Bigg Boss 5 Telugu: నామినేషన్ హీట్.. షణ్ముఖ్ పై ప్రియాంక ఫైర్..
ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. అందులో షణ్ముఖ్ పై ప్రియాంక ఫైర్ అయింది.
ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. 'ఇంటి సభ్యులందరూ.. ఎటువంటి ముసుగు లేకుండా నామినేట్ చేసే రోజు ఆసన్నమైంది అంటూ బిగ్ బాస్ చెప్పారు. 'మీ ఇంటి పేరు పొగరా..? మీ ఇంటి పేరు పొగరుబోతా..?' అంటూ వెటకారంగా కాజల్ ని విమర్శిస్తూ కనిపించాడు శ్రీరామచంద్ర. 'నువ్ నాకు ఇచ్చిన ఆ రియాక్షన్ నచ్చలేదు' అంటూ కాజల్.. శ్రీరామ్ ని నామినేట్ చేసింది. ఆ తరువాత ప్రియాంక.. 'ఆలోచించే విధానానికొస్తే రవి అన్నయ్య కంటే ఎవరూ బాగా ఆలోచించలేరు' అంటూ అతడి నామినేట్ చేస్తూ రీజన్ చెప్పగా.. 'నేను బాగా ఆలోచిస్తానని.. ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నావ్..?' అంటూ రవి ప్రశ్నించాడు.
Also Read: రీషూట్ మోడ్ లో పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'
దానికి ప్రియాంక 'అంతే అన్నయ్య' అంటూ బదులిచ్చింది. 'ఫైనల్ లో నువ్ నేను ఉన్నప్పుడు నువ్ కచ్చితంగా గెలవలేవని నీకు తెలుసు..?' అని రవి అనగా.. 'అది నాకు తెలుసు కాబట్టే నేను నామినేట్ చేస్తున్నా' అంటూ బదులిచ్చింది. ఆ తరువాత విశ్వ.. 'ఇంట్లో వీక్ ఉన్న వాళ్లకు కూడా అర్హత లేదు..?' ప్రియాంకను ఉద్దేశిస్తూ కామెంట్ చేశాడు. 'అర్హత లేదు అని అనలేదు.. యు డోంట్ టెల్ మీ దట్ ఓకే' అంటూ బదులిచ్చింది.
ఆ తరువాత కాజల్ 'నిన్ను ఎదగకుండా ఆపడానికి నేనైతే ట్రై చెయ్యట్లేదు.. అండ్ నిన్ను ఎదగనివ్వకుండా హౌస్ లో ఎవరూ ట్రై చేయలేరు రవి' అని చెప్పింది. 'వేరే వాళ్ల గురించి నువ్ ఎందుకు మాట్లాడుతున్నావ్' అంటూ రవి కామెంట్ చేశాడు. ఇక షణ్ముఖ్.. ప్రియాంకను నామినేట్ చేస్తూ.. 'ప్రియాంక నీ గేమ్ నువ్ ఆడు.. ఇక వేరే గేమ్ నువ్ ఆడొద్దు' అనగా.. 'మీరు అలా అనేసి నామినేట్ చేసిన బయటకు పంపించేస్తే ఇంకెవరు ఆడతారు నా గేమ్' అని ప్రశ్నించింది. దానికి షణ్ముఖ్ 'ఇది నా రీజన్' అని చెప్పాడు. 'మీరే ఆడండి వెళ్లిన తరువాత' అంటూ సీరియస్ అయింది.
Mask tesesi nominate chesthe ila untundi #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFire & #FiveMuchFun pic.twitter.com/A4XHA2sYMV
— starmaa (@StarMaa) November 1, 2021
Also Read: 'పాండవులు కోరుకుంది కౌరవుల చావు కాదు.. ఓటమి' రాజా విక్రమార్క ట్రైలర్..
Also Read: మలయాళ 'బాహుబలి'ని ఓటీటీకి ఇచ్చేశారుగా..
Also Read:కాజల్ మేడమ్... ఇద్దరూ కలిసి తాగుతున్నారా!? తాగి తాగి సచ్చిపోండి!
Also Read: ఆర్ఆర్ఆర్... బ్రదర్ & బావా... 45 సెకన్లలో ఎలా?
Also Read: 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్లో ఇవి గమనించారా!?Also Read: ఆ పద్దెనిమిది వందల మందిని నేను చదివిస్తా.. పునీత్ కి మాటిచ్చిన విశాల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి