అన్వేషించండి

Writer Sree Ramakrishna Death: చిత్రసీమలో మరో విషాదం - డబ్బింగ్ రైటర్ శ్రీ రామకృష్ణ మృతి - నేడు చెన్నైలో అంత్యక్రియలు

Writer Sree Ramakrishna Final Rites: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అనువాద చిత్రాలకు అద్భుతమైన సంభాషణలు రాసిన శ్రీ రామకృష్ణ ఇక లేరు. ఆయన సోమవారం మృతి చెందారు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తమిళ - తెలుగు చిత్ర పరిశ్రమల మధ్య వారధిగా నిలిచిన ప్రముఖ అనువాద మాటల రచయిత శ్రీ రామకృష్ణ (Dubbing Writer Sree Ramakrishna) ఇక లేరు. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్రీ రామకృష్ణ ఆరోగ్యం మరింత క్షీణించడంతో సోమవారం రాత్రి 8 గంటలకు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు.

చెన్నైలో ఈ రోజు అంత్యక్రియలు
శ్రీ రామకృష్ణ సోమవారం రాత్రి చెన్నైలోని తేనాపేటలోని అపోలో ఆసుపత్రిలో కన్ను మూశారు. ఆయన స్వస్థలం ఏపీలోని తెనాలి. అయితే, యాభై ఏళ్ల క్రితం తమిళనాడు వెళ్లారు. చెన్నైలో స్థిరపడ్డారు. తమిళ చిత్రాలు ఎన్నిటికో తెలుగులో అద్భుతమైన సంభాషణలు అందించారు. రచయితగా పేరు తెచ్చుకున్నారు.

Writer Sree Ramakrishna Family Details: శ్రీ రామకృష్ణ ఓ భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన సతీమణి పేరు స్వాతి. కుమారుడి పేరు గౌతమ్. ఈ రోజు ఆయన పార్థివ దేహానికి చెన్నైలోని సాలిగ్రామం ప్రాంతంలో గల శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు, అంత్యక్రియలు జరుగుతాయని కుమారుడు తెలిపారు.

Also Readప్రేమలు డిజిటల్ స్ట్రీమింగ్ - డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ ఓటీటీలో కాదు... ఇందులో మలయాళ బ్లాక్‌ బస్టర్ తెలుగు వెర్షన్ రిలీజ్!

మూడు వందలకు పైగా సినిమాలు...
మణిరత్నం, శంకర్ వంటి దర్శకులకు!
Writer Sree Ramakrishna Hit Movies: మూడు వందలకు పైగా డబ్బింగ్ సినిమాలకు మాటలు రాసిన ఘనత శ్రీ రామకృష్ణది. తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితులైన మణిరత్నం, శంకర్ వంటి దర్శకులతో ఆయన ఎక్కువ పని చేశారు.

Also Readనిహారిక కొణిదెల కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - యూత్‌ను హైలైట్ చేస్తూ...

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by savitha Reddy (@savitha.radhakrishnan)

మణిరత్నం తీసిన 'బొంబాయి', శంకర్ 'జెంటిల్‌మన్‌', 'ఒకే ఒక్కడు', సూపర్ స్టార్ రజనీకాంత్ 'చంద్రముఖి' సినిమాల్లో శ్రీ రామకృష్ణ సంభాషణలకు మంచి పేరు వచ్చింది. ఆ దర్శకులు ఇద్దరూ చేసిన అన్ని చిత్రాలకూ ఆయనే మాటలు రాశారు. రజనీకి ప్రముఖ గాయకుడు, తెలుగులో ఆయన సినిమాలకు డబ్బింగ్ చెప్పే మనోను పరిచయం చేసింది శ్రీ రామకృష్ణే. రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన 'దర్బార్' ఆయన చివరి సినిమా. ఆయన మాటలు రాసిన లాస్ట్ సినిమా అదే.

రచయితే కాదు... దర్శకులు కూడా!
Two movies directed by writer Sree Ramakrishna: శ్రీ రామకృష్ణలో రచయిత మాత్రమే కాదు... ఓ దర్శకుడు ఉన్నారు. 'బాల మురళీ ఎంఏ', 'సమాజంలో స్త్రీ' చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. శ్రీ రామకృష్ణ మరణం పట్ల పలువురు చిత్రసీమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Nandamuri Mokshagna: మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Embed widget