By: ABP Desam | Updated at : 14 Dec 2021 06:10 PM (IST)
'సన్నీ.. మీ సమయమొచ్చేసింది..' కప్పు కొట్టేసినట్లేనా..
బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా సన్నీ ఇప్పుడు ఫైనల్స్ కి చేరుకున్నాడు. హౌస్ లో కామెడీ చేస్తూ.. అందరినీ నవ్విస్తూ బెస్ట్ ఎంటర్టైనర్ గా నిలిచాడు. గేమ్ లో సన్నీ అగ్రెసివ్ గా ఆడుతున్న తీరు సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగింది. చాలా వారాలుగా సన్నీ నామినేట్ అవుతూ వచ్చాడు. కానీ ప్రతీసారి ప్రేక్షకులు అతడిని సేవ్ చేస్తూనే వచ్చారు. హౌస్ లో తన ట్రూ ఎమోషన్స్ చూపిస్తూ.. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయాడు సన్నీ.
ఈ వారంతో బిగ్ బాస్ షో పూర్తి కాబోతుంది. దీంతో టాప్ 5 కంటెస్టెంట్స్ జర్నీను వాళ్లకు చూపించాలని నిర్ణయించుకున్నారు బిగ్ బాస్. ఇప్పటికే శ్రీరామ్, మానస్ ల జర్నీ చూపించగా.. ఈరోజు ఎపిసోడ్ లో సన్నీ జర్నీను చూపించబోతున్నారు. హౌస్ లో సన్నీ మెమొరీస్ కి సంబంధించిన ఫొటోలన్నీ వేర్వేరు ప్లేసెస్ లో ఎరేంజ్ చేశారు బిగ్ బాస్. కొన్ని ఫొటోలు ఫన్నీగా ఉండడంతో సన్నీ నవ్వుకున్నాడు.
అలానే ఓ చోట కేక్ ముక్కను కూడా ఉంచారు బిగ్ బాస్. దాన్ని తీసుకొని స్మెల్ చూసిన సన్నీ.. 'వెయిట్ ఫర్ ది క్లైమాక్స్' అని డైలాగ్ కొట్టాడు. ఆ తరువాత చెట్టుకి వేలాడుతూ ఉన్న కోతి బొమ్మను చూస్తూ.. 'ఓ కాజల్ ఎట్లున్నావ్.. బాగున్నావా..?' అని ఫన్ చేశాడు. ఆ తరువాత తన తల్లితో ఉన్న ఫొటోను తీసుకొని ముద్దాడుతూ.. 'కళావతి టాప్ 5 లో ఉన్నా.. జస్ట్ ఒక్క అడుగు' అని అన్నాడు.
ఆ తరువాత బిగ్ బాస్ సన్నీను పొగుడుతూ.. 'సరదా.. సన్నీ రెండూ ఒకే అక్షరంతో మొదలవుతాయని మీరు గుర్తుచేశారు. గెలిచిన ఆటలు, జరిగిన గొడవలు, మోసిన నిందలు, చేసిన వినోదం.. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా.. అందరి మొహంపై నవ్వు తీసుకొచ్చి ఎంటర్టైనర్ గా అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఒంటరిగా వచ్చే మనిషికి కొంచెం ప్రేమను సంపాదించుకోవడం కన్నా.. పెద్ద విజయం ఏదీ లేదని మీరు సాధించిన ప్రయాణమే మళ్లీ రుజువు చేస్తోంది. అపనా టైం ఆయేగా.. సన్నీ.. మీ సమయమొచ్చేసింది' అంటూ ఓ రేంజ్ లో ఎలివేట్ చేశారు. ఈ ప్రోమో చూసిన అభిమానులు కప్పు సన్నీకే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Time to recall #Sunny superb memories #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun #BiggBossTelugu pic.twitter.com/dqE1HSImSu
— starmaa (@StarMaa) December 14, 2021
Also Read:'పుష్ప' ఐటెం సాంగ్.. సమంత ఎంత తీసుకుందంటే..
Also Read: గ్రాండ్ ఫినాలేలో బాలీవుడ్ స్టార్స్.. ఎవరెవరంటే..?
Also Read: హీరో ఉన్నాడు 'బిగ్ బాస్'లో... అతడి సినిమా డబ్బింగ్ అవుతోంది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో
Also Read: కొత్త నేలపై 'సంచారి'... 'రాధే శ్యామ్' సినిమాలో కొత్త సాంగ్ టీజర్ వచ్చింది
Also Read: ఇమ్మూ-వర్ష జోడీ వచ్చాక... సుధీర్-రష్మీ జోడీకి క్రేజ్ తగ్గిందా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Bigg Boss 7 Telugu: SPY vs SPA - నువ్వేమైనా ఒలింపిక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చావా? శోభా నామినేషన్‌కు శివాజీ కౌంటర్
Goutham: బయటికి వెళ్లిన తర్వాత ముందుగా శుభశ్రీతో మాట్లాడతా - ఆసక్తికర విషయాలు బయటపెట్టిన గౌతమ్
Bigg Boss 7 Telugu: అర్జున్ ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ.. అంటూ కంటెస్టెంట్‌కు షాకిచ్చిన నాగార్జున
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌కు క్యాష్ ప్రైజ్ ఎంతో రివీల్ చేసిన నాగార్జున, డబ్బులతో పాటు అవన్నీ కూడా!
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్‌పై ‘నా సామిరంగ’ హీరోయిన్ - ఇంప్రెస్ చేసి ఫ్లయింగ్ కిస్ కొట్టేసిన అమర్
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు - తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు.?
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్జాం - తీరం దాటేది ఏపీలోనే!
Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
/body>