Anasuya Bharadwaj : వారిని చూసి సొసైటీ సిగ్గు పడాలి - ఆంటీ కామెంట్స్... నెగిటివ్ ట్రోలింగ్స్‌పై అనసూయ రియాక్షన్
Ansuya Reaction : ఆంటీ కామెంట్స్, దానికి వచ్చిన నెగిటివ్ ట్రోలింగ్స్‌పై ప్రముఖ యాంకర్, నటి అనసూయ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. ఇలాంటి వారిని చూసి సమాజం సిగ్గుపడాలని అన్నారు.

Anasuya Bharadwaj Reaction On Negative Trollings On Holi Celebrations : రీసెంట్‌గా హోలీ సంబరాల్లో యాంకర్ అనసూయకు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. స్టేజ్‌పై ఆమె ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే 'ఆంటీ ఆంటీ...' అంటూ కొందరు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆమె ఏమీ మాట్లాడకుండానే హోలీ శుభాకాంక్షలు చెప్పి వెళ్లిపోయారు. నెటిజన్లు ఆ వీడియోకు కామెంట్స్ చేయగా వాటితో కొందరు రీల్స్ చేశారు. నెగిటివ్ కామెంట్స్, ఈ రీల్స్‌పై ఆమె పోస్ట్ చేశారు.
విమర్శించడానికి మీరెవరు?
ఎన్నో ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని... తనను విమర్శించడానికి మీరెవరు? అని ప్రశ్నించారు అనసూయ. 'ఇతరుల బాధలో కూడా వినోదం వెతికే వారిని, కనీసం సానుభూతి, సామాజిక బాధ్యత లేని వారిని ఈ సొసైటీ నిలదీసే రోజు రావాలి. వయసును బట్టి హేళన చేయడం, మహిళలపై వివక్ష చేయడం ఏ మాత్రం ఆమోద యోగ్యం కాదు. ఇలాంటి వారిని చూసి సమాజం సిగ్గుపడాలి. అందరూ కూడా నాకెందుకులే అని వదిలేస్తే ఇలాంటివి కామన్ అవుతాయి.
క్రమంగా మానవత్వాన్నే కోల్పోతాం. నేను ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ఎప్పుడూ మొహమాట పడను. నేను సాధించిన విజయాలు, నా ప్రయాణం నాకెంతో గర్వకారణం. ఎన్ని విమర్శలు ఎదురైనా తట్టుకుని నిలబడిన ధైర్యమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎన్నో ఎదుర్కొని పైకి వచ్చే వారిని విమర్శించడానికి మీరు ఎవరు?' అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.

Also Read : వారం రోజులు వెడ్డింగ్ సెలబ్రేషన్స్ - విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
ట్రెండింగ్ వార్తలు























