News
News
X

Raja Vikramarka Trailer : 'పాండవులు కోరుకుంది కౌరవుల చావు కాదు.. ఓటమి' రాజా విక్రమార్క ట్రైలర్..

హీరో కార్తికేయ నటించిన 'రాజా విక్రమార్క' సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.

FOLLOW US: 

'ఆర్ఎక్స్100' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు కార్తికేయ. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తరువాత మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయారు. కానీ సరికొత్త కథలను ఎన్నుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'రాజా విక్రమార్క'. ఈ సినిమాతో శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రశాంత్ విహారి ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. 

Also Read: మలయాళ 'బాహుబలి'ని ఓటీటీకి ఇచ్చేశారుగా..

ట్రైలర్ లో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో హీరో కనిపించాడు. హోమ్ మినిష్టర్ కి థ్రెట్ ఉండడంతో.. హీరోని ఎరగా వేస్తారు. అలా సాయం చేయడానికి వెళ్లిన హీరో.. హోమ్ మినిష్టర్ కూతురితో ప్రేమలో పడతాడు. ఆ తరువాత జైల్లో ఉన్న తమిళ నటుడు పశుపతిని చూపిస్తూ.. సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశారు. 'పన్నెండేళ్ల అరణ్యవాసం.. ఏడాది అజ్ఞాతవాసం చేశాక.. పాండవులు కోరుకుంది కౌరవుల చావు కాదు.. ఓటమి' అంటూ ఆయన చెప్పే డైలాగ్ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. ఆ తరువాత హీరో సీరియస్ మోడ్ లో కనిపించాడు. జైల్లో కూడా ఉన్నట్లు చూపించారు. 

కొన్ని సీరియస్ సన్నివేశాలను చూపించిన తరువాత హీరో ఒక వ్యక్తి గొంతులో గన్ పెట్టి.. 'ఇప్పుడు నాకు తెలియాల్సింది ఒక్కటే.. ట్రిగ్గర్ నొక్కనా..? వొద్దా..?' అని చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. చివరిగా గ్రనేడ్, గన్స్ ను చెక్ చేస్తూ.. 'దివాలి గ్రాండ్ గానే ప్లాన్ చేశావ్' అంటూ మరో డైలాగ్ చెప్తాడు హీరో. ఇక ట్రైలర్ లో తనికెళ్ల భరణి క్యారెక్టర్ హైలైట్ గా నిలిచింది. సుధాకర్ కొమ్మాకుల మరో ముఖ్య పాత్రలో కనిపించారు. తాన్య రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను నవంబర్ 12న విడుదల చేయబోతున్నారు. 

Published at : 01 Nov 2021 04:54 PM (IST) Tags: Raja Vikramarka Trailer Raja Vikramarka movie sri siripalli prashanth vihari tanya ravichandran

సంబంధిత కథనాలు

Ponniyin Selvan Twitter Review : 'పొన్నియిన్ సెల్వన్' నిజంగా కోలీవుడ్ 'బాహుబలి', 'కెజియఫ్' అవుతుందా? ఆడియన్స్ ఏమంటున్నారంటే

Ponniyin Selvan Twitter Review : 'పొన్నియిన్ సెల్వన్' నిజంగా కోలీవుడ్ 'బాహుబలి', 'కెజియఫ్' అవుతుందా? ఆడియన్స్ ఏమంటున్నారంటే

Ram Charan: శంకర్ డబుల్ గేమ్ - చరణ్ ఎఫెక్ట్ అవుతున్నారా?

Ram Charan: శంకర్ డబుల్ గేమ్ - చరణ్ ఎఫెక్ట్ అవుతున్నారా?

Shaakuntalam: త్రీడీలో 'శాకుంతలం' సినిమా - వాయిదా వేయక తప్పదట!

Shaakuntalam: త్రీడీలో 'శాకుంతలం' సినిమా - వాయిదా వేయక తప్పదట!

Prabhas: కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌ - భోజనాల కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభాస్!

Prabhas: కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌ - భోజనాల కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభాస్!

Urvasivo Rakshasivo Teaser: లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ - 'ఊర్వశివో రాక్షసివో' టీజర్!

Urvasivo Rakshasivo Teaser: లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ - 'ఊర్వశివో రాక్షసివో' టీజర్!

టాప్ స్టోరీస్

YS Sharmila : వైఎస్ఆర్ బతికుంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila : వైఎస్ఆర్ బతికుంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

Botsa Reaction On Harish : పక్కపక్కన పెట్టి చూస్తే తేడా తెలుస్తుంది - హరీష్‌రావుకు బొత్స కౌంటర్ !

Botsa Reaction On Harish : పక్కపక్కన పెట్టి చూస్తే తేడా తెలుస్తుంది - హరీష్‌రావుకు బొత్స కౌంటర్ !

WhatsApp Updates: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, అందుబాటులోకి ఐదు ఫీచర్లు!

WhatsApp Updates: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, అందుబాటులోకి  ఐదు ఫీచర్లు!

KCR Temple Visits : జాతీయ పార్టీ ప్రకటనకు కేసీఆర్ సన్నాహాలు - సెంటిమెంట్ ఆలయాల వరుస సందర్శనలు !

KCR Temple Visits :  జాతీయ పార్టీ ప్రకటనకు కేసీఆర్ సన్నాహాలు - సెంటిమెంట్ ఆలయాల వరుస సందర్శనలు !