Ram Charan Daughter: ఆ అమ్మాయి రామ్ చరణ్ కూతురు క్లింకారా కాదు... వైరల్ అవుతున్న ఫోటో ఎవరిదో తెలుసా?
Ram Charan Daughter Klin Kaara First Photo: రామ్ చరణ్ కూతురు అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఆ ఫోటో చరణ్ కూతురు కాదు. శ్రీజ చిన్నకూతురు ఫోటోగా తెలుస్తోంది.
Ram Charan Daughter First Photo: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇటీవల పాప పుట్టింది. వివాహమైన చాలా ఏళ్లకు పాప పుట్టడంతో ఇటు కొణిదెల ఫ్యామిలీతో పాటు అటు కామినేని కుటుంబంలోనూ సంబురాలు మిన్నంటాయి. ఇరు కుటుంబ సభ్యులు ఆమె రాకను పెద్ద పండుగలా నిర్వహించారు. పాప పుట్టినప్పటి నుంచి పేరు పెట్టే వరకు ప్రతి వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏరికోరి ఆ చిన్నారికి క్లీంకార అని పేరు పెట్టారు. ఆమె పేరును రివీల్ చేస్తూ తాతయ్య మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. పాప పుట్టి సుమారు ఏడాది గడుస్తున్నా, ఆమె ముఖాన్ని ఇప్పటి వరకు బయటకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎప్పుడెప్పుడు ఆమె ఫోటోలు బయటకు వస్తాయా? అని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రామ్ చరణ్ కూతురు అంటూ వైరల్ అవుతున్న ఫోటో
రామ్ చరణ్ కూతురు అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాప పుట్టాక ఏడాది ఫోటో బయట పెట్టారంటూ నెటిజన్లు ఓ ఫోటోను షేర్ చేస్తున్నారు. గుర్రం బొమ్మ మీద ఉన్న ఫోటోలో పాప ఎంతో క్యూట్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అచ్చం రామ్ చరణ్‌లా ఉందంటున్నారు. అయితే, వాస్తవానికి ఆ పాప రామ్ చరణ్ కూతురు కాదు. ఆయన సిస్టర్ శ్రీజ కూతురు. గతంలో ఎప్పుడో దిగిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీజ కూతురు ఇప్పుడు చాలా పెద్దది అయ్యింది. కొందరు మెగా అభిమానులు ఆ ఫోటో క్లీంకారది కాదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
View this post on Instagram
‘గేమ్ ఛేంజర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న చెర్రీ
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి సెకెండ్ సింగిల్ రిలీజ్ అయ్యింది. 'రా మచ్చా మచ్చా' అంటూ సాగే ఈ పాటలో రామ్ చరణ్ అదరగొట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘జరగండి... జరగండి...‘ అనే పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గేమ్ ఛేంజర్‘ సినిమాను అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Read Also: 'గేమ్ ఛేంజర్' దర్శకుడు శంకర్ కుమార్తె తెలుగు డెబ్యూ - తమిళ్ రీమేక్‌తోనే, హీరోలు ఎవరో తెలుసా?