వెంటనే మీ ఫోన్‌లోని వాట్సాప్ లింక్డ్ డివైజెస్ ఆప్షన్‌లోకి వెళ్లి అన్ని కంప్యూటర్ల నుండి లాగ్ అవుట్ చేయాలి. అప్రమత్తంగా ఉండాలి.
WhatsApp Web Security: ఆఫీసు కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ యూజ్.. ఈ పొరపాట్లు వద్దంటూ కేంద్రం కీలక సూచనలు!
WhatsApp Web Security: ఆఫీస్ కంప్యూటర్లు, సిస్టమ్లలో వాట్సాప్ వెబ్ యూజ్ చేయడంపై కేంద్రం కీలక సూచనలు చేసింది. సైబర్ మోసాలబారిన పడకుండా ఉండేందుకు జాగ్రతలు పాటించాలని తెలిపింది.

- తప్పనిసరి అయితే, పని తర్వాత సెట్టింగ్స్ నుండి లాగవుట్ చేయాలి.
WhatsApp Web Security: ఆఫీసు కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ ఉపయోగించే వారికి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) కీలక సూచనలు చేసింది. వాట్సాప్ వెబ్ యూజ్ చేయడంలో ఒక చిన్న అజాగ్రత్త మీ వ్యక్తిగత గోపత్యకు భంగం కలిగించడమే కాకుండా, సైబర్ మోసాలకు దారితీసే ప్రమాదం ఉందని తెలిపింది.
అకౌంట్ దుర్వినియోగం
మీరు వేరొకరి కంప్యూటర్‌లో లేదా పబ్లిక్ సిస్టమ్‌లో వాట్సాప్ వెబ్‌కు లాగిన్ అయి, పని పూర్తయ్యాక లాగ్ అవుట్ చేయడం మర్చిపోతే మీ అకౌంట్ పూర్తి కంట్రోల్ ఇతరుల చేతుల్లోకి వెళ్తుంది. దీనివల్ల అవతలి వ్యక్తులు మీ ప్రైవేట్ చాట్‌లు, గ్రూప్ డిస్‌కషన్లు, కాంటాక్ట్‌ల వివరాలను సులభంగా చూడగలరు. సైబర్ నేరగాళ్లు మీ వాట్సాప్ ఉపయోగించి మీ ఫ్రెండ్స్, రిలెటివ్స్, సహోద్యోగులకు మీ పేరుతో మెసేజ్‌లు పంపి అత్యవసరమంటూ డబ్బులు డిమాండ్ వంటి ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. మీ నెంబర్ నుంచే మెసేజ్‌లు రావడంతో అవతలి వ్యక్తులు కూడా నిజమేనని నమ్మి మోసపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
Also Read: ఉరుములు, మెరుపుల సమయంలో స్మార్ట్ టీవీ, వై-ఫై రౌటర్ ప్లగ్ ఎందుకు తీసేయాలి?
I4C జాగ్రత్తలు
ఆఫీసు, సైబర్ కేఫ్, ఇతర కంప్యూటర్లలో వీలైనంత వరకు వాట్సాప్ వెబ్‌ను వాడకపోవడమే బెస్ట్ అని I4C పేర్కొంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సి వస్తే ఈ నియమాలను కచ్చితంగా పాటించాలి.
- ప్రభుత్వ, ఆఫీసు సీక్రెట్స్, వ్యక్తిగత, సున్నితమైన డాక్యుమెంట్లను వాట్సాప్ వెబ్ ద్వారా పంచుకోవద్దు.
- పని పూర్తయ్యాక కేవలం బ్రౌజర్ ట్యాబ్ లేదా విండోను క్లోజ్ చేయడం సరిపోదు. వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి తప్పకుండా లాగ్ అవుట్ చేయాలి.
- వేరొకరి కంప్యూటర్ వాడాల్సి వస్తే, సాధారణ బ్రౌజర్‌కు బదులుగా ఇంకగ్నిటో లేదా ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌ను ఉపయోగించండి. పని అయ్యాక లాగ్ అవుట్ చేసి బ్రౌజర్ మూసివేయండి.
- సైబర్ కేఫ్‌లు, హోటల్ బిజినెస్ సెంటర్లు లేదా తెలియని వ్యక్తుల కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్‌కు అసలు లాగిన్ అవ్వకండి.
- మీరు పంపని మెసేజ్‌లు మీ అకౌంట్ నుంచి ఇతరులకు వెళ్లినట్లు గమనిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి. మీ ఫోన్‌లోని వాట్సాప్ లింక్డ్ డివైజెస్ ఆప్షన్‌లోకి వెళ్లి అన్ని కంప్యూటర్ల నుంచి వెంటనే లాగ్ అవుట్ చేయండి.
వీటితో పాటు, మీరు వాడే కంప్యూటర్, వెబ్ బ్రౌజర్, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకోవాలని, అనుమానాస్పద ఫైల్స్, లింక్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని సైబర్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.
Also Read: వైర్ ఉన్నదా లేక వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Frequently Asked Questions
నా వాట్సాప్ అకౌంట్ నుండి అనుమానాస్పద మెసేజ్‌లు వెళ్తున్నట్లు గమనిస్తే ఏం చేయాలి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















