Avika Gor: రైటర్‌గా మారిన చిన్నారి పెళ్లికూతురు... అవికా గోర్ ఫస్ట్ బుక్ రేటు ఎంతో తెలుసా?
Avika Gor First Book: 'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్‌తో పాపులరై... ఆ తర్వాత కథానాయికగా, నిర్మాతగా మారిన అవికా గోర్... ఇప్పుడు రైటర్ అయ్యారు. ఆమె ఒక బుక్ రాశారు.

బాలనటి... నటి... కథానాయిక... నిర్మాత... వ్యాపారవేత్త... అవికా గోర్ గురించి ఏమని చెప్పాలి? ఆమెకు ఎన్ని రంగాల్లో ప్రావీణ్యం ఉందని చెప్పాలి? చిన్న వయసులో ఎంతో పేరు తెచ్చుకున్న మహిళ అవికా గోర్. 'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్‌తో ఆమెకు మొదట పాపులారిటీ వచ్చింది. అక్కడ నుంచి కథానాయికగా, నిర్మాతగా మారింది. ఇప్పుడు అవికా గోర్ రచయిత్రి అయ్యింది.
ట్రస్ట్ ఫాల్... అవికా రాసిన పుస్తకం!
Avika Gor Turns Writer With Trust Fall Book: ''నేను రచయిత్రిని అయ్యాను. నా తొలి పుస్తకం 'ట్రస్ట్ ఫాల్' పబ్లిష్ అయ్యింది. మరొక కల నెరవేరింది'' అని సోషల్ మీడియాలో అవికా గోర్ పోస్ట్ చేశారు. తన పుస్తకంతో దిగిన ఫోటోలను షేర్ చేశారు.
అవికా గోర్ రాసిన తొలి పుస్తకం అమెజాన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఆ బుక్ రేటు 299 రూపాయలు. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ నవల అని చెప్పవచ్చు. ప్రేమ, నమ్మకం, మోసం వంటి అంశాలతో అవికా గోర్ రాశారట. మరి పాఠకుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.
Also Read: వారెవ్వా నవీన్ చంద్ర... విలనిజం ఇరగదీశాడుగా - లుక్ నుంచి యాక్టింగ్ వరకూ... రవితేజకు ధీటుగా!
View this post on Instagram
అవికాకు 2025 చాలా మెమరబుల్!
అవికాకు ఈ ఏడాది 2025 చాలా మెమరబుల్ అని చెప్పాలి. ఎందుకంటే... బాల నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆ అమ్మాయి, హిందీ నుంచి తెలుగుకు వచ్చి ఇక్కడ కథానాయికగా సినిమాలు చేసింది. అయితే... ఈ ఏడాది అవికా గోర్ వ్యక్తిగత జీవితంలో మరో అడుగు వేసింది. సెప్టెంబర్ 30న మిళింద్ చంద్వాణీతో ఏడు అడుగులు వేసింది. పెళ్లి, రచయిత్రిగా పుస్తకం... మొత్తం మీద 2025లో అవికా గోర్ జీవితంలో కొత్త కొత్త అడుగులు పడ్డాయి. సినిమాలకు వస్తే... ఆది సాయికుమార్ 'షణ్ముఖ'లో ఈ ఏడాది కనిపించింది. ఆ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర అంతంత మాత్రం ఆదరణ లభించింది. ప్రస్తుతం ఆవిడ చేతిలో మరో రెండు మూడు సినిమాలు ఉన్నాయ్.
Also Read: ఎవరీ నిరంజన్ రెడ్డి? 'మనీ' అసిస్టెంట్ to 'ఆచార్య' నిర్మాత, రాజ్యసభ ఎంపీ వరకు... ఊహకు అందని ఎదుగుదల





















