Goat Vs OG: విజయ్ 'ది గోట్'కి సీక్వెల్... పవన్ కల్యాణ్ టైటిల్ మీద కన్నేసిన దళపతి
Vijay Goat Movie Sequel: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా టైటిల్ మీద కోలీవుడ్ స్టార్ విజయ్ కన్నేశారు. ఈ రోజు విడుదలైన 'ది గోట్'కి సీక్వెల్ అనౌన్స్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), కోలీవుడ్ స్టార్ విజయ్ (Thalapathy Vijay) మధ్య మంచి అనుబంధం ఉంది. తెలుగులో పవన్ చేసిన సినిమాలను తమిళంలో విజయ్, తమిళంలో విజయ్ చేసిన సినిమాలను తెలుగులో పవన్ రీమేక్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే... ఇప్పుడు పవన్ టైటిల్ మీద విజయ్ కన్నేయడం విశేషం. పూర్తి వివరాల్లోకి వెళితే...
'ది గోట్'కి సీక్వెల్... అదీ పవన్ టైటిల్ గుర్తొచ్చేలా!
Vijay Goat Movie Sequel: దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన 'ది గోట్' సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. సినిమా చివర్లో సీక్వెల్ అనౌన్స్ చేశారు. ది గోట్... 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' సినిమాకు 'ఏ వెంకట్ ప్రభు హీరో' అని క్యాప్షన్ ఇచ్చారు దర్శకుడు. మరి, సీక్వెల్ టైటిల్ ఏంటో తెలుసా? 'గోట్ వర్సెస్ ఓజీ'. 'ఏ వెంకట్ ప్రభు విలన్' అని దీనికి క్యాప్షన్ ఇచ్చారు.
ఓజీ అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది పవన్ కల్యాణ్ హీరోగా 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అంటే ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు పవన్ కల్యాణే. ఇప్పుడు విజయ్ ఆ టైటిల్ తన కొత్త సినిమాకు వాడుతున్నారు. డైరెక్టుగా ఓజీ అనడం లేదు. 'గోట్ వర్సెస్ ఓజీ' అని చెబుతున్నారు. దీని మీద పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read: విజయ్ 'గోట్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ - గాంధీ జయంతికి డిజిటల్ రిలీజ్!?
'ది గోట్' రివ్యూ & రేటింగ్...
— ABP Desam (@ABPDesam) September 5, 2024
విజయ్ సినిమా హిట్టా? ఫట్టా?#TheGreatestOfAllTime #ThalapathyVijay #MovieReview #TheGoat #GOAT #TheGoatReview #Sivakarthikeyan #MeenakshiChaudhary #Sneha #VenkatPrabhu @actorvijay @vp_offlhttps://t.co/YLKVXPpaWu
'ది గోట్' సినిమాలో తండ్రి కొడుకులుగా విజయ్ కనిపించారు. తండ్రి హీరో అయితే కొడుకు విలన్ రోల్ చేశారు. అయితే... 'ది గోట్'లో చూసిన విజయ్ విలనిజం శాంపిల్ మాత్రమే అని, 'గోట్ వర్సెస్ ఓజీ'లో అసలు సిసలైన విలనిజం చూపిస్తామని అన్నట్టు ఎండింగ్ విజువల్స్ చూపించారు.
సీక్వెల్ చేసే ఆలోచనలో విజయ్ ఉన్నారా?
విజయ్ రాజకీయాల్లో అడుగు పెట్టారు. తమిళనాట రాజకీయ పార్టీ స్థాపించి, ఆ పేరు మీద ముమ్మరంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సినిమాలకు సమయం కేటాయించే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అసలు 'ది గోట్' విజయ్ లాస్ట్ సినిమా అని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే... దీని తర్వాత మరొక సినిమా చేసే ఛాన్స్ ఉందని టాక్. మరి, ఈ సీక్వెల్ నిజంగా చేస్తారా? లేదా? అనేది చూడాలి. విజయ్ హీరోగా డీవీవీ దానయ్య ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు జరిగాయి. ఆ తర్వాత ఆ సినిమా పక్కకి వెళ్లింది.