Ajith Kumar: తిరుమలలో అభిమానులకు అజిత్ వార్నింగ్... ఎందుకో తెలుసా?
Ajith Tirumala Darshan: తిరుమల వెంకటేశ్వర స్వామిని తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ దర్శించుకున్నారు. ఏడు కొండలపై అభిమానులకు ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు. అది ఎందుకో తెలుసా?

తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ (Ajith Kumar)కు భక్తి ఎక్కువ. తరచూ కుటుంబంతో కలిసి గుళ్ళు గోపురాలకు వెళతారు. పూజలు చేస్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామి (Tirumala Tirupati Venkateswara Swamy)ని ఈ రోజు (అక్టోబర్ 28, మంగళవారం) ఉదయం సుప్రభాత సేవలో అజిత్ దర్శించుకున్నారు. ఈ తరుణంలో కొండ మీద అభిమానులకు ఆయన స్వీట్ వార్నింగ్ ఇవ్వడం డిస్కషన్ పాయింట్ అయ్యింది. అసలు ఏమైంది? అభిమానుల వైపు అజిత్ ఎందుకు వేలు చూపించారు?
గుడిలో నినాదాలు వద్దు... అందుకే వేలు!
అభిమానులు, తమిళ ప్రేక్షకులు అజిత్ కుమార్‌ను ముద్దుగా 'తల' అని పిలుస్తారు. తల అంటే నాయకుడు అని అర్థం. ఏడు కొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అజిత్ కనిపించగానే 'తల... తల...' అంటూ అరవడం మొదలు పెట్టారు కొందరు అభిమానులు. తమ హీరో దృష్టిలో పడేందుకు తాపత్రయపడ్డారు. అయితే గుడిలో ఆ విధంగా చేయడం సరి కాదని, అటువంటి వద్దని సింపుల్‌గా సైగ చేశారు అజిత్. అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ వేలు చూపిస్తూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అదీ సంగతి.
Also Read: వారెవ్వా నవీన్ చంద్ర... విలనిజం ఇరగదీశాడుగా - లుక్ నుంచి యాక్టింగ్ వరకూ... రవితేజకు ధీటుగా!
ఇటీవల భార్య షాలిని, కుమారుడు అద్విక్‌తో కలిసి కేరళలోని పాలక్కాడ్ ఏరియాలో గల ఓ గుడికి అజిత్ కుమార్ వెళ్లారు. అక్కడ ఆయన గుండెలపై టాటూ వైరల్ అయ్యింది కూడా!
Also Read: ఎవరీ నిరంజన్ రెడ్డి? 'మనీ' అసిస్టెంట్ to 'ఆచార్య' నిర్మాత, రాజ్యసభ ఎంపీ వరకు... ఊహకు అందని ఎదుగుదల
Ajith Kumar with his family during their divine family deity worship 🙏❤️ A moment of faith, love, and togetherness. #AjithKumar #FamilyTime #DivineMoments #shaliniajith #AK @SureshChandraa @DoneChannel1 pic.twitter.com/TV6cELgmvr
— Done Channel (@DoneChannel1) October 24, 2025
'గుడ్ బ్యాడ్ అగ్లీ' దర్శకుడితో మళ్ళీ!
'గుడ్ బ్యాడ్ అగ్లీ'తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చారు అజిత్. ఆ సినిమాకు ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు మరోసారి అతనికి అవకాశం ఇచ్చారు అజిత్. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో సెట్స్ మీదకు తీసుకు వెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రేసింగ్ కోసం మధ్యలో సినిమాలకు కొంత విరామం ఇచ్చారు అజిత్.





















