X

Puneeth Rajkumar Death News Live Updates: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. మోదీ ట్వీట్

కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్‌ (46) ఇకలేరు. జిమ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించిందని... పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని సమాచారం.

FOLLOW US: 
ఇది చనిపోవాల్సిన వయసు కాదు: ప్రధాని నరేంద్ర మోదీ
అతని మర్యాదను మర్చిపోలేను: రాజమౌళి
రేపు సాయంత్రం పునీత్ అంత్యక్రియలు

అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంలో పునీత్ భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. అంత్యక్రియలు రేపు సాయంత్రం జరగనున్నాయి.

ఇంటికి భౌతిక కాయం తరలింపు

సదాశివనగర్‌లో ఉన్న పునీత్ రాజ్‌కుమార్ ఇంటికి భౌతిక కాయం తరలించారు.

ఈ బాధాకరమైన వార్తతో షాకయ్యా: మహేష్ బాబు
చాలా మంచి వ్యక్తి: రామ్ చరణ్
నిన్ను మిస్ అవుతాను సోదరా: సోనుసూద్
ఎంతో డౌన్ టు ఎర్త్: రామ్ పోతినేని
మరణం ఒక భయంకరమైన నిజం: ఆర్జీవీ
హృదయం బద్దలైంది: ఎన్టీఆర్
పునీత్ మరణం తీరని లోటు : బోనీ కపూర్

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ స్పందించారు. పునీత్ ఆకస్మిక మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటుడి మరణం తీరని లోటన్నారు. పునీత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ బోనీ కపూర్ ట్వీట్ చేశారు.

క‌ర్ణాట‌క రాష్ట్రవ్యాప్తంగా హైఅల‌ర్ట్‌

క‌ర్ణాట‌క రాష్ట్రవ్యాప్తంగా హైఅల‌ర్ట్‌ ప్రకటించారు.  ఆస్పత్రితో పాటు బెంగళూరులోని ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విక్రమ్ ఆసుపత్రికి చేరుకుంటున్న శాండిల్‌వుడ్ సినీ ప్రముఖులు చేరుకుంటున్నారు.  సినిమా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

పునీత్ మరణంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి

పునీత్ మరణంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పునీత్ కుటుంబానికి చిరంజీవి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కన్నడ చిత్రపరిశ్రమకు పునీత్ మరణం తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 

కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాదం

పునీత్ రాజ్‌కుమార్ మరణవార్తతో కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నడ ప్రేక్షకులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే... రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు ఇంకా పునీత్ మరణవార్తను అధికారికంగా ప్రకటించలేదు.

Background

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం (అక్టోబర్ 29) గుండెపోటుకు గురయ్యారు. జిమ్ చేస్తున్న సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చింది. దాంతో ఆయన్ను హుటాహుటిన బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. అనుభవజ్ఞులైన వైద్యుల సమక్షంలో ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఆయన మరణించాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందువల్ల... అభిమానులు, ప్రేక్షకులు ఆందోళనకు గురవుతున్నారు. పునీత్ రాజ్ కుమార్ వయసు 46 సంవత్సరాలే. ఓ గంట తర్వాత ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు వెల్లడిస్తామని వైద్యులు తెలియజేశారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

పునీత్ రాజ్ కుమార్ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిన వెంటనే... ఆయన్ను పరామర్శించడానికి ఆస్పత్రికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ వెళ్లారు. ఇంకా పలువురు కన్నడ హీరోలు, ప్రముఖులు ఆస్పత్రికి తరలి వెళ్తున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఆస్పత్రి దగ్గరకు చేరుకుంటుంన్నారు. ఇప్పటికే చాలామంది అభిమానులు ఆస్పత్రికి వచ్చారు.

పునీత్ రాజ్‌కుమార్ మరణవార్తతో కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నడ ప్రేక్షకులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే... రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు ఇంకా పునీత్ మరణవార్తను అధికారికంగా ప్రకటించలేదు.

పునీత్ మరణంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పునీత్ కుటుంబానికి చిరంజీవి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్న వయసులోనే పునీత్ కు ఇలా జరగడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. కన్నడ చిత్రపరిశ్రమకు పునీత్ మరణం తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 

పునీత్ మృతికి కేవలం శాండిల్ వుడ్ నుంచే కాక తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సెలబ్రిటీలు సైతం సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

అక్రమంగా సరిహద్దు దాటే ప్రయత్నంలో విషాదం... గడ్డ కట్టే చలికి ఇండియన్‌ ఫ్యామిలీ బలి

అక్రమంగా సరిహద్దు దాటే ప్రయత్నంలో విషాదం... గడ్డ కట్టే చలికి  ఇండియన్‌ ఫ్యామిలీ బలి

EBC Nestam: మహిళలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. జనవరి 25న రూ. 15 వేలు

EBC Nestam: మహిళలకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. జనవరి 25న రూ. 15 వేలు

Horoscope Today 22 January 2022: ఈ రాశివారు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.. మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 22 January 2022: ఈ రాశివారు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.. మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

IPL 2022 Retention: లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

IPL 2022 Retention: లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?