అన్వేషించండి

Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి

Tips To Reduce Laptop Heat : ల్యాప్​టాప్ వేడెక్కుతున్నా.. లేదా దానిలోని ఫ్యాన్ పెద్దగా శబ్దం చేస్తోన్నా.. ఎలాంటి సాఫ్ట్​వేర్​ లేకుండా ల్యాప్​టాప్ వేడిని తగ్గించే సింపుల్ చిట్కాలను ఇప్పుడు చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ల్యాప్‌టాప్‌ను మృదువైన ఉపరితలాలపై కాకుండా గట్టిచోట వాడండి.
  • వెంట్లు, ఫ్యాన్లలో పేరుకుపోయిన దుమ్మును ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి.
  • అనవసరమైన ప్రోగ్రామ్‌లు, ట్యాబ్‌లు మూసివేసి సర్వీసింగ్ చేయించండి.

Simple Tips To Cooling Laptop : ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్నప్పుడు.. అకస్మాత్తుగా వేడెక్కడం, ఫ్యాన్ నుంచి పెద్ద శబ్దం రావడం, లేదా స్క్రీన్ ఫ్రీజ్ అవ్వడం వంటివి ఇబ్బందిగా ఉంటాయి. చదువుతున్నా, ఆఫీసు పనులు చేస్తున్నా, లేదా గేమ్స్ ఆడుతున్నా, అధిక వేడి మీ ల్యాప్‌టాప్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఎక్కువకాలం ఇలా వేడెక్కితే.. దానిలోని పార్ట్స్ లైఫ్​టైమ్​ కూడా తగ్గిపోతుంది. అయితే దీనికోసం ప్రతిసారీ కొత్త సాఫ్ట్‌వేర్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీ ల్యాప్‌టాప్ వాడకాన్ని మార్చుకోవడం, కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వేడిని తగ్గించవచ్చు. 

మంచం, సోఫాపై వాడకండి..

ల్యాప్‌టాప్‌ను మంచం, సోఫా లేదా దిండుపై ఉపయోగించడం వల్ల దాని గాలి రంధ్రాలు మూసుకుపోయి.. వేడి గాలి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. మెరుగైన గాలి ప్రసరణ కోసం.. దానిని బల్లపై లేదా ఇతర గట్టి, చదునైన ఉపరితలంపై ఉంచండి. ల్యాప్‌టాప్ వెనుక కొంత ఖాళీ స్థలం ఉంచడం కూడా గాలి ప్రసరణకు సహాయపడుతుంది.

Also Read : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే

దుమ్ము పేరుకుపోతే..

కాలక్రమేణా ల్యాప్‌టాప్ వెంట్లు, ఫ్యాన్‌లలో దుమ్ము పేరుకుపోయి.. కూలింగ్‌ను ప్రభావితం చేస్తుంది. అందుకే వెంట్లను శుభ్రం చేయడానికి కంప్రెస్డ్ ఎయిర్‌ను ఉపయోగించవచ్చు. ల్యాప్‌టాప్‌ను తెరిచి లోపలి భాగాన్ని శుభ్రం చేసే ముందు.. దాని డిజైన్ గురించి తెలుసుకోవడం ముఖ్యం. అవసరమైతే సర్వీస్ సెంటర్ దగ్గరకు తీసుకెళ్లండి.

టాస్క్ మేనేజర్ చెక్ చేయండి..

అనేక ప్రోగ్రామ్‌లు, బ్రౌజర్ ట్యాబ్‌లు, వీడియో ఎడిటింగ్ యాప్‌లు లేదా గేమ్‌లను ఒకేసారి నడపడం వల్ల ప్రాసెసర్‌పై భారం పెరిగి, ల్యాప్‌టాప్ వేడెక్కవచ్చు. అందుకే అవసరం లేని యాప్‌లను మూసివేయండి. ఏ యాప్‌లు ఎక్కువగా రన్ అవుతున్నాయో చూడటానికి టాస్క్ మేనేజర్‌ను చెక్ చేయండి.

Also Read : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే

సర్వీసింగ్ బెటర్..

సింపుల్ వర్క్స్ చేస్తున్నప్పుడు కూడా మీ ల్యాప్‌టాప్ వేడెక్కితే.. దాని ఫ్యాన్ లేదా కూలింగ్ సిస్టమ్‌లో సమస్య ఉండవచ్చు. పాత ల్యాప్‌టాప్‌లలో థర్మల్ పేస్ట్ కూడా బలహీనపడి ఉండవచ్చు. అటువంటి సందర్భంలో దానికి సర్వీసింగ్ చేయించడం ఉత్తమం.

మరిన్ని జాగ్రత్తలు

ల్యాప్‌టాప్‌ను చాలా వేడిగా ఉండే గదిలో, నేరుగా సూర్యరశ్మిలో లేదా ఇరుకైన ప్రదేశాలలో ఉపయోగించడం వల్ల అది అతిగా వేడెక్కవచ్చు. దానిని చల్లని ప్రదేశంలో ఉంచండి. కింది భాగం గాలి తగిలేలా చూసుకోండి. ల్యాప్‌టాప్ మరీ వేడెక్కితే.. దాన్ని కొన్ని నిమిషాల పాటు ఆఫ్ చేయండి. అవసరం లేని, అవసరం లేనప్పుడు కొన్ని పరికరాలు డిస్‌కనెక్ట్ చేయండి. 

ల్యాప్‌టాప్ స్టాండ్ లేదా కూలింగ్ ప్యాడ్ గాలి ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మీ ల్యాప్‌టాప్‌ను క్రమం తప్పకుండా శుభ్రపరచడం, దాన్ని సరైన ప్రదేశంలో ఉపయోగించడం, ఉపయోగించని యాప్‌లను తీసివేయడం వంటి చిన్న అలవాట్లు వేడెక్కడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

Also Read : LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Formula E Car Race Case: ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Formula E Car Race Case: ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Ram Charan : రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' స్టోరీ అది కాదు - అసలు స్టోరీ ఏంటో చెప్పిన కార్తీక్ సుబ్బరాజు
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' స్టోరీ అది కాదు - అసలు స్టోరీ ఏంటో చెప్పిన కార్తీక్ సుబ్బరాజు
Harish Rao On Mallanna Sagar: మల్లన్న సాగర్ కట్ట దగ్గరలో అక్రమ బ్లాస్టింగ్‌లు.. కూల్చి వేసేందుకు కుట్ర జరుగుతోందా? - హరీష్ రావు
మల్లన్న సాగర్ కట్ట దగ్గరలో అక్రమ బ్లాస్టింగ్‌లు.. కూల్చి వేసేందుకు కుట్ర జరుగుతోందా? - హరీష్ రావు
Traffic E-Challans: ఈ-చలాన్లతో ఇబ్బంది పడుతున్నారా? నేషనల్‌ లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చు.. ఇలా చేయండి
ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా? లోక్‌ అదాలత్‌ ద్వారా జరిమానా తగ్గించుకునే ఛాన్స్‌!
AP El Nino Drought Ground Reality: ఎల్‌నినో పొలిటికల్ గేమ్ - ఆంధ్రాలో కరువు లేదంటున్న కేటీఆర్ - రేవంత్‌ను ఇరికించడానికేనా?
ఎల్‌నినో పొలిటికల్ గేమ్ - ఆంధ్రాలో కరువు లేదంటున్న కేటీఆర్ - రేవంత్‌ను ఇరికించడానికేనా?
Embed widget