువ నిల్వ సామర్థ్యం, మెరుగైన పనితీరును అందిస్తాయి. సాధారణ వినియోగదారులకు పెన్ డ్రైవ్‌లు చవకైన, సౌకర్యవంతమైన ఎంపికగా ఉన్నప్పటికీ, వృత్తిపరమైన ఉపయోగం కోసం పోర్టబుల్ SSDలు కూడా ప్రజాదరణ పొందుతున్నాయి.

USB పెన్‌డ్రైవ్‌ల లోపాలు  

పెన్ డ్రైవ్‌లు చిన్నవిగా, ఉపయోగించడానికి సులభంగా ఉన్నప్పటికీ, వాటితో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. వాటి చిన్న పరిమాణం కారణంగా, ఈ పరికరాలు సులభంగా పోగొట్టుకోవచ్చు. ఒకవేళ డ్రైవ్‌లో ముఖ్యమైన డేటా ఉండి, అది పోగొట్టుకుంటే, అది వేరొకరి చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది.

అంతేకాకుండా, పదేపదే వాడటం, మెమరీ నాణ్యత తక్కువగా ఉండటం, అనుకోకుండా తీసివేయడం వంటి కారణాల వల్ల కూడా పెన్ డ్రైవ్‌లు పాడైపోవచ్చు. అందువల్ల, అత్యంత ముఖ్యమైన డేటా కోసం కేవలం పెన్ డ్రైవ్‌పై మాత్రమే ఆధారపడటం సురక్షితమైన ఆప్షన్ కాదు.

పెన్‌డ్రైవ్ పని పూర్తిగా అయిపోలేదు 

కొత్త సాంకేతికత పరిస్థితిని మార్చేసింది. కానీ పెన్ డ్రైవ్ పని పూర్తిగా అయిపోలేదు. ఇంటర్నెట్ అందుబాటులో లేని చోట లేదా పెద్ద ఫైళ్లను ఆఫ్‌లైన్‌లో బదిలీ చేయవలసి వచ్చినప్పుడు, అవి ఇప్పటికీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఇన్‌స్టాల్ చేయడం, కంప్యూటర్‌లకు సాఫ్ట్‌వేర్ లేదా డ్రైవర్‌లను బదిలీ చేయడం, టీవీలలో వీడియాలను ప్లే చేయడం, బ్యాకప్‌లను నిల్వ చేయడం వంటి పనుల కోసం పెన్ డ్రైవ్‌లను ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ వేగం తక్కువగా ఉండే ప్రదేశాల్లో ఆఫ్‌లైన్ స్టోరేజ్‌ చాలా అవసరం.

భవిష్యత్తులో డేటా నిల్వ ఎలా ఉంటుంది?

మీ సమాచారం కోసం, భవిష్యత్తులో, ఒకే పరికరంపై ఆధారపడకుండా డేటాను అనేక విధాలుగా నిల్వ చేయవచ్చు. ముఖ్యమైన ఫైళ్లను క్లౌడ్‌లో బ్యాకప్ చేయవచ్చు, రోజువారీ డేటా కోసం స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించవచ్చు. పెద్ద ఫైళ్ల కోసం SSDలను ఉపయోగించవచ్చు.

పెన్ డ్రైవ్‌లు నిర్దిష్ట అవసరాల కోసం ఒక చిన్న, సులభంగా తీసుకువెళ్లగలిగే నిల్వ ఎంపికగా మిగిలిపోవచ్చు. అందువల్ల, పెన్ డ్రైవ్‌లు పూర్తిగా అంతరించిపోయాయని చెప్పడానికి వీలు లేదు.  

Frequently Asked Questions

USB పెన్‌డ్రైవ్‌ల వాడకం ఎందుకు తగ్గింది?

క్లౌడ్ స్టోరేజ్, స్మార్ట్‌ఫోన్‌లు, SSDలు, ఆన్‌లైన్ షేరింగ్ వంటి కొత్త సాంకేతికతలు పెన్‌డ్రైవ్‌ల అవసరాన్ని తగ్గించాయి. వీటి ద్వారా డేటాను సులభంగా నిల్వ చేయవచ్చు మరియు బదిలీ చేయవచ్చు.

USB పెన్‌డ్రైవ్‌ల లోపాలు ఏమిటి?

పెన్‌డ్రైవ్‌లు చిన్నవి కాబట్టి సులభంగా పోగొట్టుకోవచ్చు, డేటా చోరీకి గురికావచ్చు. పదేపదే వాడటం వల్ల లేదా తక్కువ నాణ్యత వల్ల అవి పాడైపోయే అవకాశం ఉంది.

USB పెన్‌డ్రైవ్‌లు ఇప్పటికీ ఉపయోగకరంగా ఉన్నాయా?

అవును, ఇంటర్నెట్ లేని చోట, పెద్ద ఫైళ్లను ఆఫ్‌లైన్‌లో బదిలీ చేయడానికి, ఆపరేటింగ్ సిస్టమ్‌లు, సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. టీవీలలో వీడియోలను ప్లే చేయడానికి, బ్యాకప్‌ల కోసం కూడా వీటిని వాడతారు.

టాప్ హెడ్ లైన్స్

WhatsApp Web Security: ఆఫీసు కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ యూజ్.. ఈ పొరపాట్లు వద్దంటూ కేంద్రం కీలక సూచనలు!
ఆఫీసు కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ యూజ్.. ఈ పొరపాట్లు వద్దంటూ కేంద్రం కీలక సూచనలు!
Lightning Safety Tips: ఉరుములు, మెరుపుల సమయంలో స్మార్ట్ టీవీ, వై-ఫై రౌటర్ ప్లగ్ ఎందుకు తీసేయాలి?
ఉరుములు, మెరుపుల సమయంలో స్మార్ట్ టీవీ, వై-ఫై రౌటర్ ప్లగ్ ఎందుకు తీసేయాలి?
Power Bank Tips: వైర్ ఉన్నదా లేక వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
వైర్ ఉన్నదా లేక వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Temple Wearable Device : స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
Atmakur Municipal Vice Chairperson: రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
రెండోరోజూ హైడ్రామా.. ఆత్మకూరు వైస్ ఛైర్‌పర్సన్‌గా కొలగాని శిరీష ఎన్నిక
Seethakka: కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
కావాలని అన్న మాట కాదు, పొరపాటుకు చింతిస్తున్నాను: కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క వివరణ
Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
HIV Myths vs Facts : దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
TTD LIC Insurance Scheme: తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
Tata Cars Price Hike: టాటా కారు కొనేవాళ్లకు భారీ షాక్‌.. డిసెంబర్ నుంచి పెరగనున్న ICE, EV మోడళ్ల ధరలు
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌.. దాదాపు రూ.15,000 అదనపు భారం వేస్తున్న టాటా
Vaibhav Sooryavanshi World Record: చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
Embed widget