అన్వేషించండి

Devara Davoodi Song: ట్రోలింగ్‌ను తట్టుకుని మరీ ట్రెండింగ్‌లోకి వచ్చిన దేవర సాంగ్... ఎన్టీఆర్ పవర్ అంటే ఇదీ

'దేవర' సినిమా నుంచి విడుదలైన 'దావూదీ...' సాంగ్ మీద సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ట్రోల్ చేస్తున్నారు. అయినప్పటికీ... ఈ సాంగ్ మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతోంది.

ఈ నెల 27న రిలీజ్ కాబోతున్న దేవర మూవీ ఎన్టీఆర్ కెరీర్ లోనే మోస్ట్ అవెయిటింగ్ మూవీగా బజ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. దేవర సినిమా నుంచి వచ్చిన పాటలు ఆల్రెడీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. లేటెస్ట్ సాంగ్ 'దావూదీ'ని కూడా కొంత మంది ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ స్టెప్స్ ని తమిళ్ హీరో విజయ్ సాంగ్ తో కంపేర్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. 

'దేవర' నుంచి ఇప్పటి వరకు మూడు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. 'ఫియర్' లిరికల్ సాంగ్ లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ హైలైట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన 'చుట్టమల్లే' సాంగ్ అన్ని వర్గాలను ఆకట్టుకుంది. అందులో ఎన్టీఆర్ డ్యాన్స్ మూమెంట్స్, డ్రెస్సింగ్ స్టైల్ భలే ఉందంటూ కామెంట్లు పెట్టారు అభిమానులు. నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసే ట్రోలర్లు ఉండనే ఉంటారు కదా. వారు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. అయితే యునానిమస్ గా ఈ సాంగ్ మాత్రం చార్ట్ బస్టర్ గా మారింది. ఆడియో సాంగ్స్ యాప్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇక మూడో సాంగ్ గా వచ్చిన దావూదీ విషయంలో డివైడ్ టాక్ వినపడుతోంది. సెకండ్ సాంగ్ చుట్టమల్లే అందరికీ నచ్చగా, థర్డ్ సాంగ్ దావూదీ మాత్రం కొందరికే బాగా నచ్చింది. లిరిక్స్ విషయంలో కూడా కొంతమంది అభిమానులు డిజప్పాయింట్ అయినట్టున్నారు. అయితే ఎన్టీఆర్ స్టెప్స్ విషయంలో మాత్రం నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. స్టెప్స్ బాగున్నాయి అనుకునేలోపే... ట్రోలర్లు రెడీ అయ్యారు. 'అరబిక్ కుతు' సాంగ్ లో హీరో విజయ్ వేసిన స్టెప్స్ తో కంపేర్ చేస్తూ కామెంట్లు పెట్టారు. ఆ రెండు పాటల్ని పక్క పక్కన పెట్టి మరీ కంపేరీజన్ మొదలు పెట్టారు. 

విచిత్రం ఏంటంటే.. ఆ రెండు పాటలకు డ్యాన్స్ మాస్టర్స్ టాలీవుడ్ వారే. విజయ్ సాంగ్ 'అరబిక్ కుతు హల్మత్తి అబీబో' పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ కాగా, దేవరలోని దావూదీ పాటకు శేఖర్ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేశారు. అయితే శేఖర్ మాస్టర్ స్టెప్స్ కాపీ కొట్టారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎలాంటి క్లిష్టమైన సీక్వెన్స్ ఇచ్చినా అవలీలగా చేసుకెళ్తారు ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ ని చేతిలో పెట్టుకుని విజయ్ సినిమాలోని పాటని కాపీకొట్టడమేంటని అంటున్నారు. ఆ రెండు పాటల్ని పక్క పక్కనపెట్టి స్టెప్స్ కంపేర్ చేస్తున్నారు. 

ఏమాటకామాటే చెప్పుకోవాలి. విజయ్ స్టైల్ వేరు, ఎన్టీఆర్ స్టైల్ వేరు. ఆ పాటలో విజయ్ తన అభిమానుల్ని అలరిస్తే, ఈ పాటలో ఎన్టీఆర్ టోటల్ గా తెలుగు మాస్ ఆడియన్స్ అందర్నీ ఉర్రూతలూగించేలా ఉన్నారు. అయితే స్టెప్స్ రిపీట్ కావడమే అభిమానులకు కాస్త ఇబ్బందిగా మారింది. మరోవైపు పాట సాహిత్యం కూడా చుట్టమల్లేలా సింపుల్ గా ఎక్కేయడం లేదు. దీంతో దావూదీ పాట టాక్ ఆఫ్ సోషల్ మీడియాగా మారింది. 

Also Readతమ్ముడికి తారక్ వెల్కమ్... బాబాయ్ బాలకృష్ణతో గొడవలు అంటూ వచ్చే పుకార్లకు చెక్!

ఇక సినిమా విషయానికొస్తే... కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుంటోంది. ఈనెల 27న సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదలవుతుంది. కొరటాల మార్క్ ఇందులో కనపడుతుందని, పక్కా మాస్ ఎంటర్టైనర్ తో పాటు ఓ చిన్న మెసేజ్ కూడా ఇస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమాకి జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్ కాబోతోంది. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ - శ్రీదేవి హిట్ పెయిర్ ఎలాగో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ - జాన్వీ కపూర్ పెయిర్ అలాగే అభిమానుల్ని ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఈ సినిమాపై అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి. 

Also Readవిజయ్ 'ది గోట్'కి సీక్వెల్... పవన్ కల్యాణ్ టైటిల్ మీద కన్నేసిన దళపతి

టాప్ హెడ్ లైన్స్

Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget