మీ ఫోన్‌తో పాటు వచ్చిన ఒరిజినల్ కేబుల్‌ను లేదా అదే బ్రాండ్ కొత్త కేబుల్‌ను ఉపయోగించడం శ్రేయస్కరం. మంచి క్వాలిటీ టైప్-సి కేబుల్‌ను ఎంచుకోండి, చౌకైన కేబుళ్లకు దూరంగా ఉండండి.
Type A vs Type C Cables: ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
Type A vs Type C Cables: మీ ఫోన్ స్పీడ్ గా ఛార్జ్ అవ్వడానికి టైప్ ఏ లేదా టైప్ సి.. ఏది బెస్ట్ ఆప్షన్. వీటి మధ్య తేడాలేంటో చూద్దాం.

- చౌక కేబుల్స్ వాడితే ఫోన్, బ్యాటరీ దెబ్బతినే ప్రమాదం ఉంది.
Type A vs Type C Cables: ఈ రోజుల్లో కొన్ని ఛార్జర్లు ఫోన్‌లను నెమ్మదిగా ఛార్జ్ చేస్తుంటే, మరికొన్ని చాలా స్పీడ్ ఛార్జ్ చేస్తుంటాయి. దీనికి ప్రధాన కారణం ఛార్జర్ అడాప్టర్ కెపాసిటీ మాత్రమే కాదు, మీరు ఉపయోగించే ఛార్జింగ్ కేబుల్ టైపు కూడా ఇందులో కీలకం. టైప్-సి కేబుల్స్ ఫోన్‌లను వేగంగా ఛార్జ్ చేస్తాయి, టైప్-ఎ కేబుల్స్ స్లోగా ఛార్జ్ చేస్తాయని చాలా మంది భావిస్తుంటారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటి? సరైన కేబుల్‌ను ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాం.
USB టైప్-A లేదా టైప్-C.. ఏది స్పీడ్
USB టైప్-A: ఓల్డ్, నార్మల్.. ఈ కేబుల్స్‌లో సాధారణంగా 4 నుండి 9 పిన్‌లు ఉంటాయి. ఇవి పాత ఛార్జింగ్ ప్రమాణాల కోసం తయారు చేసినవి. ఇవి సులభంగా 12 నుండి 18 వాట్స్ ఎనర్జీని మాత్రమే అందించగలవు.
USB టైప్-C: న్యూ టైప్-సి కనెక్టర్‌లో మొత్తం 24 పిన్‌లు ఉంటాయి. ఈ అదనపు పిన్‌లు డబుల్-సైడెడ్ కనెక్షన్‌కే కాకుండా, ఫోన్‌కు ఎక్కువ కరెంట్, వోల్టేజ్, డేటాను వేగంగా ప్రసారం చేయడానికి వీలు కల్పిస్తాయి. అందుకే 100 లేదా 200 వాట్లకు పైగా శక్తిని అందించాల్సి వచ్చినప్పుడు టైప్-సి మెయిన్ ఎంపికగా మారుతుంది.
Also Read: మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
కొన్ని బ్రాండ్‌ల టైప్-ఎ కేబుల్స్
ఒప్పో, వివో, వన్‌ప్లస్ వంటి కొన్ని కంపెనీలు తమ శక్తివంతమైన ఫోన్‌లతో టైప్-ఎ కేబుళ్లను అందిస్తున్నప్పటికీ అవి చాలా వేగంగా ఛార్జ్ అవుతుంటాయి. దీనికి కారణం, ఈ కంపెనీలు సాధారణ కేబుల్స్‌కు బదులుగా 5 పిన్‌లు కలిగి, ప్రత్యేక ప్రోటోకాల్‌పై పనిచేసే స్ట్రాంగ్ కేబుళ్లను ఉపయోగిస్తాయి. ఇవి వేడెక్కకుండా ఎక్కువ కరెంట్‌ను తట్టుకోగలవు.
ముఖ్యమైన సూచనలు
మీ ఫోన్‌తో పాటు వచ్చిన ఒరిజినల్ కేబుల్‌ను లేదా అదే బ్రాండ్ కొత్త కేబుల్‌ను ఉపయోగించడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం. మంచి క్వాలిటీ టైప్-సి కేబుల్‌ను ఎంచుకోండి. స్థానికంగా దొరికే చౌకైన కేబుళ్లను వాడటం వల్ల ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవ్వడమే కాకుండా, వేడెక్కడం ద్వారా బ్యాటరీ, మదర్‌బోర్డ్ దెబ్బతినే ప్రమాదం ఉంది.
Also Read: వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారా? - ఏపీఐ కొత్త ఛార్జీలు ఇవే!
Frequently Asked Questions
నా ఫోన్‌కు సరైన ఛార్జింగ్ కేబుల్‌ను ఎలా ఎంచుకోవాలి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















