అన్వేషించండి

Lightning Safety Tips: ఉరుములు, మెరుపుల సమయంలో స్మార్ట్ టీవీ, వై-ఫై రౌటర్ ప్లగ్ ఎందుకు తీసేయాలి?

Lightning Safety Tips: ఉరుములు, మెరుపుల సమయంలో టీవీ, ఎలక్ట్రానిక్ పరికరాల ప్లగ్‌లను తొలగించడమే సేఫ్ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. అదేంటో తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పిడుగుల నుండి రక్షణకు అన్ని ప్లగ్‌లు తీసివేయాలి.

Lightning Safety Tips: వర్షాకాలంలో ఉరుములు మెరుపుల హోరు సహజం. ఉరుముల సమయంలో టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఆపివేయమని చెబుతుంటారు. చాలామంది దీనిని ఒక పాత కాలపు అలవాటుగా కొట్టిపారేసి, కేవలం రిమోట్‌తో టీవీని ఆఫ్ చేసి, రౌటర్‌ను అలాగే ఉంచేస్తారు. కానీ, నేడు ఇళ్లల్లో ఖరీదైన స్మార్ట్ టీవీలు, హై-స్పీడ్ వై-ఫై రౌటర్లు, సెట్-టాప్ బాక్సులు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ఈ గాడ్జెట్‌లు చాలా సున్నితమైన ఎలక్ట్రానిక్ పార్ట్స్ ను కలిగి ఉంటాయి. ఒక చిన్న అజాగ్రత్త వేల రూపాయల నష్టాన్ని మిగుల్చుతుంది. అందుకే, ఉరుములు వచ్చే సమయంలో కేవలం స్విచ్ ఆఫ్ చేయడం సరికాదు, సాకెట్ నుండి ప్లగ్‌ను పూర్తిగా తీసివేయడం కూడా ముఖ్యమే.  

కేవలం స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోదు?

చాలామంది స్విచ్ లేదా రిమోట్ ఉపయోగించి స్మార్ట్ టీవీని ఆఫ్ చేస్తే సేఫ్ అని భావిస్తారు. కానీ అది అపోహ మాత్రమే. టీవీ లేదా వై-ఫై రౌటర్ సాకెట్‌కు ప్లగ్ చేసి ఉన్నంత సేపు, అవి మీ ఇంటి ఇంటర్నల్ వైరింగ్ ద్వారా బయటి మెయిన్ విద్యుత్ లైన్‌కు జాయింట్ అయి ఉంటాయి. భారీ వర్షం లేదా మెరుపుల సమయంలో, పవర్ గ్రిడ్‌లో అకస్మాత్తుగా అత్యధిక వోల్టేజ్ ప్రవాహం ఏర్పడవచ్చు. దీనినే 'పవర్ సర్జ్' అని పిలుస్తారు. ఈ హై వోల్టేజ్ కరెంట్, స్విచ్ ఆఫ్ చేసి ఉన్న స్విచ్‌ను కూడా ఛేదించుకుని, నేరుగా డివైజ్ ఇంటర్నల్ మదర్‌బోర్డ్‌లోకి దూసుకెళ్లగలదు. ఆధునిక స్మార్ట్ టీవీలు, రౌటర్లలో ఉండే సున్నితమైన చిప్‌లు ఇంతటి శక్తివంతమైన విద్యుత్ షాక్‌ను తట్టుకోలేవు. ఫలితంగా, సర్క్యూట్లు కాలిపోయి, పరికరం పూర్తిగా పనికిరాకుండా పోతుంది.

ఇంటర్నెట్ కేబుల్ ద్వారా కూడా 

వై-ఫై రౌటర్లు, స్మార్ట్ టీవీల విషయంలో ప్రమాదం కేవలం విద్యుత్ సరఫరాకు మాత్రమే పరిమితం కాదు. చాలా ఇళ్లల్లో, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కోసం బయటి స్తంభాల నుండి వచ్చే కేబుల్, నేరుగా రౌటర్‌కు జాయిన్ చేసి ఉంటాయి. అలాగే, స్మార్ట్ టీవీలకు LAN కేబుల్స్ లేదా సెట్ టాప్ బాక్స్ వైర్లు కనెక్ట్ చేసి ఉంటాయి. ఒకవేళ సమీపంలో బలమైన పిడుగు పడితే, ఆ పిడుగు ఎలక్ట్రికల్ ఫీల్డ్ టెలికాం వైర్లపై కూడా ప్రభావం చూపగలదు.

ఈ కేబుల్స్ ద్వారా కూడా హై వోల్టేజ్ కరెంట్ నేరుగా మీ రౌటర్‌లోకి వచ్చి, దానిని దెబ్బతీస్తుంది. రౌటర్ ద్వారా ఆ షాక్ టీవీ లేదా కంప్యూటర్‌కు కూడా పాకే ప్రమాదం ఉంది. అందుకే, వాతావరణంలో మార్పులు ఉన్నప్పుడు, పవర్ ప్లగ్‌ను తీసివేయడంతో పాటు, రౌటర్ నుండి ఇంటర్నెట్ కేబుల్‌ను, టీవీ నుండి యాంటెన్నా లేదా సెట్-టాప్ బాక్స్ వైర్‌ను కూడా డిస్‌కనెక్ట్ చేయడం సేఫ్.   

