అన్వేషించండి

Pilot Career : పైలట్ కావాలంటే 10 తర్వాత ఏం చదవాలి? కోర్సు, ట్రైనింగ్, జీతం పూర్తి వివరాలు ఇవే

Commercial Pilot Career : విమానం నడపాలనే కల మీకు ఉంటే.. పది తర్వాత నుంచే మీరు దానికి తగిన కెరీర్ ఎంచుకోవాలి. శిక్షణ ఎలా ఉంటుంది? జీతం ఎంత వరకు ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కమర్షియల్ పైలట్‌గా మారడానికి ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్ చదవాలి.
  • DGCA పరీక్షలు, వైద్య పరీక్షలు పాసై ఫ్లయింగ్ శిక్షణ పొందాలి.
  • శిక్షణ అనంతరం జూనియర్ ఫస్ట్ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది.
  • పైలట్ శిక్షణకు 25-35 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది.

Commercial Pilot Career in India : ఆకాశంలో విమానం ఎగరడం చూసి మీరు ఎప్పుడైనా పైలట్ అవ్వాలని కలలు కన్నారా? అయితే మీరు విమానయాన రంగం కెరీర్​గా ఎంచుకోవాలి. అయితే ఈ రంగంలోకి ప్రవేశించడానికి డ్రీమ్ ఉంటే సరిపోదు. 10వ తరగతి తర్వాత.. సరైన సబ్జెక్టును ఎంచుకోవడం నుంచి.. ఇంటర్ తర్వాత ట్రైనింగ్ పొందడం, లైసెన్స్ తీసుకోవడం వరకు అనేక దశలు ఉంటాయి. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. విమానయాన రంగంలో కెరీర్ ప్రారంభించడం అందరికీ ఒకేలా ఉండదు. కాబట్టి పది తర్వాత మీ కెరీర్‌ను ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలుసుకోండి. 

ఇంటర్​లో తీసుకోవాల్సిన సబ్జెక్ట్​లు

మీ లక్ష్యం కమర్షియల్ పైలట్ అవ్వడం అయితే ఇంటర్​లో ఫిజిక్స్, మ్యాథ్స్ చదవాల్సి ఉంటుంది. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత.. DGCA నిర్దేశించిన అర్హతలను నెరవేర్చుతూ CPL శిక్షణను పొందాల్సి ఉంటుంది. పైలట్ కావడానికి DGCA పోర్టల్‌లో నంబర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత మీరు క్లాస్ 2, క్లాస్ 1 మెడికల్ టెస్ట్​లు పూర్తి చేసుకోవాలి. DGCA నిర్దేశించిన థియరీ ఎగ్జామ్, RTR(A)లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత.. అభ్యర్థులు DGCA గుర్తింపు పొందిన ఫ్లయింగ్ ట్రైనింగ్ సంస్థ నుంచి విమానయాన శిక్షణ పొందుతారు.

Also Read : పరీక్షల సమయంలో పిల్లలు బాగా చదవాలంటే స్టడీ టేబుల్‌పై ఈ 5 వస్తువులు పెట్టొద్దు.. రీజన్స్ ఇవే

కామర్స్ చదివినా పర్లేదా?

CPL కోసం కనీస వయస్సు 17 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్ చదవాల్సి ఉంది. అందుకే 10 క్లాస్​లో ఉన్న విద్యార్థి పైలట్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. ఇంటర్​ నుంచే ఫిజిక్స్, మ్యాథ్స్​పై దృష్టి పెట్టాలి. అయితే విమానయాన రంగంలోని ప్రతి వృత్తికి సైన్స్ అవసరం లేదు.

కామర్స్ లేదా ఆర్ట్స్ డిగ్రీలు ఉన్న విద్యార్థులు కూడా ఏవియేషన్ మేనేజ్‌మెంట్, ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్, ఏవియేషన్ హాస్పిటాలిటీ, క్యాబిన్ క్రూ వంటి రంగాలను ఎంచుకోవచ్చు. ఇంటర్​లో మ్యాథ్స్, ఫిజిక్స్ తీసుకోనివారు NIOS ద్వారా ఈ రెండు సబ్జెక్టులను విడిగా పూర్తి చేయవచ్చు. అవసరమైన అకడమిక్ అర్హతలను పూర్తి చేసిన తర్వాత.. పైలట్ శిక్షణకు వెళ్లవచ్చు.

ప్రాక్టికల్ ఫ్లయింగ్ ట్రైనింగ్

DGCA పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత విద్యార్థులు ప్రాక్టికల్ ఫ్లయింగ్ శిక్షణ పొందుతారు. దీనికోసం CPL కోసం అవసరమైన ఫ్లయింగ్ అనుభవాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. శిక్షణ సమయంలో విద్యార్థులు విమాన నిర్వహణ, నావిగేషన్, ఎమర్జెన్సీ, ఇతర కార్యాచరణ నైపుణ్యాలను నేర్చుకుంటారు. అయితే పైలట్ కావడానికి కేవలం శిక్షణ పూర్తి చేస్తే సరిపోదు. అవసరమైన పరీక్షలు, ఫ్లయింగ్ అవసరాలు, స్కిల్ టెస్ట్ పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందగలుగుతారు.

