Former Miss Kerala: కారు యాక్సిడెంట్ లో మృతి చెందిన మాజీ మిస్ కేరళ, రన్నరప్..
మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్(25), రన్నరప్ అంజనా షాజన్(26) కారు ప్రమాదంలో మృతి చెందారు.
మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్(25), రన్నరప్ అంజనా షాజన్(26) ప్రమాదంలో మృతి చెందారు. ఎర్నాకులం బైపాస్ లోని హాలిడే ఇన్ ముందు సోమవారం అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అటుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అన్సీ కబీర్, అంజనా అక్కడికక్కడే కన్నుమూశారు. వీరితో పాటు కారులో మరో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వారిలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కానీ ఈ అందగెత్తులు ఇద్దరూ మాత్రం అందానిలోకాలకు వెళ్లిపోయారు.
Also Read: 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌లో ఇవి గమనించారా!?
ఈ ప్రయాణానికి ముందే అన్సీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో 'ఇట్స్ టైమ్ టు గో' అంటూ ఓ వీడియోనుషేర్ చేసింది. ఆమె ఈ పోస్ట్ పెట్టిన కాసేపటికే ప్రమాదం చోటుచేసుకుంది. మిస్ కేరళ 2019 కాంపిటీషన్ జరిగినప్పటి నుంచి అన్సీ, అంజనా మంచి స్నేహితులయ్యారు. ఈ పోటీలో అన్సీ విజేతగా నిలవగా.. అంజనా రన్నరప్ గా నిలిచింది.
అప్పటినుంచి ఇద్దరూ కలిసి ట్రిప్ లకు వెళ్తూ.. సరదాగా కలిసి ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఇద్దరూ స్పాట్ లోనే చనిపోయారు. ఈ యాక్సిడెంట్ పై స్పందించిన పోలీసులు.. స్పీడ్ గా వెళ్తున్న వీరి వాహనానికి బైక్ అడ్డంగా రావడంతో డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కంట్రోల్ చేయలేకపోయాడని.. అందుకే యాక్సిడెంట్ జరిగిందని వివరించారు.
View this post on Instagram
Also Read: నరాలు తెగే ఉత్కంఠ.. చూపు తిప్పుకోలేని విజువల్ వండర్
Also Read: ఆ పద్దెనిమిది వందల మందిని నేను చదివిస్తా.. పునీత్ కి మాటిచ్చిన విశాల్