Also Read: 180 టన్నుల విమానాన్ని కేవలం రెండు టైర్లపైనే లాగిన SUV.. Denza Bao 5 సరికొత్త రికార్డు!

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

  1. మీ ప్రాంతంలో భారీ ఉరుములతో కూడిన తుపాను సంభవిస్తున్నట్లు తెలిస్తే ఈ జాగ్రత్తలు పాటించండి. 
  2. మీ స్మార్ట్ టీవీ, వై-ఫై రౌటర్, కంప్యూటర్ వంటి ఖరీదైన పరికరాలను సాకెట్ల నుండి పూర్తిగా తొలగించండి. 
  3. ప్లగ్ తీసేటప్పుడు మీ చేతులు పూర్తిగా పొడిగా ఉండేలా చూసుకోండి. రబ్బరు చెప్పులు ధరించడం మంచిది.

ఇంటి మెయిన్ విద్యుత్ సరఫరాకు లేదా వ్యక్తిగత పరికరాల కోసం సర్జ్ ప్రొటెక్టర్  లేదా వోల్టేజ్ స్టెబిలైజర్‌ ను అమర్చుకోవడం ద్వారా కొంత రక్షణ లభిస్తుంది. ఇవి అకస్మాత్తుగా పెరిగే వోల్టేజ్‌ను నిరోధిస్తాయి. అయినప్పటికీ, పిడుగుపాటు సమయంలో పరికరాలను అన్‌ప్లగ్ చేయడమే పూర్తి సురక్షిత మార్గం.  చిన్న అప్రమత్తత ఖరీదైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను భారీ నష్టం నుండి కాపాడుతుంది.

Also Read: డీజిల్ ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? లీటర్‌కు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే బెస్ట్‌ కార్లు ఇవే!

Frequently Asked Questions

ఉరుములు, మెరుపుల సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

స్మార్ట్ టీవీ, రౌటర్ వంటి ఖరీదైన పరికరాల ప్లగ్‌లను సాకెట్ల నుండి పూర్తిగా తొలగించాలి. ఇంటర్నెట్ కేబుల్స్, యాంటెన్నా వైర్లను కూడా డిస్‌కనెక్ట్ చేయాలి. తడి చేతులతో ప్లగ్ తీయకుండా రబ్బరు చెప్పులు ధరించాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Power Bank Tips: వైర్ ఉన్నదా లేక వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
వైర్ ఉన్నదా లేక వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Temple Wearable Device : స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
Type A vs Type C Cables: ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Organizational Revamp: డిసెంబర్ నాటికి 70 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై జగన్ కసరత్తు.. కొత్తవారిని తెస్తారా, ఉన్నవారినే దారిలోకి తెచ్చుకుంటారా?
డిసెంబర్ నాటికి 70 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై జగన్ కసరత్తు.. కొత్తవారిని తెస్తారా, ఉన్నవారినే దారిలోకి తెచ్చుకుంటారా?
YS Sharmila: బెంగళూరులో షర్మిలకు చేదు అనుభవం.. యలహంక ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
బెంగళూరులో షర్మిలకు చేదు అనుభవం.. యలహంక ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
CM Revanth Reddy: కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
Pawan Kalyan: పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
Rishabh Pant Sixes:  దిగ్గజం మెకల్లమ్  రికార్డును బద్దలు కొట్టిన పంత్.. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రికార్డు, గిల్‌క్రిస్ట్ సరసన ..
దిగ్గజం మెకల్లమ్  రికార్డును బద్దలు కొట్టిన పంత్.. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రికార్డు, గిల్‌క్రిస్ట్ సరసన నిలిచిన టీమిండియా కీపర్
Bigg Boss Season 10 Today November 22nd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నీతూ ఎలిమినేట్! సరదా సరదాగా సండే ఎపిసోడ్! మైసా.. రష్మిక సందడి!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నీతూ ఎలిమినేట్! సరదా సరదాగా సండే ఎపిసోడ్! మైసా.. రష్మిక సందడి!
Hero Splendor Plus Price Hike: కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చిన హీరో కంపెనీ.. బైక్ ధరలు పెరిగాయి, అయినా నో టెన్షన్
కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చిన హీరో కంపెనీ.. బైక్ ధరలు పెరిగాయి, అయినా నో టెన్షన్
ITI vs IIT Respect: ఐఐటీ గ్రాడ్యుయేట్లతో సమానంగా ఐటీఐ విద్యార్థులకు గౌరవం.. ప్రధాని మోదీ విజన్‌ను స్వాగతించిన మంత్రి లోకేశ్
ఐఐటీ గ్రాడ్యుయేట్లతో సమానంగా ఐటీఐ విద్యార్థులకు గౌరవం.. ప్రధాని మోదీ విజన్‌ను స్వాగతించిన మంత్రి లోకేశ్
Embed widget