Also Read : పిల్లలకు ఆన్​లైన్ స్టడీ మంచిదా? టెక్ట్స్ బుక్ చదువు మంచిదా? లాభాలు, నష్టాలు ఇవే 

లైసెన్స్​తో ఎయిర్​లైన్ కెప్టెన్ కావచ్చా? 

కమర్షియల్ లైసెన్స్ పొందిన వెంటనే నేరుగా ఎయిర్‌లైన్ కెప్టెన్ అవ్వరు. జూనియర్ పోస్ట్ ఆఫీసర్‌గా కెరీర్​ ప్రారంభిస్తారు. ప్రతి ఎయిర్‌లైన్‌కు దాని సొంత అవసరాలు, శిక్షణా ప్రక్రియ ఉంటాయి. ఎంపికైన తర్వాత వారు విమానం రకాన్ని బట్టి తదుపరి శిక్షణ, అవసరమైన తనిఖీలకు లోనవుతారు. దీని తర్వాత పైలట్ ఫస్ట్ ఆఫీసర్‌గా విమానం నడపడం ప్రారంభిస్తారు. అనుభవం, విమానయాన గంటలు పెరిగేకొద్దీ.. వారు సీనియర్ ఫస్ట్ ఆఫీసర్, ఆపై కెప్టెన్ హోదాకు పదోన్నతి పొందుతారు.

శాలరీ ఎంత ఉంటుందంటే.. 

పైలట్ల సంపాదన కూడా ఒకేలా ఉండదు. అది ఎయిర్‌లైన్, విమానం, హోదా, ఫ్లయింగ్ అవర్స్, అలవెన్సులపై ఆధారపడి ఉంటుంది. చాలా ఎయిర్‌లైన్స్‌లో ఒక జూనియర్ ఫస్ట్ ఆఫీసర్ నెలకు 1,00,000 నుంచి 15,00,000 వరకు సంపాదిస్తారు. ఫస్ట్ ఆఫీసర్ స్థాయిలో ఈ జీతం సుమారు 2,00,000 వరకు పెరుగుతుంది. ఆ తర్వాత, ప్రమోషన్లతో పాటు పైలట్ల జీతాలు కూడా పెరుగుతాయి.

పైలట్ ట్రైనింగ్ ఖర్చు..

పైలట్ శిక్షణ ఒక ఖరీదైన వృత్తి ఎంపికగా కూడా చెప్పవచ్చు. ఇండియాలో CPL శిక్షణకు సుమారు 25 నుంచి 35 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అయితే శిక్షణ, ఫ్లయింగ్ అవర్స్, ఇన్‌స్టిట్యూట్, తదుపరి ఎయిర్‌లైన్ శిక్షణ ఖర్చులు వేర్వేరుగా ఉంటాయి. అందుకే దీనిలో చేరడానికి ముందు ఇన్‌స్టిట్యూట్ ఫీజులు, శిక్షణా సౌకర్యాల గురించి తెలుసుకోవడం ముఖ్యం.

Also Read : ఇంటర్ తర్వాత ఈ ట్రెండింగ్ కోర్సులు ఎంచుకోండి.. అద్భుతమైన కెరీర్ అవకాశాలు మీ సొంతమవుతాయి

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jeera vs Ajwain vs Methi Water : జీలకర్ర నీళ్లా? వాము నీళ్లా? మెంతుల నీళ్లా? ఉదయాన్నే ఏది తాగితే మంచిది?
జీలకర్ర నీళ్లా? వాము నీళ్లా? మెంతుల నీళ్లా? ఉదయాన్నే ఏది తాగితే మంచిది?
Vitamin D Deficiency : ప్రతి 10 మందిలో 7 మందికి విటమిన్ డి లోపం.. ఎండలు ఉన్నా సమస్యకు అసలు కారణాలు ఇవే
ప్రతి 10 మందిలో 7 మందికి విటమిన్ డి లోపం.. ఎండలు ఉన్నా సమస్యకు అసలు కారణాలు ఇవే
Radish Benefits : చలికాలంలో ముల్లంగి తింటే కలిగే లాభాలు ఇవే.. పచ్చిగా తినొచ్చా? నష్టాలు ఏంటి? ఎలా తీసుకుంటే మంచిది?
చలికాలంలో ముల్లంగి తింటే కలిగే లాభాలు ఇవే.. పచ్చిగా తినొచ్చా? నష్టాలు ఏంటి? ఎలా తీసుకుంటే మంచిది?
Eat Twice a Day : రోజుకు రెండుసార్లే భోజనం చేయాలా? తినే ఆహారానికి మధ్య 5 నుంచి 8 గంటల గ్యాప్ ఇవ్వాలన్న సద్గురు.. బెనిఫిట్స్ ఇవే
రోజుకు రెండుసార్లే భోజనం చేయాలా? తినే ఆహారానికి మధ్య 5 నుంచి 8 గంటల గ్యాప్ ఇవ్వాలన్న సద్గురు.. బెనిఫిట్స్ ఇవే
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Sharmila: విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
Indian Railways Special Trains: పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
AP MPTC ZPTC Elections: పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
CM Revanth Reddy: 5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Embed widget