అన్వేషించండి

Washing Machines: ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు.. ఏది బెటర్? మోటార్, వాటర్, స్పిన్ స్పీడ్ తేడాలు ఇవే!

Washing Machines: మార్కెట్లో ఉన్న ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లలో ఏది బెస్ట్. బట్టల సెఫ్టీ, కరెంట్ వాడకం తేడాలేంటో తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఫ్రంట్-లోడ్ బట్టలను పడేస్తూ, టాప్-లోడ్ అజిటేటర్/ఇంపెల్లర్‌తో శుభ్రం.
  • ఫ్రంట్-లోడ్ తక్కువ నీటిని వాడగా, టాప్-లోడ్ ఎక్కువ వినియోగిస్తుంది.
  • ఫ్రంట్-లోడ్ అధిక స్పిన్ తో బట్టలు త్వరగా ఆరిపోతాయి.
  • టాప్-లోడ్ తక్కువ స్పిన్ తో బట్టలు ఆరడానికి సమయం పడుతుంది.

Washing Machines: మార్కెట్లో ప్రధానంగా రెండు మోడళ్ల వాషింగ్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయి. అవే ఫ్రంట్-లోడ్, టాప్-లోడ్ మెషీన్లు. ఈ రెండు మోడల్స్ బట్టల నుండి మురికిని సమర్థవంతంగా తొలగిస్తాయి. కానీ వీటిలో ఉపయోగించే టెక్నాలజీ, క్లీనింగ్ పూర్తిగా భిన్నంగా ఉంటాయి. దీంతో నీటి వినియోగం, కరెంట్ వాడకం, బట్టల సెఫ్టీ, ఉతికే సమయంలో తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. మోటార్ నుండి నీటి వరకు ఈ రెండు మెషీన్లు ఎలా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

డ్రమ్‌ పనితీరు 

ఫ్రంట్-లోడ్ మెషీన్: ఇందులో బట్టలను ఫ్రంట్‌లో ఉండే డోర్ ద్వారా లోపలికి వేస్తారు. డ్రమ్ తిరుగుతున్నప్పుడు బట్టలు పైకి, కిందకు తిరుగుతాయి. ఈ గ్రావిటేషనల్ డ్రాప్  వల్ల బట్టల దారాల్లోని మురికి సులభంగా తొలగిపోతుంది. దీనికి చాలా తక్కువ నీరు అవసరమవుతుంది.

టాప్-లోడ్ మెషీన్: ఈ మోడల్ మెషీన్లలో బట్టలను పై నుండి లోడ్ చేస్తారు. ఇవి మెయిన్‌గా రెండు పద్ధతుల్లో ఉంటాయి. మొదటిది 'అజిటేటర్' పద్ధతి, ఇందులో డ్రమ్ మధ్యలో ఉండే ఒక స్పిండిల్ బట్టలను తిప్పుతుంది. రెండోది 'ఇంపెల్లర్' విధానం.. ఇందులో అడుగు భాగంలో ఉండే చక్రం బట్టలు ఒకదానికొకటి రుద్దుకునేలా తిప్పుతుంది. అజిటేటర్ మెషీన్లు బట్టలపై కాస్త ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి.

నీటి వాడకంలో భారీ తేడా

నీటి ఆదా విషయంలో ఫ్రంట్-లోడ్ మెషీన్‌లు ఎంతో ముందున్నాయి. సాధారణంగా ఫ్రంట్-లోడ్ మెషీన్ ఒక్కో వాష్‌కు కేవలం 40 నుంచి 50 లీటర్ల నీరు అవసరం అవుతుంది. దీంతో పోలిస్తే, ఒక సంప్రదాయ టాప్-లోడ్ మెషీన్ సుమారుగా 120 నుంచి 150 లీటర్ల నీటిని పీల్చుకుంటుంది. ఇక ఇంపెల్లర్ ఉన్న టాప్-లోడ్ మెషీన్లు సుమారు 80 నుంచి 100 లీటర్ల నీటిని వాడతాయి. అయితే వాస్తవానికి ఇది మెషీన్ సామర్థ్యం, వాష్ ప్రోగ్రామ్‌ను బట్టి మారుతుంటుంది. 

Also Read: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు

స్పిన్ స్పీడ్, ఆరబెట్టడం

బట్టలను పిండే విషయంలో స్పిన్ స్పీడ్ చాలా కీలకం. ఫ్రంట్ లోడ్ మెషీన్‌ల స్పిన్ స్పీడ్ సాధారణంగా నిమిషానికి 1,400 నుంచి 1,600 ఆర్‌పీఎం వరకు ఉంటుంది. టాప్-లోడ్ మెషీన్‌లలో ఇది సుమారు 600 నుండి 800 ఆర్‌పీఎం వరకే పరిమితమై ఉంటుంది. ఫ్రంట్-లోడ్ మెషీన్లలో ఉండే అత్యధిక స్పిన్ స్పీడ్ బట్టలలోని తేమను పూర్తిగా పిండేస్తుంది. దీంతో బట్టలు చాలా తక్కువ సమయంలో ఆరిపోతాయి. మరోవైపు, కొన్ని టాప్ లోడ్ మోడల్స్ బట్టలు ఉతికే ప్రాసెస్ స్పీడుగా ముగిస్తాయి.  

Also Read: ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి

Frequently Asked Questions

మార్కెట్లో ప్రధానంగా ఎన్ని రకాల వాషింగ్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయి?

మార్కెట్లో ప్రధానంగా ఫ్రంట్-లోడ్ మరియు టాప్-లోడ్ అనే రెండు రకాల వాషింగ్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండూ బట్టల నుండి మురికిని సమర్థవంతంగా తొలగిస్తాయి.

వాషింగ్ మెషీన్లలో నీటి వినియోగం ఎలా మారుతుంది?

ఫ్రంట్-లోడ్ మెషీన్లు ఒక్కో వాష్‌కు 40-50 లీటర్ల నీటిని వాడతాయి. టాప్-లోడ్ మెషీన్లు (మోడల్‌ను బట్టి) సుమారు 80-150 లీటర్ల నీటిని వినియోగిస్తాయి. ఫ్రంట్-లోడ్ మెషీన్లు నీటిని బాగా ఆదా చేస్తాయి.

ఫ్రంట్-లోడ్ వాషింగ్ మెషీన్లు బట్టలను ఎలా శుభ్రం చేస్తాయి?

ఫ్రంట్-లోడ్ మెషీన్లలో బట్టలు డ్రమ్ తిరిగేటప్పుడు పైకి, కిందకు పడతాయి. ఈ గ్రావిటేషనల్ డ్రాప్ బట్టల దారాల్లోని మురికిని సమర్థవంతంగా తొలగిస్తుంది. దీనికి చాలా తక్కువ నీరు అవసరం.

బట్టలను ఆరబెట్టడంలో ఫ్రంట్-లోడ్, టాప్-లోడ్ మెషీన్ల మధ్య తేడా ఏమిటి?

ఫ్రంట్-లోడ్ మెషీన్ల స్పిన్ స్పీడ్ 1400-1600 RPM వరకు ఉండటం వల్ల బట్టలలోని తేమ పూర్తిగా పోయి త్వరగా ఆరిపోతాయి. టాప్-లోడ్ మెషీన్లలో స్పిన్ స్పీడ్ సుమారు 600-800 RPM మాత్రమే ఉంటుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget