అన్వేషించండి

Niharika Konidela: నిహారిక కొణిదెల కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - యూత్‌ను హైలైట్ చేస్తూ...

Niharika Konidela New Movie: నిహారిక సమర్పణలో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ ఖరారు చేశారు. యువతను హైలైట్ చేసేలా ఆ టైటిల్ ఉంది. ఇంతకీ, అదేంటో తెలుసుకోండి!

యాక్ట్రెస్, మూవీ ప్రొడ్యూసర్ - ప్రజెంటర్, టాక్ షో హోస్ట్... మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela)ను ఏమని పరిచయం చేయాలి? ప్రతి పాత్రలో తన ప్రతిభను ఆవిడ నిరూపించుకున్నారు. నటిగా విభిన్నమైన పాత్రలు చేయడంతో పాటు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ స్టార్ట్ చేసి వెబ్ సిరీస్, సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు 'షెఫ్ మంత్ర' షోను హోస్ట్ చేస్తున్నారు. నటిగా, వ్యాఖ్యాతగా స్క్రీన్ మీద కనిపిస్తూ... స్క్రీన్ వెనుక నిర్మాతగానూ బిజీగా ఉన్నారు. కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు. నిహారిక నిర్మిస్తున్న కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ ఖరారు చేశారని సమాచారం. ఇంతకీ, అది ఏమిటో తెలుసుకోండి. 

నిహారిక కొణిదెల సమర్పించు 'కమిటీ కుర్రాళ్లు'
Committee Kurrallu Telugu Movie: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ సంస్థలు ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. నిహారిక తల్లి, మెగా బ్రదర్ నాగబాబు సతీమణి పద్మజా కొణిదెల, జయలక్ష్మి అడపాక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'కమిటీ కుర్రాళ్లు' టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది. ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారు. అది ఈ సినిమా కోసమే.

'కమిటీ కుర్రాళ్లు' టైటిల్ ఏప్రిల్ తొలి వారం లేదా రెండో వారంలో అనౌన్స్ చేసే ఆలోచనలో నిహారిక కొణిదెల అండ్ టీమ్ ఉన్నారు. ఈ సినిమా ద్వారా పదకొండు మంది హీరోలను, నలుగురు హీరోయిన్లను నిహారిక పరిచయం చేస్తున్నారు. వారిలో యూట్యూబ్ ఫిలిమ్స్, సిరీస్ చేసిన నటీనటులు ఉన్నారు.

Also Readపృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?

'పెళ్ళివారమండీ', 'మా విడాకులు', 'దిల్ పసంద్' వంటి యూట్యూబ్ సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా ఓ హీరోగా నటిస్తున్నారు. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముఖి నాగు మంత్రి ఇతర ప్రధాన తారాగణం. ఓ కాలనీలో పదకొండు మంది కుర్రాళ్లు కమిటీగా ఏర్పడి ఏం చేశారు? అనేది సినిమా కథగా తెలుస్తోంది.

Niharika Konidela: నిహారిక కొణిదెల కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - యూత్‌ను హైలైట్ చేస్తూ...

'హనుమాన్' అనుదీప్ సంగీతంలో 'కమిటీ కుర్రాళ్లు'
'కమిటీ కుర్రాళ్లు' చిత్రానికి యదు వంశీ దర్శకుడు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. గాయకుడిగా ఆయన పలు హిట్ సాంగ్స్ పాడారు. అయితే, ఆయనలో సంగీత దర్శకుడు సైతం ఉన్నాడని 'హనుమాన్'తో తెలిసింది. ఆ సినిమాలో 'సూపర్ హీరో హనుమాన్' సాంగ్ కంపోజ్ చేసింది ఆయనే. 'కమిటీ కుర్రాళ్లు'కు అనుదీప్ మ్యూజిక్ హైలైట్ కానుందని తెలిసింది.

Also Readపసుపు బదులు ముల్తానీ మట్టి - పెళ్లికి ముందు వేడుక వెరైటీగా ప్లాన్ చేసిన పవన్ కళ్యాణ్, రామ్ సినిమాల్లో హీరోయిన్

'కమిటీ కుర్రాళ్లు' చిత్రానికి కూర్పు: అన్వర్ అలీ, మాటలు: వెంకట సుభాస్ చీర్ల - కొండల రావు అడ్డగళ్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మన్యం రమేష్, ప్రొడక్షన్ డిజైనర్: ప్రణయ్ నైని,ఛాయాగ్రహణం: రాజు ఎడురోలు, సంగీతం: అనుదీప్ దేవ్, సమర్పణ: నిహారిక కొణిదెల, నిర్మాణ సంస్థలు: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ - శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, నిర్మాతలు: పద్మజా కొణిదెల - జయలక్ష్మి అడపాక, రచన - దర్శకత్వం: యదు వంశీ.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget