By: ABP Desam | Updated at : 31 Oct 2021 10:47 PM (IST)
పునీత్ కి మాటిచ్చిన విశాల్
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సెలబ్రిటీలు సైతం పునీత్ కోసం రోదిస్తున్నారు. 'అప్పు' అన్న తిరిగొచ్చెయ్ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. మంచి నటుడిగానే కాకుండా.. మంచి మనిషిగా ఎందరో అభిమానాన్ని సొంతం చేసుకున్నారు పునీత్.
తన కెరీర్ లో నలభైకి పైగా ఫ్రీ స్కూల్స్ ని, అనాధశరణాలయాలను, వృద్ధాశ్రమాలు నడిపించడంతో పాటు 1800 మంది స్టూడెంట్స్ కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నారు. అయితే ఇకపై ఆ 1800 మంది పిల్లల బాధత్య తను తీసుకుంటానని హీరో విశాల్ చెప్పారు.
విశాల్-ఆర్య హీరోలుగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఎనిమీ'. ఈ సినిమా దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించిన విశాల్.. పునీత్ రాజ్ కుమార్ కి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ''ఇవాళ ఈవెంట్ పెట్టుకోవాలా..? వద్దా..? అని లాస్ట్ మినిట్ వరకు గిల్టీ కాన్షియస్ ఉంది. ఎందుకంటే ఒక మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి మిత్రుడు.. మంచి మనిషి.. మన మధ్య ఇవాళ లేడు అనే విషయాన్ని నమ్మలేకపోతున్నా.. 'పునీత్ రాజ్ కుమార్ ఈజ్ నో మోర్' అని చదివేప్పుడు, వినేప్పుడు జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన మరణం సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాదు.. ఆయన ఫ్యామిలీకి, సమాజానికి కూడా తీరని లోటు. పునీత్ లాంటి డౌన్ టు ఎర్త్ మనిషిని సినిమా ఇండస్ట్రీలో నేను చూడలేదు. ఆయన్ను ఇంట్లో కలిసినా.. బయట కలిసినా ఒకేలా ఉంటాడు. మేకప్ వేసుకున్నా.. సరే వేసుకోకపోయినా సరే.. ఒకేలా ఉండే మనిషి పునీత్. నేను కలిసిన అద్భుతమైన వ్యక్తుల్లో ఆయనొకరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఇలాంటి సమయంలో ఆయన కుటుంబం స్ట్రాంగ్ గా ఉండాలి. గవర్మెంట్ చేసే పని ఆయన ఒక్కరే చేశారు. ఒక్క మనిషి 1800 మంది స్టూడెంట్స్ కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించారు. దాంతో పాటు వృద్ధాశ్రమాలు, అనాధశరణాలయాలు రన్ చేశారు. చనిపోయినప్పుడు కూడా ఆయన కళ్లను దానం చేశారు. విలక్షణ నటుడిని కోల్పోయాం'' అని అన్నారు.
ఆ తరువాత చనిపోయిన పునీత్ కి మాటిస్తూ.. ''నీ మిత్రుడిగా.. నేను వీలైనంత వరకు నువ్ చేసిన సర్వీస్ ను కంటిన్యూ అయ్యేలా చూసుకుంటాను. ఆ 1800 మంది బాధ్యత తీసుకుంటాను. వాళ్ల చదువుని నేను నడిపిస్తాను'' అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు.
Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. మోదీ ట్వీట్
Also Read: అర్ధరాత్రి హైదరాబాద్‌లో ఆ బ్రిడ్జ్ మీద వెంకీ, వరుణ్! ఏం చేస్తున్నారంటే?
Also Read: శాండిల్‌వుడ్‌కు పునీత్ పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్
Madhavan Gets Trolled: సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు
Kaduva Telugu Movie Teaser: వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్
Ranga Ranga Vaibhavanga Teaser: బటర్ ఫ్లై కిస్ చూశారు, టీజర్ చూస్తారా? - వైష్ణవ్ తేజ్, కేతిక జోడీ రెడీ
Chinmayi Sripada: డాడీ డ్యూటీస్‌లో రాహుల్ రవీంద్రన్ - చిల్డ్రన్ ఫోటోలు షేర్ చేసిన చిన్మయి
CM Jagan: రూట్ మారుస్తున్న సీఎం జగన్- ప్లీనరీ తర్వాత ఆ విమర్శలకు చెక్ పెడతారట!
India vs Leicestershire: దటీజ్ విరాట్ కోహ్లీ! ఆగ్రహంతో ఇండియన్ ఫ్యాన్స్‌నీ తిట్టేశాడు!!
Hyundai Affordable EV: త్వరలో హ్యుండాయ్ చవకైన ఎలక్ట్రిక్ కారు - ప్రకటించిన కంపెనీ అధికారి!
Govt Teachers Properties : పాఠశాల విద్యాశాఖ సంచలన నిర్ణయం, టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశాలు