అన్వేషించండి

Premalu Movie OTT Release: ప్రేమలు డిజిటల్ స్ట్రీమింగ్ - హాట్‌స్టార్‌లో కాదు, ఈ ఓటీటీలో మలయాళ బ్లాక్‌బస్టర్ తెలుగు వెర్షన్ రిలీజ్!

Premalu movie Telugu version OTT release: తెలుగులోనూ మలయాళ బ్లాక్ బస్టర్ 'ప్రేమలు' మంచి విజయం సాధించింది. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదల కానుంది? ఏ ఓటీటీలో విడుదల కానుంది? అంటే...

AHA OTT Platform bags Telugu digital streaming rights of Malayalam blocbuster Premalu: మలయాళ 'ప్రేమలు' (Premalu Movie OTT) తెలుగు ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకుంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ తెలుగులో విడుదల చేయడం, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి అగ్ర హీరోలు చిత్రాన్ని ప్రశంసించడంతో మంచి ప్రచారం లభించింది. భారీ విజయం సాధించింది. అయితే... ఈ సినిమా ఓటీటీ వేదికలో ఎప్పుడు విడుదల అవుతుంది? అని ఎదురు చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. వాళ్లకు గుడ్ న్యూస్.

ఆహా ఓటీటీలో 'ప్రేమలు' తెలుగు రిలీజ్!
Premalu Movie Telugu Release Date: 'ప్రేమలు' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ వేదిక సొంతం చేసుకుందని ప్రచారం జరుగుతోంది. అది కొంత వరకు నిజం! అసలు విషయం ఏమిటంటే... 'ప్రేమలు' తెలుగు వెర్షన్ ఓటీటీ / డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ 'ఆహా వీడియో' సొంతం చేసుకుంది. మలయాళ వెర్షన్ సహా తమిళ హక్కులు మాత్రమే డిస్నీ దగ్గర ఉన్నాయి.

'ఆహా'లో 'ప్రేమలు' డిజిటల్ రిలీజ్ ఎప్పుడంటే?
Premalu Telugu OTT Release Date: ఏప్రిల్ రెండో వారంలో 'ప్రేమలు' చిత్రాన్ని డిజిటల్ స్ట్రీమింగ్ చేయడానికి ఆహా వీడియో సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్ 12న 'ప్రేమలు' తెలుగు వెర్షన్ ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదీ సంగతి!

Also Readతండ్రినే మించిన తనయుడిగా ఎదిగిన రామ్ చరణ్ - ఆయన పడిన కష్టం ఎంత? అసలు అది ఎలా సాధ్యమైంది?

మలయాళంలో ఫిబ్రవరి 9న 'ప్రేమలు' విడుదలైంది. హైదరాబాద్ సిటీలోని కొన్ని థియేటర్లలో షోలు పడ్డాయి. మంచి టాక్ వచ్చింది. రాజమౌళి తనయుడు కార్తికేయ సినిమా చూశారు. ఆయనకు సినిమా విపరీతంగా నచ్చడంతో తెలుగులో డబ్బింగ్ చేశారు. మార్చి 8న తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ 15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగులో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన మలయాళ డబ్బింగ్ సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

Also Read: నిహారిక కొణిదెల కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - యూత్‌ను హైలైట్ చేస్తూ...

'ప్రేమలు'లో నస్లీన్ కె గఫూర్, మమతా బైజు (Mamitha Baiju) జంటగా నటించారు. గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు. మలయాళంలో భావన స్టూడియోస్‌ సంస్థతో కలిసి ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతతన్, శ్యామ్ పుష్కరణ్ వంటి వారు నిర్మాణంలో భాగం అయ్యారు. తమిళనాడులో ఈ సినిమా మార్చి 15 విడుదలై అక్కడ కూడా మంచి విజయం అందుకుంది. కిరణ్ జోసేతో కలిసి గిరీష్ ఏడీ స్క్రీన్ ప్లే అందించగా... విష్ణు విజయ్ సంగీతాన్ని సమకూర్చారు. అజ్మల్ సాబు సినిమాటోగ్రఫీ, ఆకాష్ జోసెఫ్ వర్గీస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. తెలుగులో 'నైన్‌టీస్' (90s) ఫేమ్ ఆదిత్య హాసన్ సంబాషణలు రాశారు. అల్తాఫ్ సలీం, శ్యామ్ మోహన్ .ఎం, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సంగీత్ ప్రతాప్, షమీర్ ఖాన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Embed widget