అన్వేషించండి

Poco M7 Pro 5G: పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!

Poco New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. అదే పోకో ఎం7 ప్రో 5జీ. దీని ధర రూ.14,999 నుంచి ప్రారంభం కానుంది.

Poco M7 Pro 5G Launched: పోకో ఎం7 ప్రో 5జీ మనదేశంలో లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌పై పోకో ఎం7 ప్రో 5జీ పని చేయనుంది. ఇందులో వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5110 ఎంఏహెచ్ కాగా, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది.

పోకో ఎం7 ప్రో 5జీ ధర (Poco M7 Pro 5G Price in India)
ఇందులో రెండు వేరియంట్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 8 జీబీ ర్యామ్ +256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా నిర్ణయించారు. లావెండర్ ఫ్రాస్ట్, లూనార్ డస్ట్, ఆలివర్ ట్విలైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ డిసెంబర్ 19వ తేదీ నుంచి జరగనుంది. దీనిపై పలు బ్యాంక్ ఆఫర్లు కూడా అందించనున్నారు. మార్కెట్లో ఎంతో పోటీ ఉన్న రూ.15 వేల విభాగంలో ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది.

Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!

పోకో ఎం7 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Poco M7 Pro 5G Specifications)
ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 2100 నిట్స్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ రోజు వారీ వినియోగానికి సరిపోయే టాస్క్‌లను రన్ చేయగలదు. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... పోకో ఎం7 ప్రో 5జీలో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు.వీటిలో 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్‌వైటీ 600 సెన్సార్ ప్రధాన కెమెరాగా ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. డాల్బీ అట్మాస్ అందుబాటులో ఉన్న స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

పోకో ఎం7 ప్రో 5జీ బ్యాటరీ సామర్థ్యం 5110 ఎంఏహెచ్‌గా ఉంది. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లోనాస్, 3.5 ఎంఎం ఆడియో జాక్ , యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా ఫోన్ అన్‌లాక్ చేయవచ్చు. ఐపీ64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కూడా పోకో ఎం7 ప్రో 5జీలో ఉంది. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది.

Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RS Praveen Kumar: తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Ration Card EKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
IRCTC Good News: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
Viral News:17 ఏళ్లుగా మహిళకు పొట్టనొప్పి- ఎక్స్‌రేతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భర్త
17 ఏళ్లుగా మహిళకు పొట్టనొప్పి- ఎక్స్‌రేతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భర్త
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Sixers vs RCB IPL 2025 | యధావిథిగా ధోనీ ఆడాడు..CSK ఓడింది | ABP DesamCSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP DesamMyanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP DesamKavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RS Praveen Kumar: తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ భవన్ పైనే రేవంత్ ఫోకస్, రీట్వీట్ చేసినా అక్రమ కేసులు పెడుతున్నారు- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Ration Card EKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్- ఈ-కేవైసీ గడువు పెంపు
IRCTC Good News: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్, కౌంటర్‌లో కొన్నా ఆన్‌లైన్‌లో క్యాన్సిల్‌ చేయవచ్చు
Viral News:17 ఏళ్లుగా మహిళకు పొట్టనొప్పి- ఎక్స్‌రేతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భర్త
17 ఏళ్లుగా మహిళకు పొట్టనొప్పి- ఎక్స్‌రేతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన భర్త
Malla Reddy: 'ఆ హీరోయిన్ కసికసిగా ఉంది' - నటిపై మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
'ఆ హీరోయిన్ కసికసిగా ఉంది' - నటిపై మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
TDP Foundation Day: తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
Vijay Varma: 'ఐస్‌క్రీమ్‌లా ఆస్వాదిస్తేనే సంతోషం' - తమన్నాతో బ్రేకప్ ప్రచారం వేళ రిలేషన్ షిప్‌పై విజయ్ వర్మ ఏమన్నారంటే?
'ఐస్‌క్రీమ్‌లా ఆస్వాదిస్తేనే సంతోషం' - తమన్నాతో బ్రేకప్ ప్రచారం వేళ రిలేషన్ షిప్‌పై విజయ్ వర్మ ఏమన్నారంటే?
Embed widget